For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌వంబ‌రు 1 నుంచి బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వేగం పెంపు

కేర‌ళ‌టెలికాం.ఇన్ఫో వెబ్‌సైట్ ప్ర‌కారం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ రూ.675లో ఉన్న వారికి 10ఎంబీపీఎస్‌, అదే విధంగా రూ.675 ప్లాన్ కంటే త‌క్కువ ఉన్న వారంద‌రికీ 8 ఎంబీపీఎస్ వేగం మేర డేటాను అందించ‌నున

|

ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త‌మ వినియోగ‌దారుల‌ను కాపాడుకునేందుకు కొత్త ప్ర‌యోగాలు చేస్తూనే ఉంది. తాజాగా త‌న అప‌రిమితి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల వేగాన్ని 10 ఎంబీపీఎస్‌, 8 ఎంబీపీఎస్‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కొత్త మార్పు న‌వంబ‌రు 1, 2017 నుంచే అమల్లోకి వ‌స్తుంది. కేర‌ళ‌టెలికాం.ఇన్ఫో వెబ్‌సైట్ ప్ర‌కారం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ రూ.675లో ఉన్న వారికి 10ఎంబీపీఎస్‌, అదే విధంగా రూ.675 ప్లాన్ కంటే త‌క్కువ ఉన్న వారంద‌రికీ 8 ఎంబీపీఎస్ వేగం మేర డేటాను అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
బీఎస్ఎన్ఎల్ డేటా వేగానికి సంబంధించిన మార్పులు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతాయి. అంతే కాకుండా స‌ర్కిల్‌కు సంబంధించిన ప్ర‌త్యేక ప్లాన్లు, ఎఫ్‌టీటీహెచ్ ప్లాన్లు సైతం ఉంటాయి. అదే విధంగా బీఎస్ఎన్ఎల్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం బీబీజీ కాంబో 1441, బీబీజీ స్పీడ్ కాంబో 2841 ప్లాన్ల‌ను కొత్త వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉండ‌బోవ‌ని స‌మాచారం.

 బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ స్పీడ్‌లో న‌వంబ‌రు నుంచి మార్పు

నూత‌న మార్పుల కార‌ణంగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 249లో భాగంగా 5జీబీ వ‌ర‌కూ డేటా స్పీడ్ 8ఎంబీపీఎస్ గాను, 5జీబీ త‌ర్వాత 1ఎంబీపీఎస్‌గాను ఉంటుంది. ఇప్ప‌టికైతే బీఎస్ఎన్ఎల్ దేశంలోనే బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి అత్య‌ధిక ల్యాండ్‌లైన్ ఆధారిత క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లిగి ఉంది. దీని మార్కెట్ వాటా జూన్,2017 నాటికి 59.63%గా ఉంది. బీఎస్ఎన్ఎల్ నెట్వ‌ర్క్ ఒక‌దానిలోనే వైర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ వినియోగ‌దారుల సంఖ్య 1.292 కోట్లుగా ఉంది. ప్ర‌స్తుతం బీఎస్ఎన్ఎల్ డేటా వేగాన్ని పెంచేందుకై ప్ర‌య‌త్నించ‌డం త‌న క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌ను పెంచేందుకు మ‌రింత దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌దు.

Read more about: bsnl data broadband
English summary

న‌వంబ‌రు 1 నుంచి బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వేగం పెంపు | BSNL Broadband Plans to Offer Initial Speeds of 10 Mbps and 8 Mbps from nov 1

State-run telecom operator BSNL has made a big change to its existing broadband plans. BSNL confirmed that it has increased base speed of its unlimited broadband plans to 10 Mbps and 8 Mbps respectively. This new change will be effective from November 1, 2017.
Story first published: Monday, October 16, 2017, 17:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X