For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహ‌న బీమా ఉన్నా స‌రే... ర‌క్ష‌ణ‌కు ఇవి పాటించాల్సిందే...

వినియోగించే వాహనం పాడైతే ఏంచేయాలి? వేలాది రూపాయలు వెచ్చించి కొన్న వాహనం విలువకు నష్టం వాటిల్లకుండా ఉండటానికి బీమా పాలసీలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి నియమాలు ఉంటాయి? అనే విష‌యాలు ఈ క‌థ‌నం ద్వారా తెలుసుకుందాం

|

సొంత వాహ‌నం లేని ప్ర‌యాణం న‌గ‌రంలో క‌ష్టం. అందుకే అన్ని వర్గాల వారి దైనందిన జీవితంలో ద్విచ‌క్ర వాహ‌నం క‌నీస అవ‌స‌ర‌మైపోయింది. కాలేజ్‌ వయసు పిల్లల్నుంచి ఉద్యోగాలు చేసే మహిళలు, వివిధ రంగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, వ్యాపారాలు ఇలా ఎంతోమందికి ప్రయాణపు అవసరాలు తీర్చే ఈ వాహనాల వినియోగంలో ప్ర‌మాదాలు లేక‌పోలేదు. అది పది లక్షల విలువ చేసే కారు కావొచ్చు. వేలరూపాయల ఖరీదు చేసే ద్విచక్రవాహనం కావొచ్చు. వాహన ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో కుటుంబానికి ఎలాంటి ఆపద తలెత్తకూడదని ఆరోగ్య బీమా పాలసీలతో పాటు వ్యక్తిగత రక్షణ ఏర్పాటు చేసుకుంటాం. కానీ మనం వినియోగించే వాహనం పాడైతే ఏంచేయాలి? వేలాది రూపాయలు వెచ్చించి కొన్న వాహనం విలువకు నష్టం వాటిల్లకుండా ఉండటానికి బీమా పాలసీలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి నియమాలు ఉంటాయి? అనే విష‌యాలు ఈ క‌థ‌నం ద్వారా తెలుసుకుందాం.

1. షోరూంల‌లోనే బీమా

1. షోరూంల‌లోనే బీమా

సాధారణంగా ద్విచక్ర వాహనం, కారు కొనేటప్పుడు ఆ వాహనానికి సంబంధించిన బీమా తీసుకునే పనులు కూడా దాదాపుగా షోరూంవాళ్ళే పూర్తి చేస్తుంటారు. అలా షోరూం నుంచి వాహనం బయటకు వచ్చిన రోజు నుంచే ఆ బండికి నూటికి నూరుశాతం బీమా రూపంలో రక్షణ ఏర్పాటవుతుంది. కానీ కొంతమంది వాహనదారుల అజాగ్రత్తల వల్ల ఆ బీమా అవసరానికి ఆదుకోని పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటి పరిస్ధితుల్లో ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు చేయాల్సిన పనులేమిటి? సులభంగా క్లెయిం పరిష్కారం కోసం ఏం చేయాలి?

2. తక్షణం స్పందించాలి

2. తక్షణం స్పందించాలి

కారు లేదా ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైతే.. ముందుగా ఆ వాహనాలను సానుకూలమైన ప్రదేశానికి తరలించడం మంచిది. అలాగే ప్రమాదం జరిగిన 48 గంటల్లోగా బీమా సంస్థకు ఆ విషయాన్ని తెలియజేయడం మరవకండి. సంబంధిత ఇన్సూరెన్స్‌ కంపెనీకి ప్రమాదంలో వాహనానికి జరిగిన నష్టం ఏమిటి? ఎక్కడ, ఏ సమయంలో ఎలా జరిగిందనే విషయాన్ని స్పష్టంగా వివరించండి. ప్రమాదంలో ఎవరైనా గాయపడిన వారు, డ్రైవింగ్‌ ఎవరు చేస్తున్నారు తదితర వివరాలు కూడా నమోదు చేయించడం మంచిది. అన్నింటికంటే ముఖ్యమైన‌ది ఏంటంటే ప్రమాద సంఘటన తీవ్రత సదరు కంపెనీ అర్థం చేసుకోడానికి, అలాగే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండటానికి ప్రమాదం స్థలంలోని వాహనాన్ని పలు కోణాల్లో ఫొటోలు తీసి పెట్టుకోవడం శ్రేయస్కరం.

3. తొందరపడొద్దు

3. తొందరపడొద్దు

ప్రమాదం జరిగాక.. మీరిచ్చిన సమాచారం ఆధారంగా మీ క్లెయిం దరఖాస్తును స్వీకరించాలా? తిరస్కరించాలా? అనేది బీమా సంస్థ నిర్ణయిస్తుంది. ప్రమాదానికి దారితీసిన సందరాన్ని విశ్లేషించేందుకు కొన్ని సందర్భాల్లో బీమా సంస్థ ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. ప్రమాదం గురించి ఇన్సూరెన్స్‌ కంపెనీకి తెలియజేశాం కాబట్టి ఇక అంతా అయిపోయిందిలే అని తొందరపడొద్దు. మీరు బండిని మరమ్మతుల కోసం తరలించేప్పుడు బీమా సంస్థకు ఆ విషయం తెలియజేయండి. అలా తెలియజేసిన తర్వాతే బండిని ప్రమాద స్థలం నుంచి తీసుకెళ్లండి. బీమా సంస్థ నుంచి సర్వేయర్‌ వచ్చి, నష్టాన్ని అంచనా వేసేవరకూ వాహనాన్ని మరమ్మతు చేయించడంగానీ, విడిభాగాలను విప్పదీయడంగానీ చేయకూడదు. మంచి కోసం చేసినాగానీ, కావాలనే వాహనదారుడు తప్పుడు సమాచారం ఇచ్చాడని సదరు బీమా కంపెనీ భావించవచ్చు. అందుకే ఇలాంటి సంద‌ర్భాల్లో నేర్పుతో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

 4. పత్రాలు అన్నీ సంసిద్దంగా ఉండాల్సిందే..

4. పత్రాలు అన్నీ సంసిద్దంగా ఉండాల్సిందే..

బీమా సంస్థ నుంచి వాహన మరమ్మతుకు అనుమతి తీసుకున్నాక.. ఏ గ్యారేజీకి తీసుకెళ్లాలి అనేదీ మొదటిగా తెలుసుకోవాలి. కొన్ని గ్యారేజీలకు బీమా సంస్థతో ఒప్పందం ఉంటుంది. అక్కడ మరమ్మతు చేయిస్తే మీచేతి నుంచి అధనంగా డబ్బు చెల్లించే అవసరం ఉండదు. అయితే దీనికన్నా ముందు మీరు బీమా క్లెయిం ఫారం, పాలసీ కాపీ, వాహన రిజిస్ట్రేషన్‌ అసలు కాపీ(ఒర్జినల్‌), డ్రైవింగ్‌ లైసెన్సు వంటి ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వాహనం వల్ల ఇతరులకు నష్టం వాటిల్లినప్పుడు పోలీస్‌ ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) కూడా అవసరం అవుతుంది. వీటన్నింటితోపాటు వాహనాన్ని తిరిగి సిద్ధం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో గ్యారేజీ నుంచి అంచనా పత్రాన్ని తీసుకోవాలి. వాహన బీమాను క్లెయిం చేసుకోవడానికి ఇవన్నీ తప్పనిసరిగా కావాల్సిన పత్రాలన్న సంగతిని మర్చిపోవద్దు.

5. బీమా ఎలాంటిదో?

5. బీమా ఎలాంటిదో?

వాహనం కొనేటప్పడు హడావుడిగా వెహికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇన్సూరెన్స్‌ పాలసీతో ఎలాంటి రక్షణ ఉంటుంది. ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో వెహికల్‌ ఖరీదుకు తగ్గ నష్టం భర్తీ అవుతుందా?! ఎలాంటి ప్రమాదాలకు, ఎలాంటి వాహన నష్టాలకు ఇన్సూరెన్స్‌ లభిస్తుంది? ప్రకృతి వైపరీత్యాలవల్ల కలిగే ప్రమాదాల్లో వాహనాలు పాడైనా, పూర్తిగా ధ్వంసమైనా సదరు బీమా వర్తిస్తుందా లేదా? అనే విషయాల్ని గమనంలో పెట్టుకోవాలి. వాహనానికి వందశాతం రక్షణ కల్పించాలంటే. పాలసీలలో కూడా తేడాలుంటాయి. అధనపు చెల్లింపులూ ఉంటాయి. అవన్నీ క్లియర్‌గా ఆ బీమా కంపెనీ ఏజెంట్‌ని అడిగి తెలుసుకుని పాలసీ తీసుకోవడం ఉత్తమం.

6. అరచేతిలో బీమా

6. అరచేతిలో బీమా

ప్రస్తుతం అంతా డిజిటలే. దాదాపు అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. దీనికి తగ్గట్టుగా బీమా సంస్థలు కూడా డిజిటల్‌ సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ప్లేస్టోర్లో ఉచిత యాప్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. పాలసీ తీసుకోవడం, పునరుద్ధరణ, క్లెయిం చేసుకోవడం వంటి కీలకమైన పనుల్నీ ఫోన్‌ ద్వారానే చేసుకోవచ్చు. దీనివల్ల పాలసీదార్లకు చాలా సమయం కలిసొస్తుంది.

7. చిన్నవాటికి క్లెయిం చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది

7. చిన్నవాటికి క్లెయిం చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది

చిన్న మరమ్మతులకు పరిహారం పొందడం వల్ల నో క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ) వదులుకోవాల్సి వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మీ ప్రీమియం కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. పాలసీని క్లెయిం చేసుకోని ఏడాది బీమా సంస్థ మీకు ఇచ్చే బహుమతే నో క్లెయిం బోనస్‌. దీనిని పాలసీ పునరుద్ధరణ సమయంలో మీరు చెల్లించాల్సిన ప్రీమియం నుంచి మినహాయిస్తారు. దీంతోపాటు తరుగుదల, తప్పనిసరిగా చెల్లించే ఖర్చులు, ఇతర అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ లెక్కించుకున్నాకనే పరిహారం (ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌) కోసం దరఖాస్తు చేసుకోండి.

English summary

వాహ‌న బీమా ఉన్నా స‌రే... ర‌క్ష‌ణ‌కు ఇవి పాటించాల్సిందే... | Though you have policy These things are important in Two wheeler insurance

Two wheeler insurance policy provides protection from any liability or damage to an individual or property by your two-wheeler. The two wheelers include the scooter, motorcycle, moped, etc.
Story first published: Monday, October 23, 2017, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X