For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ గ్యాస్ లింకేజీపై యూఐడీఏఐ ప్ర‌క‌ట‌న‌

ఇక‌పై బ్యాంకు ఖ‌తా మారిన‌ప్పుడు ల‌బ్దిదారుడి అనుమ‌తి తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని భార‌త విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ‌(యూఐడీఏఐ) స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు అన్ని బ్యాంకుల‌కు, గ్యాస్ సంస్థ‌ల‌కు ఆదేశ

|

వినియోగ‌దారుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేసే ప్ర‌భుత్వ రాయితీ విష‌యంలో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా నెలకొన్న ప్ర‌తిష్టంభ‌న‌కు యూఐడీఏఐ ముగింపు ప‌లికింది. ఇక‌పై బ్యాంకు ఖ‌తా మారిన‌ప్పుడు ల‌బ్దిదారుడి అనుమ‌తి తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని భార‌త విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ‌(యూఐడీఏఐ) స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు అన్ని బ్యాంకుల‌కు, గ్యాస్ సంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మార్పుకు సంబంధించి విష‌యాన్ని వివ‌రంగా ల‌బ్దిదారుడికి 24 గంట‌ల్లోపు సంక్షిప్త సందేశాలు, ఈ-మెయిల్ ద్వారా జారీ చేయాల‌ని కోరితే ఆ త‌ర‌హా అవ‌కాశం సైతం క‌ల్పించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు యూఐడీఏఐ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

బ్యాంకు ఖాతాలోకి ఎల్పీజీ స‌బ్సిడీ సొమ్ము

సిమ్ కార్డుల‌ను ఆధార్తో అనుసంధానించే సాకుతో ఎయిర్టెల్ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈ విధ‌మైన ఆదేశాల‌ను ఇవ్వాల్సి వ‌చ్చింది. దేశీయ టెలికాం దిగ్గ‌జం ఎయిర్టెల్ క‌స్ట‌మ‌ర్లు మొబైల్ సిమ్ వెరిఫికేష‌న్ రుజువు కోసం స‌మ‌ర్పించిన ఆధార్ వివ‌రాల‌ను వారికి తెలియ‌కుండా పేమెంట్ బ్యాంకు ఖాతాల‌ను తెరిచి, అందులోకి గ్యాస్ స‌బ్సిడీని మ‌ళ్లించే ప‌ని చేసింది. దీంతో సిమ్‌ కార్డులు, బ్యాంకు క్లయింట్లకు ఆధార్‌తో లింక్‌ అయ్యే ఈ-కేవైసీ వెరిఫికేషన్‌ను చేపట్టకుండా భారతీ ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది.

Read more about: uidai gas
English summary

ఆధార్ గ్యాస్ లింకేజీపై యూఐడీఏఐ ప్ర‌క‌ట‌న‌ | Airtel Fiasco: Consumer Nod Must For Changing Subsidy-Receiving Bank Account, Says UIDAI

To avoid a repeat of Bharti Airtel-type fiasco, the Aadhaar-issuing authority UIDAI on Tuesday directed banks to seek an explicit consent of the beneficiary before changing the account to which the government subsidy is being remitted.Also, the banks have been asked to intimate the beneficiary about the change within 24-hours through SMS and e-mail as well as provide an option to the person to reverse the change, according to a Gazette notification issued by the Unique Identification Authority of India (UIDAI).
Story first published: Wednesday, December 20, 2017, 12:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X