For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌నామా పేప‌ర్ల లీకుల‌కు సంబంధించి పెద్దోళ్ల‌పై ప్ర‌భుత్వం దృష్టి

గ‌త ఒక‌టిన్న‌ర రెండేళ్ల నుంచి దీనిపై ద‌ర్యాప్తు జ‌రుగుతున్నా పురోగ‌తి లేదు. ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు అనుభ‌విస్తున్న వారు, కార్పొరేట్లు, రాజకీయ నాయకులు, సెల‌బ్రిటీ ముద్ర క‌లిగిన వారు ఇలా దాదాపు 714

|

చాలా మంది పెద్దోళ్లు అంతా పైకి బాగానే క‌న‌బ‌డ‌తారు. ప‌న్నుల విష‌యంలోకి వ‌చ్చేస‌రికి ఎంతో సంపాదించి దేశానికి ప‌న్ను ఎలా ఎగ‌వేయాలా అని చూస్తారు. అలా ప‌న్ను స్వ‌ర్గ‌ధామాలుగా పేరుగ‌న్న కొన్ని దేశాల్లోకి వారి సంప‌ద‌ను త‌ర‌లిస్తారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్ట్స్(ఐసీఐజే) అలాంటి వారి జాబితాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌యారుచేసింది. గ‌త ఒక‌టిన్న‌ర రెండేళ్ల నుంచి దీనిపై ద‌ర్యాప్తు జ‌రుగుతున్నా పురోగ‌తి లేదు. ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు అనుభ‌విస్తున్న వారు, కార్పొరేట్లు, రాజకీయ నాయకులు, సెల‌బ్రిటీ ముద్ర క‌లిగిన వారు ఇలా దాదాపు 714 మంది భార‌తీయుల పేర్ల‌న్నీ ఈ జాబితాలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం వైపు నుంచి జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామాలు చూద్దాం.

కార్పొరేట్ గ‌వ‌ర్నెన్స్లో లోపం ఉంటేనే ముందుకు

కార్పొరేట్ గ‌వ‌ర్నెన్స్లో లోపం ఉంటేనే ముందుకు

‘ప్యారడైజ్ పత్రాల'లో పేరున్న ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌ల‌పై సెబీ క‌న్ను ప‌డింది. విజయ్ మాల్యాకు చెందిన సంస్థలు సహా తన వద్ద లిస్టయిన వివిధ సంస్థలు, వాటి ప్రమోటర్లు అక్రమంగా నిధుల మళ్లింపునకు పాల్పడ్డాయా, కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఏమైనా లోపాలున్నాయా అనే అంశాలపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) లోతుగా పరిశీలించనుంది. మాల్యాకు సంబంధం ఉన్న కొన్ని కంపెనీలపై సెబీ, ఇతర సంస్థలు ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ జాబితాలో ఈసారి ఆర్థిక మంత్రి జ‌యంత్ సిన్హా సంబంధిత కంపెనీ ఉండ‌టం విశేషం.

మాల్యాపై బాగానే దృష్టి పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వం

మాల్యాపై బాగానే దృష్టి పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వం

ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ‘ప్యారడైజ్ పేపర్స్' పేరిట బహిర్గతం చేసిన పత్రాలలో మాల్యాకు, ఆయనతో సంబంధం ఉన్న సంస్థలకు సంబంధించి ఇంకేమైనా కొత్త అంశాలు బయటపడితే, ఆయా అంశాలపై దర్యాప్తు చేయనున్నట్లు ప్ర‌భుత్వంలోని సీనియ‌ర్ అధికారులు వెల్ల‌డించారు.

వీటిపై సెబీ దృష్టి

వీటిపై సెబీ దృష్టి

ప్యారడైజ్ పత్రాల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు వెలుగు చూసిన ఇతర లిస్టెడ్ సంస్థలు, వాటితో అనుబంధం ఉన్న సంస్థలు, వాటి ప్రమోటర్లపైనా సెబీ దృష్టి సారిస్తుందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా నిధుల అక్రమ బదిలీ జరిగిందా? కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఏమైనా లోపాలున్నాయా? అనే అంశాలను పరిశీలించనున్నట్టు వారు చెప్పారు. వేరే దేశంలో నిబంధ‌న‌ల మేర‌కు పెట్టుబడులు పెట్టి ఉంటే చేయ‌గ‌లిగిందేమీ లేదు. అదే చ‌ట్టాల‌ను ఉల్లంఘించి ప‌న్ను ఎగ‌వేత‌ల‌కు దీన్ని ఉప‌యోగించి ఉంటే చ‌ర్య‌లు చేప‌ట్టే అవ‌కాశ‌ముంది. ఐసీఐజే రిపోర్ట‌కు సంబంధించి పూర్తి క‌థ‌నం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

4. చ‌ట్టాల‌ను ఉల్లంఘించారా లేదా అనేది ముఖ్యం

4. చ‌ట్టాల‌ను ఉల్లంఘించారా లేదా అనేది ముఖ్యం

అయితే భారత్‌కు చెందిన ఏ సంస్థ అయినా విదేశాలలోని పన్ను రాయితీలు (ట్యాక్స్ ఫ్రెండ్లీ) ఉన్న ప్రాంతాలకు విస్తరించినంత మాత్రాన అది చట్టాలను ఉల్లంఘించినట్లు కాదని, కాని, ఆ సంస్థలు ఆ వివరాలను వెల్లడించి ఉండకపోతే, వాటికి నిధులను మళ్లించి ఉంటే, లోతుగా దర్యాప్తు జరిపిన త‌ర్వాత అవి చట్టాలను ఉల్లంఘించాయా? లేదా? అనే విషయాన్ని అంచనా వేస్తామని ఆ అధికారులు వివరించారు.

5. లిస్టెడ్ సంస్థ‌ల‌కు విదేశాల్లో ఏం ప‌ని?

5. లిస్టెడ్ సంస్థ‌ల‌కు విదేశాల్లో ఏం ప‌ని?

ఈ దర్యాప్తులో భాగంగా తొలుత ప్యారడైజ్ పత్రాలలో పేరున్న లిస్టయిన కంపెనీలను వాటికి విదేశాలలో అనుబంధ సంస్థలు ఉన్నాయా? ఉంటే వాటి వివరాలను ఇవ్వాలని సెబీ అడుగుతుంది. ఆ కంపెనీలు అంతకు ముందు సమర్పించిన వార్షిక నివేదికలు, ఇతర పత్రాలలో పేర్కొన్న వివరాలతో వీటిని పోల్చి చూస్తుంది. అవసరమైతే, విదేశీ నియంత్రణ సంస్థల నుంచి సమాచారాన్ని కోరేందుకు సెబీ ఇతర నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలతో కూడా సమన్వయంతో వ్యవహరిస్తుందని ఒక అధికారి తెలిపారు.

ఇదంతా ఐసీఐజే ప‌నే

ఇదంతా ఐసీఐజే ప‌నే

ఫైనాన్షియల్ స్టెబిలిటి అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్‌ఎస్‌డీసీ) లేదా అలాంటి ఇతర వేదికలపై బహుళ నియంత్రణ వైఖరిపై చర్చించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని మీడియా భాగస్వాములతో కలిసి ఐసీఐజే 13.4 మిలియన్ ఫైళ్లను బహిర్గతం చేసింది. ప్రపంచంలోని కొందరు శక్తివంతమయిన నేతలు, కంపెనీలు విదేశాలలో జరిపిన ఆర్థిక కార్యకలాపాలను ఈ ప్యారడైజ్ పత్రాలు బయటపెట్టాయి.

English summary

ప‌నామా పేప‌ర్ల లీకుల‌కు సంబంధించి పెద్దోళ్ల‌పై ప్ర‌భుత్వం దృష్టి | paradise papers Indian bigwigs black money

The new files come from two offshore services firms as well as from 19 corporate registries maintained by governments in jurisdictions that serve as waystations in the global shadow economy. The leaks were obtained by German newspaper Süddeutsche Zeitung and shared with the International Consortium of Investigative Journalists and a network of more than 380 journalists in 67 countries.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X