For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిల‌య‌న్స్ డీటీహెచ్ వ్యాపారం వీకాన్ మీడియా చేతికి

అప్పుల‌తో కునారిల్లుతోన్న అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ కంపెనీలు ఒక్కొక్క‌టిగా కొత్త దారుల దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. చాలా వ‌ర‌కూ కంపెనీల అప్పుల భారాన్ని తగ్గించుకునే పనిలో ప‌డ్డాయి.

|

అప్పుల‌తో కునారిల్లుతోన్న అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ కంపెనీలు ఒక్కొక్క‌టిగా కొత్త దారుల దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. చాలా వ‌ర‌కూ కంపెనీల అప్పుల భారాన్ని తగ్గించుకునే పనిలో ప‌డ్డాయి. ఇదివ‌ర‌కే టెలికాం వ్యాపారానికి చాప‌చుట్టేసేందుకు సిద్ద‌మైన ఆర్‌కామ్‌తో పాటు ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకున్న మరో సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) సబ్సీడరీ అయినా రిలయన్స్‌ బిగ్‌ టివి లిమిటెడ్‌ (బిగ్‌టీవీ) పేరుతో నిర్వహిస్తున్న డైరెక్ట్‌ టు హోం (డిటిహెచ్‌) సేవ‌ల వ్యాపారాన్ని సైతం మ‌రో సంస్థ‌కు అమ్మేసింది. ఈ కంపెనీని ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వీకాన్‌ మీడియా అండ్‌ టెలివిజన్‌ లిమిటెడ్‌ స్వాధీనం చేసింది. ఈ మేరకు వీకాన్‌ మీడియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆర్‌కామ్‌ సోమవారం మార్కెట్ నియంత్ర‌ణ సంస్థ‌కు ఇచ్చిన స‌మాచారంలో తెలిపింది.

రిల‌య‌న్స్ బిగ్‌టీవీ

ఇప్పటికే ఆర్‌కామ్‌ 2జి, 3జి సేవలను నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. తమ బిగ్‌టివిలోని మొత్తం వాటాలు వికాన్‌కు చెందుతాయని ప్రకటించింది. దీంతో ఈ విభాగం అన్ని వ్యాపార బాధ్యతలతో పాటు కాంట్రాక్ట్‌ రుణాలకు కూడా వికాన్‌ బాధ్యత వహిస్తుందని పేర్కొంది. ఈ ఒప్పందానికి మార్కెట్‌ రెగ్యులేటరీ సంస్థలు, ఆర్‌కామ్‌ రుణ దాతలు, ఇతర సంబంధిత సంస్థల ఆమోదం పొందాల్సి ఉంది. అవసరమైన బ్యాంకు హామీలను సమర్పించిన తరువాత ప్రస్తుత డిటిహెచ్‌ లైసెన్స్‌ సమాచార, బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రిత్వ శాఖ ద్వారా పునరుద్ధరించబడుతుందని ఆర్‌కామ్‌ తెలిపింది. ఈ విలీన ప్ర‌క్రియ పూర్తి అయితే బిగ్‌టీవీకి చెందిన 12 లక్ష‌ల మంది వినియోగ‌దారులు అంత‌రాయం లేని సేవ‌ల‌ను వీకాన్ మీడియా నుంచి అందుకుంటారు.

Read more about: reliance media
English summary

రిల‌య‌న్స్ డీటీహెచ్ వ్యాపారం వీకాన్ మీడియా చేతికి | Rcom is going to sell Big tv to veecon media and television

Debt-laden Reliance Communications on Monday said it will sell its direct-to-home (DTH) subsidiary, Reliance BIG TV, to Veecon Media and Television.
Story first published: Tuesday, November 7, 2017, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X