For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబ‌రు నెల‌లో పుంజుకున్న త‌యారీ రంగ వృద్ది

దేశ తయారీ రంగం (మానుఫాక్చరింగ్ సెక్టర్) నిరుడు డిసెంబర్ నెలలో బాగా పుంజుకుంది. గత అయిదేళ్ల కాలంలో ఏ నెలలోనూ లేనంతగా అత్యంత వేగంగా వృద్ధి చెందింది.

|

భార‌త‌దేశ‌ త‌యారీ రంగం గాడిన ప‌డుతోందా...
దేశ తయారీ రంగం (మానుఫాక్చరింగ్ సెక్టర్) నిరుడు డిసెంబర్ నెలలో బాగా పుంజుకుంది. గత అయిదేళ్ల కాలంలో ఏ నెలలోనూ లేనంతగా అత్యంత వేగంగా వృద్ధి చెందింది. డిసెంబర్ నెలలో నిర్వహణ పరిస్థితులు చాలా వేగంగా మెరుగుపడటంతో పాటు కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం వల్ల తయారీ రంగం గత అయిదేళ్ల కాలంలో అత్యంత వేగంగా వృద్ధి చెందిందని ఒక నెలవారీ సర్వే వెల్లడించింది. నిరుడు నవంబర్‌లో 52.6 శాతం ఉన్న నిక్కీ ఇండియా మానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) డిసెంబర్‌లో 54.7 శాతానికి పెరిగింది. మూడు ప్ర‌ధాన వ‌ర్గాలైన‌ కన్జ్యూమర్, ఇంటర్మీడియెట్, ఇనె్వస్ట్‌మెంట్‌లు వృద్ధి సాధించడం వల్ల డిసెంబర్ నెలలో తయారీ రంగం వేగంగా వృద్ధి చెందింది. ఈ సూచీ 50 పాయింట్లకు పైన నమోదు కావడం వరుసగా ఇది అయిదో నెల. 2012 డిసెంబర్ నుంచి చూస్తే గత డిసెంబర్‌లో ఉత్పత్తి వేగంగా విస్తరించడం, 2016 అక్టోబర్ నుంచి చూస్తే గత డిసెంబర్‌లో కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం వల్ల తయారీ రంగంలో వేగవంతమైన వృద్ధి సాధ్యమయిందని ఐహెచ్‌ఎస్ మార్కిట్‌కు చెందిన ఆర్థికవేత్త, ఈ నివేదకను రూపొందించిన ఆష్నా డోదియా పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి గట్టి డిమాండ్ ఉండటం తయారీ రంగం వేగంగా వృద్ధి చెందడానికి దారితీసిందని వివరించారు.

 త‌యారీ రంగ వృద్ది
2017 సంవత్స‌ర అంతంలో ఇండియన్ త‌యారీదార్లు తమ సిబ్బంది స్థాయిలను పెంచారు. నిజానికి, 2012 ఆగస్టు నుంచి ఉద్యోగాల కల్పన పటిష్ఠమైన స్థాయికి వేగంగా పెరిగిందని ఈ సర్వే వెల్లడించింది.

జూలై ఒకటో తేదీ నుంచి దేశంలో అమలులోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల ముడి సరుకుల ధరలు బాగా పెరిగాయని డోదియా తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఇటీవలి షాక్‌లకు సర్దుబాటు కావలసి ఉందని, అందువల్ల ఆర్థిక వ్యవస్థ ముంగిట ఇంకా సవాళ్లు నిలిచే ఉన్నాయని, అయితే సర్వే చరిత్రను పరిశీలిస్తే మొత్తంమీద వృద్ధి పథం పైకి ఎగబాకే ధోరణి బాగా ఉందని పేర్కొన్నారు.

Read more about: growth pmi
English summary

డిసెంబ‌రు నెల‌లో పుంజుకున్న త‌యారీ రంగ వృద్ది | The Nikkei India Manufacturing Purchasing Managers’ Index (PMI) for December is at 5 year high

The Nikkei India Manufacturing Purchasing Managers’ Index (PMI) for December came in at a five-year high, but the stock market barely moved, with the Sensex closing the day absolutely flat.
Story first published: Wednesday, January 3, 2018, 11:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X