For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార‌త్‌లో అత్య‌ధిక ఆదాయం ఆర్జించే ఐటీ సంస్థ‌గా ఐబీఎం

భార‌త్‌లో ఐబీఎం రెవెన్యూ 5 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. ప్ర‌పంచంలో అతిపెద్ద టెక్నాల‌జీ కంపెనీ అయిన ఐబీఎం ఏప్రిల్-మార్చి త్రైమాసికంలో చాలా వేగ‌వంత‌మైన స‌రైన అభివృద్దిని క‌న‌బ‌రించింది.

|

భార‌త్‌లో ఐబీఎం రెవెన్యూ 5 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. ప్ర‌పంచంలో అతిపెద్ద టెక్నాల‌జీ కంపెనీ అయిన ఐబీఎం ఏప్రిల్-మార్చి త్రైమాసికంలో చాలా వేగ‌వంత‌మైన స‌రైన అభివృద్దిని క‌న‌బ‌రించింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో 41% వృద్దిని న‌మోదు చేసింది. దీంతో పాటు దేశంలో ఔట్ సోర్సింగ్ ద్వారా అత్య‌ధిక ఆదాయం న‌మోదుచేసిన కంపెనీగా ఐబీఎం పేరు తెచ్చుకుంది. దేశం నుంచి ఔట్ సోర్సింగ్ ప్రాజెక్టుల ద్వారా డ‌బ్బు ఆర్జించ‌డంతో పాటు, టెక్నాల‌జీ పైన ఎక్కువ ఖ‌ర్చు పెట్ట‌డంతో ఈ సంస్థ 41 % వృద్దిని న‌మోదు చేయ‌డం సాధ్య‌పడింది. కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ వ‌ద్ద ఫైల్ చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం ఈ సంస్థ అంత‌కు ముందు ఏడాది మార్చి నాటికి రూ.23,005 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయ‌గా ఈ ఏడాది మార్చి నాటికి రూ.32,325 కోట్ల ఆదాయాన్ని ఆర్జించ‌గ‌లిగింది.

ఐబీఎం ఆదాయం

ప్ర‌స్తుతం దేశీయ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్జిస్తున్న ఆదాయాల కంటే భార‌త‌దేశంలో చేప‌ట్టే ప‌నుల ద్వారా అత్య‌ధిక ఆదాయం సంపాదిస్తున్న కంపెనీగా ఐబీఎం నిలిచింది. ఇది రెవెన్యూ ప‌రంగా ఇన్ఫీ, విప్రో, టీసీఎస్ సంస్థ‌ల‌ను ఐబీఎంతో పోల్చిన‌ప్పుడు తేలిన లెక్క‌.

ఐబీఎం కంపెనీకి మ‌న దేశంలో బెంగుళూరు, అహ్మ‌దాబాద్‌, ఢిల్లీ, కోల్‌క‌త‌, ముంబ‌యి, చెన్నై, పుణె, గుర్గావ్‌, నోయిడా, చండీఘ‌డ్, భువ‌నేశ్వ‌ర్, కొయంబ‌త్తూర్, విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్లో వ్యాపార కార్య‌క‌లాపాలు ఉన్నాయి. ఐబీఎం మొత్తం మీద ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4,50,000 ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు.

Read more about: ibm software
English summary

భార‌త్‌లో అత్య‌ధిక ఆదాయం ఆర్జించే ఐటీ సంస్థ‌గా ఐబీఎం | IBM’s India revenue tops 5 billion dollars in FY17

IBm surpassed all software companies in India revenue terms
Story first published: Monday, December 4, 2017, 10:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X