For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్ల స‌మ్మె

క్యాబ్‌ డ్రైవర్లు తమ సమస్యలపై పలుమార్లు తాము ఆందోళన చేపట్టినా.. ప్రభుత్వం స్పందించడంలేదని అసోసియేషన్‌ అధ్యక్షుడు విమర్శించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ ఆందోళనను మరింత ఉద్దృతం చేస్తామని ఆయన

|

నగరంలో నేడు (సోమవారం, 23న) ఉబర్, ఓలా క్యాబ్‌ సర్వీసులను నిలిపివేశారు. ఫైనాన్సియ‌ర్ల‌ వేధింపులు, క్యాబ్‌ డ్రైవర్‌ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఈ బంద్‌ను పాటిస్తున్నట్టు తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ తెలిపారు. అనారోగ్యకరమైన పోటీతో ఆయా సంస్థ‌ల క్యాబ్ డ్రైవర్లు నష్టపోతున్నారని చెప్పారు. ఈ సమ్మెతో నగరంలో క్యాబ్‌ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగనుంది.

ఓలా,ఉబ‌ర్ క్యాబ్ స‌ర్వీసుల నిలిపివేత‌

క్యాబ్‌ డ్రైవర్లు తమ సమస్యలపై పలుమార్లు తాము ఆందోళన చేపట్టినా.. ప్రభుత్వం స్పందించడంలేదని అసోసియేషన్‌ అధ్యక్షుడు విమర్శించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ ఆందోళనను మరింత ఉద్దృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. లక్షన్నర కార్లు ఈ రెండు సంస్థల్లో తిరుగుతున్నాయని, రూ.లక్షలు అప్పులు తెచ్చి కార్లు కొనుక్కున్న ఎంతోమందికి కనీస ఉపాధి లభించడం లేదన్నారు. ఫైనాన్సియ‌ర్ల వద్ద వాయిదాలు చెల్లించలేక, వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేద వ్యక్తం చేశారు.
క్యాబ్ కంపెనీలు త‌మ‌కు చేస్తున్న అన్యాయం విష‌యంలో ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. భాగ్య న‌గ‌రంలో ప్ర‌జ‌లు క్యాబ్‌లు ఎక్కువ‌గా వినియోగిస్తుండ‌టంతో ఉబ‌ర్, ఓలా సంస్థ‌లు త‌మ సేవ‌ల‌ను విస్త‌రించాయి. కేవ‌లం రూ.30 వేల డౌన్ పేమెంట్ చెల్లించి కారును సొంతం చేసుకోవ‌చ్చ‌ని న‌మ్మ‌బ‌లికి రూ.70 వేల వ‌ర‌కూ సంపాదించ‌వ‌చ్చ‌ని భ్ర‌మ క‌ల్పించాయి. దీంతో న‌గ‌రంలోని కొన్ని వంద‌ల మంది ఇత‌ర కార్ల డ్రైవ‌ర్లు ఉబ‌ర్‌,ఓలా సంస్థ‌ల్లో చేరారు. అయితే త‌మ‌కు రావాల్సిన నెల మొత్తాన్ని ఫైనాన్స్, మెయింటెనెన్స్ రూపంలో త‌మ సంస్థ‌ల యాజ‌మాన్యాలు కాజేస్తున్నాయ‌ని డ్రైవ‌ర్లు ఆరోపిస్తున్నారు. రూ.70 వేల‌కు పైనే సంపాదించ‌వ‌చ్చ‌ని చెప్పిన ఆ సంస్థ‌లు ఇప్పుడు నెల‌కు రూ.15 వేలు మాత్ర‌మే ఇస్తున్నాయ‌ని ఆవేద‌న చెందుతున్నారు.

Read more about: cabs ola uber
English summary

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్ల స‌మ్మె | Ola and uber cab owners and drivers doing strike in Hyderabad

uber ola cab owners and drivers go on strike in hyderabad
Story first published: Monday, October 23, 2017, 16:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X