చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దానికి సంబంధించిన ముఖ్య తీర్పు వివరాలు, ఆధార్ అనుసంధాన గడువులు తెలుసుకుందాం.
సుప్రీంకోర్టు శుక్రవారం ఆధార్ అనుసంధాన గడువును మార్చి 31,2018 వరకూ పొడిగించింది. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లు, వివిధ ప్రభుత్వ పథకాలు, సంక్షేమపథకాలకు ఇదివరకే లింక్ చేయని వారికి ఇది శుభవార్త. చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దానికి సంబంధించిన ముఖ్య తీర్పు వివరాలు, ఆధార్ అనుసంధాన గడువులు తెలుసుకుందాం.

కోర్టులో ప్రభుత్వం చెప్పింది ఇది
గత కొన్ని నెలల నుంచి ఆధార్, వివిధ గుర్తింపు కార్డులతో లింక్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఆధార్ చట్టం ప్రకారం ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు ఏది ఎవరి ఇష్టం మేరకు వారు చేసుకోవచ్చని ప్రభుత్వం కోర్టు వాదనల్లో చెబుతూ వస్తోంది.

వీటన్నింటికీ తప్పనిసరి కాదు
అయితే శుక్రవారం కోర్టు నుంచి కీలక తీర్పు వెలువడింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గడువును పెంచాలని కేంద్ర న్యాయస్థానం ఆదేశించింది. దీని ప్రకారం బ్యాంకు ఖాతాలకు, జన్ ధన్ యోజన, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం వంటి వాటికి కేవలం ఆదార్ రుజువు పత్రంగా మాత్రమే లింక్ చేస్తున్నట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన ప్రతిపాదన సమర్పించింది.

3.కొత్త గడువులు ఇలా...
ఇప్పుడు ప్రజలంతా దేనికి లింక్ చేయాలో, ఎందుకు లింక్ చేయాలో అనే తికమకలో ఉన్నారు. అయితే కొత్త తీర్పు ప్రకారం ఇప్పుడున్న ముఖ్యమైన సమాచారం ఇది
బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుకు మాత్రం మార్చి 31,2018 వరకూ గడువు ఉంది.

4. మొబైల్-ఆధార్ లింకింగ్
మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను సైతం ఆధార్ సంఖ్యతో అనుసంధానించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం, టెలికాం శాఖ ట్రాయ్ ద్వారా ప్రజలను కోరుతున్నాయి. దీనికి సంబంధించి ఆఖరి గడువు ఫిబ్రవరి 6,2018.
మొబైల్ నంబర్లతో ఆధార్ లింక్ కాకపోతే సిమ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తామని టెల్కోలు వినియోగదారులకు సంక్షిప్త సందేశాలను పంపుతున్నాయి.

5. ఆధార్ అనుసంధానం-కోర్టు కేసుల్లో
ఆధార్ అనుసంధానం, ఆధార్ చట్టంకు సంబంధించి వివిధ స్థాయిల్లో 22 కేసులు విచారణలో ఉన్నాయి. అయితే అత్యున్నత న్యాయస్థానం చిన్న బెంచీ వీటిని విచారించింది. అయితే దీనికి సంబంధించి కేసులన్నీ చాలా అంశాలతో ముడిపడి ఉండటంతో వీటిని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. తాజాగా వివిధ పథకాలకు ఆధార్ వివరాలను తీసుకోవడం కూడా వివాదస్పదమవుతున్న వేళ ఆ అభ్యంతరాలు కూడా కోర్టుకెక్కాయి.
ఇప్పుడు సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ వేసిన ఒక దావా, మరో వైపు మొబైల్ నంబర్లకు ఆధార్ లింక్ చేయడం గురించి మరో వ్యక్తి వేసిన దావాకు సంబంధించి కోర్టు ప్రధానంగా విచారణ జరుపుతున్నది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications