For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2017లో టాప్ 10 గ్లోబ‌ల్ మొబైల్ ఫోన్ బ్రాండ్లివే

నాణ్య‌మైన హ్యాండ్‌సెట్ల రూప‌క‌ల్ప‌న‌కు మొబైల్ సంస్థ‌లు బిలియ‌న్ల‌ కొద్దీ డాల‌ర్ల‌ను వెచ్చిస్తున్నారు. త‌ద్వారా వినియోగ‌దారుల సంఖ్య‌ను పెంచుకోవాల‌ని చూస్తున్నారు. మ‌రి ఆ టాప్ 10 గ్లోబ‌ల్ మొబైల్ బ్రాండ్

|

టాప్ మొబైల్ బ్రాండ్లు ఈ ఏడాది ప్ర‌పంచ టెలికాం రంగాన్ని ఒక కుదుపు కుదిపేశాయి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు లాంటివి దాదాపు ప్ర‌తి దేశంలోనూ ద‌ర్శ‌నమిస్తున్నాయి. దాదాపు మొబైల్ వాడే ప్ర‌తి ఒక్క‌రూ నేడు మెయిల్స్ చూసుకుంటున్నారు, వార్త‌లు చ‌దువుతున్నారు, గేమ్స్ ఆడుతున్నారు. సెల్‌ఫోన్ల రాక‌తో టెక్నాల‌జీ, వ్యాపారాల్లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు చోటుచేసుకున్నాయి. యాపిల్‌, సాంసంగ్ లాంటి టాప్ బ్రాండ్ల‌తో పాటు చైనా బ్రాండ్ల‌యిన హువావీ, ఒప్పో, షియోమీ, లెనోవో, వివోలు జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. 2017లో మొత్తం మొబైల్ షిప్‌మెంట్ల‌ను బ‌ట్టి టాప్ 10 గ్లోబ‌ల్ మొబైల్ ఫోన్ బ్రాండ్ల జాబితా రూపొందించారు.
వినియోగ‌దారుల ప్రాముఖ్య‌త‌లు రోజురోజుకి మారిపోతున్నాయి. అందుకే మొబైల్ ఫోన్ సంస్థ‌లు సైతం కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ముందుకొస్తున్నాయి. హై రెజ‌ల్యూష‌న్ కెమెరాలు, వేగ‌వంత‌మైన ప్రాసెస‌ర్లు, స్టైల్, సుల‌భంగా వాడే విధానం ఈ అంశాల‌న్నీ చొప్పించేందుకు మొబైల్ కంపెనీలు ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతున్నాయి. నాణ్య‌మైన హ్యాండ్‌సెట్ల రూప‌క‌ల్ప‌న‌కు మొబైల్ సంస్థ‌లు బిలియ‌న్ల‌ కొద్దీ డాల‌ర్ల‌ను వెచ్చిస్తున్నారు. త‌ద్వారా వినియోగ‌దారుల సంఖ్య‌ను పెంచుకోవాల‌ని చూస్తున్నారు. మ‌రి ఆ టాప్ 10 మొబైల్ బ్రాండ్ల విశేషాలపై ఓ క‌న్నేద్దామా...

10. అల్కాటెల్‌

10. అల్కాటెల్‌

టీసీఎల్ క‌మ్యూనికేష‌న్స్ సంస్థ అల్కాటెల్ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్ల‌ను అందిస్తుంది. ఇవి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందాయి. టెలికాంకు సంబంధించిన వ‌స్తువుల్లో, ఇంట‌ర్నెట్ కు సంబంధించిన ఉత్ప‌త్తుల్లో టీసీఎల్ అగ్ర‌గామిగా వెలుస్తోంది.

స్మార్ట్ ఫోన్ రంగంలో టీఎస్ఎల్ కు బ‌ల‌మైన సుస్థిర‌మైన స్థానముంది. దాదాపు 160 దేశాల్లో ఈ సంస్థ బ్రాండ్ ఫోన్లు ల‌భ్యం అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లే కాదు టాబ్లెట్ల రూప‌క‌ల్ప‌న‌లోనూ సంస్థ‌కు మంచి పేరుంది.

అల్కాటెల్ స్మార్ట్‌ఫోన్లను మంచి ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీతో, హై రెజ‌ల్యూష‌న్ కెమెరాలు, ట‌చ్ స్క్రీన్లు, అధిక బ్యాట‌రీ సామ‌ర్థ్యం రూపొందిస్తార‌ని సంస్థ ప‌లు సంద‌ర్భాల్లో తెలిపింది. ఈ సంస్థ‌కు చెందిన ప్ర‌ముఖ బ్రాండ్ ఫ్లాష్ ఆండ్రాయిడ్ 6.0పై న‌డుస్తుంది. 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. అల్కాటెల్‌కు సంబంధించి ఇత‌ర బ్రాండ్లు యూ5, పిక్సీ సిరీస్‌, ఐడ‌ల్ సిరీస్‌, వ‌న్ ట‌చ్ సిరీస్‌లు ఉన్నాయి. అల్కాటెల్ కేవ‌లం హై ఎండ్ క‌స్ట‌మ‌ర్స్ కోసం ఉద్దేశించింది మాత్ర‌మే కాదు త‌క్కువ బ‌డ్జెట్‌లోనూ స్మార్ట్‌ఫోన్ల‌ను అందిస్తుంది. ఇవి ఎక్కువ మంది వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తుంది.

అల్కాటెల్ అనేది అల్కాటెల్‌-లూసెంట్ కింద ట్రేడ్‌మార్క్ పొందింది. దీనికి టీఎస్ఎల్ సంస్థ ఆధ్వ‌ర్యంలో లైసెన్సు ఉంది. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్‌) కింద టీసీఎల్ సంస్థ ప‌ర్య‌వర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌తే ప‌ర‌మావ‌ధిగా స్మార్ట్‌ఫోన్ల రూప‌క‌ల్ప‌న చేస్తుంటుంది. ఎన్నో ఈవెంట్ల‌ను వేదిక‌గా చేసుకొని అనేక మొబైల్ ఫోన్లు, 4జీ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ల‌ను సంస్థ‌ విడుద‌ల చేసింది. టీసీఎల్ బ్రాండ్ కు చాలా మంది దాసోహ‌మ‌య్యారు.

అమ్ముడుపోయిన ఫోన్లు - 3.8 కోట్లు

9. జెడ్‌టీఈ

9. జెడ్‌టీఈ

ప్రపంచ అతి పెద్ద టెలికాం కంపెనీల్లో జెడ్‌టీఈ ఒక‌టి. అటు వినియోగ‌దారుల‌కు, ఇటు ఎంట‌ర్‌ప్రైజ్ సంస్థ‌ల‌కు త‌మ సేవ‌లు, ఉత్ప‌త్తుల‌ను జెడ్‌టీఈ అందిస్తుంది.

సంస్థ‌కు యూర‌ప్‌, అమెరికా, ఆసియాల‌లో వివిధ ప్ర‌దేశాల్లో రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు వ‌స‌తులున్నాయి. ఇప్ప‌టికీ 68వేల‌కు పైగా పేటెంట్ల‌ను న‌మోదుచేసుకుంది. సంస్థ‌కు 30వేల‌కు మించి ఉద్యోగులున్నారు. మొబైల్ పోటీ ప్ర‌పంచంలో జెడ్‌టీఈ ని నాణ్య‌మైన బ్రాండ్‌గా నిల‌ప‌గ‌లిగారు.

ఈ సంస్థ స్మార్ట్‌ఫోన్ డివైజ్‌ల‌నే కాకుండా వైర్‌లెస్ ఈక్విప్‌మెంట్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, ఫిక్స్‌డ్ యాక్సెస్ కు అనువైన ప‌రిక‌రాలెన్నో రూపొందించింది. ఈ సంస్థ నుంచి యాక్సాన్‌, బ్లేడ్‌, అవిడ్‌, మ్యాక్స్ సిరీస్ లాంటి ఎన్నో ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాయి.

అన్నిస్మార్ట్‌ఫోన్లు ట‌చ్‌స్క్రీన్‌, హై రెజ‌ల్యూష‌న్ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ రిక‌గ్నిష‌న్‌, లాంగ్ లాస్టింగ్ బ్యాట‌రీ, వైఫై లాంటి స‌దుపాయాల‌తో ఉన్నాయి. ఈ సంస్థ‌కు దేశ‌దేశాల్లో అనేక మంది వినియోగ‌దారులున్నారు. అనేక గ్లోబ‌ల్ టెలికాం కంపెనీల‌తో ఈ సంస్థ టై అప్‌లు కుదుర్చుకుంది. వోడాఫోన్‌, టెల్‌స్ట్రా, చైనా మొబైల్‌, ఏటీ అండ్ టీ, వ‌ర్జిన్ మొబైల్ ఈ జాబితాలో ఉన్నాయి. అందు కే ఈ సంస్థ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి పేరు వ‌చ్చింది. బ‌ల‌మైన బ్రాండ్ ను కొన‌సాగించేలా ఈ సంస్థ అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంది.

టీవీ, ప్రింట్‌, హోర్డింగ్స్ రూపంలో సంస్థ మార్కెటింగ్ బాగా చేసింది. అనేక ఆట‌ల ఈవెంట్ల‌కు స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా బ్రాండ్ విలువ‌ను మ‌రింత పెంచుకుంది. జ‌ర్మ‌న్ ఫుట్‌బాల్ లీగ్‌గా స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. రోనాల్డోను బ్రాండ్ ప్ర‌చార‌క‌ర్త‌గా నియ‌మించుకుంది. చైనాలో దిగ్గ‌జ బ్రాండ్‌గా కొన‌సాగుతోంది.

అమ్ముడుపోయిన ఫోన్లు - 5.4 కోట్లు

8. లెనోవో

8. లెనోవో

లెనోవో ప్ర‌ముఖ చైనా ఫోన్ల త‌యారీ సంస్థ‌గా పేరొందింది. వివిధ ర‌కాల స్మార్ట్‌ఫోన్ల‌ను ఈ సంస్థ రూపొందిస్తుంటుంది. సంస్థ‌లో 60వేల‌కు మించి ఉద్యుగులు ప‌నిచేస్తున్నారు. 1984లో స్థాపిత‌మై ఎల‌క్ట్రానిక్స్ రంగంలో తిరుగులేనిది సంస్థ‌గా ఎదిగింది. 2013లో మొబైల్‌, స్మార్ట్‌ఫోన్ల విభాగంలోకి చేరింది. అప్ప‌టి నుంచి అలుపెరుగ‌ని వృద్ధిని న‌మోదుచేస్తూనే ఉంది.

లెనోవోకున్న ఉత్ప‌త్తి ప్లాంట్లుల ద్వారా ఏటా 40 మిలియ‌న్ హ్యాండ్‌సెట్ల‌ను రూపొందించే అవ‌కాశం ఉంది. చైనాలో స్థిర‌మైన అమ్మ‌కాల‌ను జ‌రుపుతూ అక్క‌డ అగ్ర‌గామిగా ఎదిగింది. వైబ్‌, కె-సిరీస్‌, జెడ్ సిరీస్‌, ఫాబ్ లాంటి వినూత్న మోడల్ ఫోన్ల‌ను లెనోవో అందించింది.

యాపిల్‌, సామ్‌సంగ్ లాంటి దిగ్గ‌జాల‌కు గ‌ట్టి పోటీని లెనోవో ఇస్తుంది. త‌న సేల్స్ చానెల్ ద్వారా మార్కెట్ లీడ‌ర్‌గా ఎదిగేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంది. మైక్రోసాఫ్ట్‌తో క‌లిసి మోట‌రోలాను కొనుగోలు చేసి స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలోనే కొత్త ఒర‌వ‌డిని సృష్టించింది. టీవీ, ఇంట‌ర్నెట్‌, మ్యాగ‌జైన్ల ద్వారా అశ్వ వేగంతో ప్ర‌చారం చేసిన ఘ‌న‌త లెనోవోకే ద‌క్కుతుంది. రిటైల్ అవుట్‌లెట్ల ద్వారానే కాకుండా ఇ-కామ‌ర్స్ పోర్ట‌ళ్లు, సొంత వెబ్‌సైట్ ద్వారా అమ్మ‌కాల‌ను ముమ్మ‌రం చేసింది. ఈ అమ్మ‌కాల వ్యూహ‌మే లెనోవా బ్రాండ్‌ను ఇత‌ర స్మార్ట్‌ఫోన్ల క‌న్నా ఎంతో మిన్న‌గా మ‌ల‌చ‌గ‌లిగింది.

అమ్ముడుపోయిన ఫోన్లు - 5.6 కోట్లు

7.షియోమీ

7.షియోమీ

షియోమీ స్మార్ట్‌ఫోన్ల‌కు ఈ మ‌ధ్యే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ ల‌భిస్తోంది. చైనాకు చెందిన ఈ సంస్థ ప్ర‌పంచంలో అగ్ర‌గామిగా వెలుగొందుతుంది. 2010లో స్థాపిత‌మైన ఈ సంస్థ అన‌తికాలంలోనే అత్యంత ప్ర‌జాదర‌ణ పొందింది. హై క్వాలిటీ ఫోన్ల‌ను త‌క్కువ ధ‌ర‌కు అందించ‌డ‌మే సంస్థ విజ‌యానికి కార‌ణంగా చెప్పుకుంటారు. 8వేల మంది ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి తోడ్ప‌డుతున్నారు.

షియోమీకి చైనాతో పాటు భార‌త్‌, సింగ‌పూర్‌, మ‌లేషియాల‌లో బ‌ల‌మైన ఉత్ప‌త్తి, నిర్వ‌హ‌ణ కేంద్రాలున్నాయి. మొబైల్ ఫోన్లు కాకుండా టాబ్లెట్లు, గృహోప‌క‌ర‌ణాలు, ల్యాప్ టాప్‌ల‌ను సంస్థ త‌యారుచేస్తుంది. సంస్థ లోగోను ఎంఐ గా రాయ‌డానికి కార‌ణం మొబైల్ ఇంట‌ర్నెట్‌. అయితే దీన్ని అంద‌రూ మిష‌న్ ఇంపాజిబుల్‌గా అభివ‌ర్ణించుకుంటారు. ఫోన్ల మార్కెట్లో అసాధ్యం కాద‌నుకున్న ఎన్నో వాటిని సుసాధ్యం చేయ‌గ‌లిగినందుకే ఆ పేరు వ‌చ్చిందంటారు. నోట్ ప్రో, నోట్‌, ఎంఐ 4, రెడ్‌మీ 2, ఎంఐ బ్యాండ్ లాంటి ఎన్నో ఫోన్ల‌ను సంస్థ రూపొందించింది. ఈ ఫోన్ల‌ను త‌క్కువ ధ‌ర‌కే అందివ్వ‌డం సంస్థ ప్ర‌త్యేక‌త‌. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ‌ట్టుగా సంస్థ ఫోన్ల‌ను రూపొందించింది. స్మార్ట్ వాచీలు, బ్యాండ్‌ల‌ను కూడా త‌యారుచేస్తుంది. ఆసియా మార్కెట్లో అగ్ర‌గామిగా నిలుస్తోంది. అనేక సంప్ర‌దాయ ప్ర‌చారాలు, టీవీ, ఆన్‌లైన్, ప్రింట్ మాధ్య‌మాల ద్వారా విస్తృత ప్ర‌చారం చేస్తుంది.

అమ్ముడుపోయిన ఫోన్లు - 5.9 కోట్లు

6. ఎల్‌జి

6. ఎల్‌జి

కొరియాకు చెందిన ఎల్‌జి సంస్థ వినియోగ‌దారుల ఎల‌క్ట్రానిక్స్, మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీలో విఖ్యాతి గాంచింది. 1947లో ప్రారంభించిన‌నాటి నుంచి సంస్థ మంచి వార‌స‌త్వాన్ని నిలుపుకుంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంస్థ‌కు ముందునుంచే మంచి పేరుంది. స్మార్ట్‌ఫోన్ల రంగంలోకి మ‌రింత బ‌ల‌మైన పంథాతో ప్ర‌వేశించింది. సంస్థ‌లో 2లక్ష‌ల‌కు పైగా ఉద్యోగులు త‌మ సేవ‌ల‌ను అందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విభాగంలో ప‌డుతూ లేస్తూ బాగా వృద్ధి చెందింది.

మొబైల్ డివైజెస్ విభాగంలో ఎల్ జి ఎల‌క్ట్రానిక్స్‌కు భారీ వాటా ఉంది. స్మార్ట్‌ఫోన్లే కాదు టాబ్లెట్లు, స్మార్ట్ వాచీల‌ను సైతం సంస్థ రూపొందిస్తుంది. 2013లో స్మార్ట్ ఫోన్ విభాగంలో సంస్థ ప్ర‌వేశించింది. అప్ప‌టి నుంచి కొత్త మోడ‌ళ్ల‌ను త‌యారుచేసుకుంటూ వ‌స్తోంది. ఎల్‌జి జీ సిరీస్‌, స్టైల‌స్‌, స్పిరిట్‌, కె-సిరీస్‌, వి-సిరీస్‌ల‌లో వివిధ స్మార్ట్‌ఫోన్ మోడ‌ళ్ల‌ను తీసుకొచ్చింద ి. టీవీ, ఆన్‌లైన్ యాడ్స్‌, మ్యాగ‌జైన్లు, వార్తాప‌త్రిక‌ల ద్వారా వీటికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించింది. ఎల్‌జి బ్రాండ్ 120 దేశాల‌కు పైగా ల‌భిస్తుంది. అంతేకాదు ఫార్ములా 1, స్నూక‌ర్ కాంపిటీష‌న్‌, ఫ్యాష‌న్ ఈవెంట్ల‌కు సంస్థ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. దీంతో స్మార్ట్‌ఫోన్ విభాగంలో త‌న‌దైన ముద్ర వేసుకుంది.

అమ్ముడుపోయిన ఫోన్లు - 6.2 కోట్లు

5. వివో

5. వివో

వివో చైనా ఫోన్ల బ్రాండ్‌. ఇది బీబీకే ఎల‌క్ట్రానిక్స్ కు చెందింది. ఇదే ఓపోను కూడా సొంతంచేసుకుంది. డాంగ్యున్ అనే ప్రావిన్స్‌లో వివో ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. వివోను 2009లోనే స్థాపించినా ఎక్స్ 1 మొబైల్ ఆరంగేట్రంతో ప్ర‌శ‌స్తిలోకి వ‌చ్చింది. వివో ఫోన్ల‌లో వాడే హై ఫై చిప్‌ల వ‌ల్లే స్మార్ట్‌ఫోన్ల ప‌ర్‌ఫామెన్స్ బ‌లంగా ఉంటుంది.

వివోలో స్మార్ట్ అనే ఇంట‌రాక్టివ్ సిస్ట‌మ్ ఉండ‌టం మూలానే ఈ ఫోన్ల‌కు ప్ర‌త్యేకత సంత‌రించుకుంది. ఎక్కువ‌గా సృజ‌నాత్మ‌క‌త‌ను సంస్థ ప్రోత్స‌హిస్తుంది. అందుకే కేవ‌లం ప‌రిశోధ‌నాభివృద్ధి విభాగానికి 3వేల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. కెమెరా, మ్యూజిక్ ఫోన్‌గా వివో అభివ‌ర్ణించుకుంటుంది. అనేక స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను వేదిక‌గా చేసుకొని సంస్థ ప్ర‌చారం చేసుకుంటుంది.

వివో నుంచి విడుద‌ల అయిన ఫోన్ల‌లో

1) వి5 విత్ మూన్‌లైట్ కెమెరా

2) వి5 ప్ల‌స్ విత్ డ్యుయ‌ల్ ఫ్రంట్ కెమెరా

3) వై సిరీస్‌లు

సంస్థ‌లో 20వేల మంది ప‌నిచేస్తున్నారు. మార్కెట్‌లో 2012 నుంచి క్రియాశీల‌కంగా ఉంటుంది. భార‌త్‌, మ‌లేషియా, వియ‌త్నాం, ఫిలిప్పీన్స్‌, మ‌య‌న్మార్‌, ఇండొనేషియా త‌దిత‌ర దేశాల్లో సంస్థ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంది. ఇదెప్పుడూ నాణ్య‌మైన వాటినే త‌యారుచేస్తుంది. ప‌రిశోధ‌నా అభివృద్ధి సంస్థ‌ల‌న్నీ చైనాలోనే ఉన్నాయి. హార్డ్‌వేర్ డిజైన్‌, ఉత్ప‌త్తి, సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని స� �స్థ సొంతంగా చేసుకోవ‌డం విశేషం.

అమ్ముడుపోయిన ఫోన్లు- 7.2 కోట్లు

4. ఓప్పో

4. ఓప్పో

ఓప్పో కూడా చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండే. 2001లో చైనాలోని డాంగ్విన్ ప్రావిన్స్‌లో ఈ సంస్థ‌ను స్థాపించారు. ఇది బీబీకే ఎల‌క్ట్రానిక్స్ సొంతం. ఇదే సంస్థ వివో, వ‌న్ ప్ల‌స్ లాంటి బ్రాండ్ల‌ను సొంతం చేసుకుంది.

స్మార్ట్‌ఫోన్ల విభాగంలో అత్యంత వేగంగా ఎదిగిన సంస్థ ఓపో. 2015-16లో బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ల స్వ‌రూపాన్నే ఓపో మార్చేసింది. చైనాలోనే కాకుండా భార‌త్‌, అమెరికాలోను ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.

ఓపో చాలా సృజ‌నాత్మ‌కత కూడిన ఫోన్ల‌ను త‌యారుచేస్తుంది. ఎన్1, ఎన్‌3 డిజైన్లు తొలుత వ‌చ్చాయి. మార్కెటింగ్ ప‌రంగా ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తుంది ఈ సంస్థ‌. మ‌న దేశంలో క్రికెట్‌ను స్పాన్స‌ర్ చేస్తుంది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణె దీనికి ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదే విధంగా ఇత‌ర దేశాల్లో ఆయా దేశాల‌కు చెందిన సెల‌బ్రిటీల‌తో ప్రచారం క‌ల్పిస్తుంది. ఓపో ఎ ఫ్1, ఎఫ్‌3, ఆర్ 5, ఆర్‌7, ఎన్‌1, ఎన్ 3 సిరీస్‌లు విడుద‌ల‌య్యాయి. ఓపో మిర్ర‌ర్‌, ఫైండ్ అనే స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాయి.

ప్ర‌ధానంగా కెమెరా ఫోన్లుగా ఓపోకు పేరుంది. కెమెరా ఫీచ‌ర్ల‌పైన‌, వాటిని మ‌రింత హంగులు జోడించేందుకు సంస్థ తీవ్రంగా కృషి చేస్తుంది. సెల్ఫీ ఎక్స్‌ప‌ర్ట్ ఫీచ‌ర్ల ఓపోకు సొంతం. యువ‌త‌ను ఆక‌ర్షించ‌డంలో ముందుంది. 2008లో ఓపో బ్రాండ్ ప్రారంభ‌మైనా గ‌త రెండేళ్ల‌లోనే బాగా పుంజుకుంది. 21 దేశాల్లో ఓపో ఫోన్ అందుబాటులో ఉంది. క్వాల్‌కామ్‌తో ఓపో భాగ‌స్వామ్యం చేసుకొని వినూత్న ఉత్ప‌త్తు� �‌ను అందిస్తుంది.

అమ్ముడుపోయిన ఫోన్ల సంఖ్య‌- 8.5 కోట్లు

 3. హువావీ

3. హువావీ

చైనాకు చెందిన మొబైల్ త‌యారీ సంస్థ. టెలికాం ప‌రిక‌రాలను సైతం త‌యారుచేస్తుంది. షెంజ‌న్ ప్రావిన్స్‌లో హువావీ ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. 1987లో ఈ సంస్థ‌ను స్థాపించ‌గా, 2003లో ఫోన్ల యూనిట్‌ను ప్రారంభించారు. హువావీ క‌న్జూమ‌ర్ బిజినెస్ గ్రూప్ మొబైల్ ఫోన్ సిరీస్‌ల‌పై దృష్టి పెడుతుంది. దాదాపు 170 దేశాల్లో అమ్మ‌కాలు జరుపుతుంది ఈ సంస్థ‌. ప‌రిశోధ‌నాభివృద్ది విభాగంలోనే 7వేల మంది ప‌ని చేస్తున్నారు. హువావీ బ్రాండ్‌లో మేట్‌, పీ, జీ, వై, నెక్స‌స్ సిరీస్ ఫోన్‌లు వ‌చ్చాయి.

ఈ బ్రాండ్ వినూత్న‌త‌కు పెట్టింది పేరు. దాదాపు 12 వేల పేటెంట్ల‌ను పొందిన‌ట్టు సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. టాబ్లెట్ల త‌యారీలోనూ హువావీది ప్ర‌త్యేక పాత్రే. బోరూసియా డార్ట్‌ముండ్ అనే ఫుట్‌బాల్ టీమ్‌కు ఈ సంస్థ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. రియ‌ల్ మాడ్రిడ్‌, అథ్లెటిక్ బిల్బావో లాంటి ఇత‌ర ఫుట్‌బాల్ టీమ్‌ల‌తోనూ ఇది జ‌ట్టు క‌ట్టింది. మ‌న దేశంలో ఐపీఎల్ జ‌ట్ల‌లో రా� �‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తుంది. ఈ స్పాన్స‌ర్ షిప్ల వ‌ల్ల ఐరోపా, ఆసియాల‌లో సంస్థ బ‌లంగా విక‌సిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంస్థ‌కు 1.8ల‌క్ష‌ల మంది ఉద్యోగులున్నారు. రెన్ జెంగ్ ఫీ సంస్థకు సీఈఓగా వ్య‌వ‌హరిస్తున్నారు.

అమ్ముడుపోయిన ఫోన్లు- 13.9 కోట్లు

2. యాపిల్‌

2. యాపిల్‌

అమెరికాకు చెందిన ఈ సంస్థ గురించి తెలియని వాళ్లు బ‌హుశా చాలా అరుదేమో. కాలిఫోర్నియాలోని క్యూప‌ర్టినోలో సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. ప్ర‌ఖ్యాత ఐ-ఫోన్ల గురించి తెలిసిందే. అది యాపిల్ సంస్థదే. స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్‌, రోనాల్డ్ లు క‌లిసి ఈ సంస్థ‌ను కంప్యూట‌ర్ సంస్థ‌గా స్థాపించ‌గా ఇప్పుడు ఎక్కువ భాగం ఆదాయం మొబైల్ ఫోన్ల ద్వారానే స‌మ‌కూరుతుంది. ప్ర‌పంచంలోని అత� ��పెద్ద సంస్థ‌ల్లో ఇది ఒక‌టి. యాపిల్ నుంచి వ‌చ్చిన వివిధ ఉత్ప‌త్తులు - ఐ ఫోన్‌, ఐపాడ్‌, ఐఓఎస్‌, ఐ ట్యూన్స్‌, యాపిల్ మ్యూజిక్‌, యాపిల్ ఆన్‌లైన్‌స్టోర్‌.

ఐఓఎస్ కాకుండా ఆండ్రాయిడ్‌, విండోస్‌లే మొబైళ్ల ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌ను శాసిస్తున్నాయి. ఐఫోన్‌తోనే సంస్థ‌కు బాగా పేరొచ్చింది. హై క్వాలిటీ, బ్రాండ్ అంటే యాపిల్ అన్నంతగా సంస్థ ఎదిగింది. కేవ‌లం ఐ ఫోన్‌ను ఫోన్‌లా చూడ‌కుండా ఒక ప్ర‌త్యేక గుర్తింపుగా కొన్ని దేశాల్లో దీన్ని చూస్తారు. ఇక కొత్త‌గా ఐ ఫోన్‌ను తెస్తున్నారంటే జ‌నాలు క్యూ క‌డ‌తారు. సామ్‌సంగ్‌, ఎల్‌జి, ఓపో, వివో ల ాంటి బ్రాండ్ల‌తో గ‌ట్టి పోటీనెదుర్కున్నా టాప్ జాబితాలో సంస్థ చోటు ద‌క్కించుకుంటూనే ఉంది. ఐఫోన్ 7 బాగానే స‌క్సెస్ అయ్యింది కానీ ముంద‌టి మోడ‌ళ్లంత కాదు. ఇక ఐఫోన్ 10 అయితే ఫేస్ లాక్ ఐడీ తో అద‌ర‌గొట్టింది. కొత్త ప్ర‌భంజ‌నాన్నే సృష్టించింది. యాపిల్‌కు ఉన్న అభిమానుల వ‌ల్ల సంస్థ అభివృద్ధికి ఏ మాత్రం ఢోకాలేదు.

అమ్ముడుపోయిన ఫోన్లు- 21.5 కోట్లు

1. శ్యామ్‌సంగ్‌

1. శ్యామ్‌సంగ్‌

ద‌క్షిణ కొరియాకి చెందిన మొబైల్ త‌యారీ సంస్థ శ్యామ్‌సంగ్‌. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ల‌భ్య‌మ‌వుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థ టాప్ పొజిష‌న్‌లో కొన‌సాగుతుంది. గెలాక్సీ సిరీస్ ఫోన్ల‌తో యాపిల్‌కు గ‌ట్టిపోటినిస్తుంది. ఇటీవ‌ల గెలాక్సీ ఎస్ 8ను విడుద‌ల చేసి మంచి ప్ర‌శంస‌లు అందుకొంది. సామ్‌సంగ్ ఎల‌క్ట్రానిక్స్ దాదాపు 80దేశాల్లో సేవ‌ల‌ను అందిస్తుంది. సుమారు 3.5ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఈ సంస్థ కోసం ప‌నిచేస్తున్నారు. క్వాన్ ఓ హ్యుయాన్ ఈ సంస్థ సీఈఓ. నోట్ 7 ఫోన్ విడుద‌ల చేసిన త‌ర్వాత నుంచి బ్యాట‌రీ స‌మ‌స్య‌ల‌తో సంస్థ పెద్ద మొత్తంలోనే న‌ష్టాల‌ను చ‌విచూసింది. దీంతో పాటే బ్రాండ్ విలువ‌ను పోగొట్టుకుంది. ఎస్‌8 విడుద‌ల‌తో మ‌ళ్లీ మార్కెట్‌లో పుంజుకోగ‌లిగింది. ఎస్‌8లో ఇన్‌ఫినైట్ డిస్‌ప్లే వ‌ల్ల త‌న ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. సామ్‌సంగ్ ఎస్‌7, నోట్‌7, ఎస్‌8లు ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన‌వి.

1969లో ఈ సంస్థ స్థాపిత‌మైంది. ఇప్పుడు ప్ర‌పంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఇదీ ఒక‌టి. అయితే యాపిల్‌తో పోటీలో నిల‌దొక్కుకోవాలంటే సంస్థ మ‌రిన్ని సృజ‌నాత్మ‌క‌త‌ల‌తో ముందుకు రావాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.

స్మార్ట్ ఫోన్ల‌కు బీమా సౌక‌ర్యాన్ని ప్రారంభించిన పేటీఎమ్‌

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదార్లకు ‘మొబైల్‌ రక్షణ పథకం' అందించనున్నట్లు పేటీఎం మాల్‌ ప్రకటించింది. ప్రమాదవశాత్తు జరిగే నష్టాల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు రక్షణ లభిస్తుందని తెలిపింది. ఈ పథకంలో భాగంగా ఫోన్‌ తెరకు ఏర్పడే నష్టం, లిక్విడ్‌ నష్టం, చోరీ సహా వివిధ ప్రమాదాల నుంచి ఏడాది పాటు బీమా ఉంటుందని వెల్లడించింది. ఫోన్‌ ధరలో దాదాపు 5 శాతానికి ఈ సేవలు లభిస్తాయని పేటీఎం మాల్‌ వివరించింది. యాపిల్‌, షియామీ, మోటరోలా, వివో, ఓపోతో పాటు వివిధ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్‌ లభించనుంది.

అమ్ముడ‌యిన ఫోన్లు-30.6 కోట్లు

 మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి 10 మంచి పెట్టుబ‌డి మార్గాలు

మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి 10 మంచి పెట్టుబ‌డి మార్గాలు

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయంమ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

 పిల్ల‌ల కోసం 6 ఉత్త‌మ బ్యాంకు ఖాతాలు

పిల్ల‌ల కోసం 6 ఉత్త‌మ బ్యాంకు ఖాతాలు

 పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు

 ప్ర‌ధాన‌మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రుణం-అర్హ‌త‌లు-ప్ర‌యోజ‌నాలు

ప్ర‌ధాన‌మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రుణం-అర్హ‌త‌లు-ప్ర‌యోజ‌నాలు

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణంప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

 క్ర‌మంగా దీర్ఘ‌కాలంలో మంచి డ‌బ్బు సంపాదించేందుకు ఆర్‌డీ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది

క్ర‌మంగా దీర్ఘ‌కాలంలో మంచి డ‌బ్బు సంపాదించేందుకు ఆర్‌డీ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది

 రిక‌రింగ్ డిపాజిట్ పెట్టుబ‌డుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది? రిక‌రింగ్ డిపాజిట్ పెట్టుబ‌డుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది?

బంగారం ధ‌ర మార్పుకు 10 ముఖ్య కార‌ణాలు

బంగారం ధ‌ర మార్పుకు 10 ముఖ్య కార‌ణాలు

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలుబంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

Read more about: mobiles phones telecom
English summary

2017లో టాప్ 10 గ్లోబ‌ల్ మొబైల్ ఫోన్ బ్రాండ్లివే | Top 10 global phone brands in the world in 2017

Top mobile brands have taken the world by storm in recent years. Mobile Phones, Smartphones and devices are present in almost every country in the world. Every person accesses mail, news, games, work on a mobile phone today. Mobiles are changing the technology and business alike. Top mobile brands include Apple, Samsung and Chinese brands like Huawei, Oppo, Xiaomi, Lenovo and Vivo followed by LG, ZTE and TCL. Here is the list of top 10 global mobile phone brands in the world 2017 based on number of total mobile shipments.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X