For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన టెలికాం చందాదార్ల సంఖ్య‌,పెరిగిన జియో వినియోగదారుల సంఖ్య

మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 116 .82 కోట్ల నుండి 116 .24 కోట్లకు పడిపోయింది. టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ 28 .95 కోట్ల కన్నా ఎక్కువ కస్టమర్లను కలిగి ఉంది. కానీ న‌వంబ‌ర్ నెల‌లో ఈ నెట్వ‌ర్క్‌లో 4

By Bharath
|

టెలికాం చందాదారుల‌ సంఖ్య నవంబర్ నెలలో 1.58 కోట్లు తగ్గి 118 .5 కోట్లకు పడిపోగా ,రిలయన్స్ జియో 15 కోట్ల కస్టమర్లతో కొనసాగుతోందని ట్రాయ్ నివేదిక వెల్లడించింది. 2017 అక్టోబర్ చివరి నాటికీ దేశంలో టెలిఫోన్ వినియోగదారుల‌ సంఖ్య 1,201 .72 మిలియన్ల నుండి 1,185 .88 మిల్లోయిన్లకు పడిపోయినది. తద్వారా నెలసరి తగ్గుదళ 1.౩౨ శతం నమోదైందని టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ అఫ్ ఇండియా పేర్కొంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో సహా కొంతమంది ఆపరేటర్లు మొబైల్ సర్వీసులను మూసివేయడం ద్వారా ఈ తగ్గుదల ఏర్పడింది.

మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 116 .82 కోట్ల నుండి 116 .24 కోట్లకు పడిపోయింది. టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ 28 .95 కోట్ల కన్నా ఎక్కువ కస్టమర్లను కలిగి ఉంది. కానీ న‌వంబ‌ర్ నెల‌లో ఈ నెట్వ‌ర్క్‌లో 43 ల‌క్ష‌ల మంది కొత్త‌గా వ‌చ్చి చేరారు ఐడియా నెట్వ‌ర్క్లో 31 .98 లక్షల మంది కొత్త వినియోగదారులను, వోడాఫోన్ 27 లక్షలు,ప్రభత్వ రంగ బిఎస్ఎన్ఎల్ 10 .8 లక్షల మందిని కలిగివున్నారు. సిస్టెమా శ్యామ్ టెలిసర్వీసెస్, ఇటీవలే ఆర్ఆర్లో విలీనం కావడంతో పాటు నంబర్లు రిపోర్ట్ చేస్తూ 32 లక్షల మంది వినియోగదారులను కోల్పోయారు సిస్టెమా శ్యామ్ టెలిసర్వీసెస్, ఇటీవలే ఆర్ఆర్లో విలీనం కావడంతో పాటు న‌వంబ‌ర్ నెల‌లో 32 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోయింది. ఎయిర్టెల్తో విలీన ప్రక్రియలో ఉన్న టాటా టెలిసర్వీసెస్, టెలినార్ కంపెనీలు 22 లక్షలు, 12.45 లక్షల వినియోగదారులను కోల్పోయాయి. ఎయిర్సెల్, ఎంటిఎన్ఎల్ వరుసగా 6.65 లక్షలు, 3,941 కస్టమర్లను కోల్పోయాయి. ల్యాండ్లైన్ చందాదారులు 2.34 కోట్ల నుంచి 2.34 కోట్లకు తగ్గాయి.పట్టణ వినియోగదారుల సంఖ్య 69.75 కోట్ల నుండి 68.48 కోట్లకు పడిపోయింది, గ్రామీణ వినియోగదారుల సంఖ్య 50.41 కోట్ల నుండి 50 కోట్లకు పడిపోయింది. బ్రాడ్బ్యాండ్ చందాదారుల సంఖ్య 34 కోట్ల నుండి 35 కోట్లకు పెరిగింది.నవంబర్ 30, 2017 నాటికి, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (15.2 కోట్లు)భారతీయ ఎయిర్టెల్ (6.72 కోట్లు), వోడాఫోన్ (5 కోట్లు), ఐడియా సెల్యూలార్ (3.29 కోట్లు), బిఎస్ఎన్ఎల్ (1.19 కోట్లు) గ ఉన్నాయని నివేదిక తెలిపింది. బిఎస్ఎన్ఎల్ బిజినెస్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో 94.3 లక్షల వినియోగదారులతో మార్కెట్లోకి వచ్చింది. త‌ర్వాతి స్థానాల్లో ఎయిర్టెల్ 21.4 లక్షలు, అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ 12.7 లక్షలు, ఎంటీఎన్ఎల్ 9.2 లక్షలు, హాత్వే కేబుల్ & డటాకోమ్ 6.9 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉన్నారు.

English summary

తగ్గిన టెలికాం చందాదార్ల సంఖ్య‌,పెరిగిన జియో వినియోగదారుల సంఖ్య | Telecom Subscriber Base Dips to Rs. 118 Crore In November

telecom subscribers dipped to below 120 crores
Story first published: Saturday, January 13, 2018, 13:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X