For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సామాజిక అవ‌స‌రాల‌కు మిలాప్ క్రౌడ్ ఫండింగ్

అత్యవసర వైద్య చికిత్సలు, ఉన్నత చదువులకు, ఆటలలో నిపుణుల శిక్షణకు దూరమవుతున్న వారికి డ‌బ్బులు హ‌ఠాత్తుగా కావాలంటే చాల క‌ష్టం. ఇలా ఇబ్బంది పడుతున్న వారికి మిలాప్‌ఒఆర్‌జి మద్దతునిస్తుందని ఆ సంస్థ అధ్యక్షు

|

అత్యవసర వైద్య చికిత్సలు, ఉన్నత చదువులకు, ఆటలలో నిపుణుల శిక్షణకు దూరమవుతున్న వారికి డ‌బ్బులు హ‌ఠాత్తుగా కావాలంటే చాల క‌ష్టం. ఇలా ఇబ్బంది పడుతున్న వారికి మిలాప్‌ఒఆర్‌జి మద్దతునిస్తుందని ఆ సంస్థ అధ్యక్షులు అనోజ్‌ విశ్వనాథం పేర్కొన్నారు. అపదలో ఉన్న వారి తరుపున తమ సంస్థ ఆన్‌లైన్‌లో క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సమీకరిస్తుందన్నారు. సమస్యను తమ దృష్టికి తెస్తే అది వాస్తవం అవునో, కాదో 24 గంటల్లో విచారణ చేసి నిర్ధారించుకుంటామన్నారు.
అనంతరం క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సేకరించిన నిధులను అవసరమైన కార్యము నిమిత్తము ప్రత్యక్షంగా ఆ కార్యక్రమానికి చెల్లిస్తామన్నారు.

 మిలాప్ క్రౌడ్ ఫండింగ్

వ్య‌క్తిగ‌త‌, సామాజిక అవ‌స‌రాల‌కు క్రౌడ్ ఫండింగ్ ద్వారా డ‌బ్బు స‌మ‌కూర్చే సంస్థ మిలాప్. ఇది ఒక ఆన్‌లైన్ క‌మ్యూనిటీ సంస్థ‌. దీని ద్వారా ప్ర‌పంచంలోని 120 దేశాల నుంచి వివిధ వ్య‌క్తుల నుంచి సామాజిక అవ‌స‌రాలు, సాంఘిక కార్య‌క్ర‌మాల‌కు డ‌బ్బు సేక‌రిస్తారు. వివిధ దేశాల్లో దీనికి దాత‌లు ఉన్నారు. భార‌త‌దేశఃలో ఇప్ప‌టిదాకా 49.310 ప్రాజెక్టుల‌కు గాను 90.18 కోట్ల‌ను మిలాప్ సేక‌రించి పెట్టింది.

మిలాప్ సంస్థ 2010లో ప్రారంభ‌మైంది. మొద‌ట గ్రామీణ పేద‌ల‌కు సూక్ష్మ రుణాలు అందించాల‌నే ఉద్దేశంతో దీన్ని మొద‌లుపెట్టారు. ల‌బ్దిదారుల‌ను ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా అతి జాగ్ర‌త్త‌గా ఎంపిక చేస్తారు. అయితే అక్టోబ‌ర్ 2014 నుంచి ఈ సంస్థ త‌న స్వ‌రూపాన్ని మార్చుకుంది. ప్రాముఖ్య‌త బ‌ట్టి సామాజిక అవ‌స‌రాల నిమిత్తం వివిధ వ్య‌క్తుల‌కు విద్య‌, వైద్య ఖ‌ర్చుల‌కు అవ‌స‌ర‌మైన డ‌బ్బులు సేక‌రించేందుకు క్రౌడ్ ఫండింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఫండ్ సేక‌రించి, అవ‌స‌ర‌మైన వ్య‌క్తికి అందించేందుకు ఈ సంస్థ 5% చార్జీ వ‌సూలు చేస్తుంది. ఎందుకంటే వీరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, వెబ్‌సైట్ నిర్వ‌హించాలి క‌నుక‌.
ఇప్ప‌టిదాకా ఈ సంస్థ ఎక‌న‌మిక్ టైమ్స్ 2014,15లో నిర్వ‌హించిన టాప్ 5 సామాజిక సంస్థ‌ల జాబితాలో, అదే విధంగా ఫోర్బ్ష్ 2014 ఫోర్బ్స్ 30 అండ‌ర్ 30 జాబితాలోనూ చోటు ద‌క్కించుకుంది.

Read more about: business money news
English summary

సామాజిక అవ‌స‌రాల‌కు మిలాప్ క్రౌడ్ ఫండింగ్ | millaap is contributing money for social purposes through crowd funding

Milaap is India's leading crowdfunding platform for personal and social causes. Our community of donors and lenders come from 120 countries across the world, and have contributed over Rs 90.18 Cr supporting 49,310 projects across India. Over the last five years, Milaap has become the preferred platform for people to raise and contribute for the causes they care for in India
Story first published: Saturday, December 16, 2017, 15:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X