For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగాల క‌ల్ప‌న‌పై ప్ర‌భావం చూపుతున్న జీడీపీ వృద్ది

ఒక ప‌క్క జీడీపీ పెరిగినా ఉద్యోగాలు క‌ల్పించేందుకు ఉన్న అడ్డంకులు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, ఐటీ రంగంలో నెమ్మ‌దిత‌నం, ఆటోమేష‌న్‌ వంటివి ఉండ‌నే ఉన్నాయి.

|

జీడీపీ వృద్దిలో క‌న‌బడుతున్న త‌గ్గుద‌ల భ‌విష్య‌త్తులో ఉద్యోగాలు క‌ల్పిస్తున్న సంస్థ‌ల‌కు, ఉద్యోగార్థుల‌కు మ‌ధ్య అంత‌రాన్ని మ‌రింత పెంచేలా క‌నిపిస్తోంది. ఒక ప‌క్క జీడీపీ పెరిగినా ఉద్యోగాలు క‌ల్పించేందుకు ఉన్న అడ్డంకులు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, ఐటీ రంగంలో నెమ్మ‌దిత‌నం వంటివి ఉండ‌నే ఉన్నాయి. ఈ ప‌రిస్థితి ఉద్యోగ నియామ‌క స‌ర్వే సంస్థ‌ల‌ను భ‌య‌పెడుతున్నాయి. ఆర్థిక స‌ర్వే ప్ర‌కారం మార్చి 31,2012 నాటికి వ్య‌వస్థీకృత రంగంలో ఉద్యోగాల క‌ల్ప‌న 4.68 కోట్లుగా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియాకు నియామ‌క సంస్థ‌ల అధికారులు చెప్పిన దాని ప్ర‌కారం ప్ర‌తి సంవ‌త్స‌రం అధీకృత(వ్య‌వ‌స్థీకృత‌) రంగాల‌లో ఉద్యోగాల క‌ల్ప‌న 2 నుంచి 3 ల‌క్ష‌లు ఉంటుంది. అయితే ప్ర‌తి ఏడాది జాబ్ మార్కెట్లోకి వ‌స్తున్న ఉద్యోగార్థుల సంఖ్‌య 1.2-1.3 కోట్లు ఉంటుందని వారు చెప్పారు. జూన్ 2017తో ముగిసిన త్రైమాసికం నాటికి అంత‌కు ముందు ఏడాది అదే త్రైమాసికంతో పోలిస్తే జీడీపీ 2% త‌గ్గుద‌ల‌ను క‌న‌బ‌రిచి 5.7%గా న‌మోద‌యింది. ఇంకా జీడీపీ త‌గ్గుముఖం ప‌డితే వ్య‌వ‌స్థ‌కు ఇది ఇంకా భారం కాగ‌ల‌దు.

జీడీపీ వృద్దితో త‌గ్గుద‌ల‌-కొత్త ఉద్యోగాల‌పై ప్రభావం

ప‌రిశ్ర‌మ న‌మ్మే ఒక సూత్రం ప్ర‌కారం జీడీపీ పెరుగుద‌ల‌, త‌గ్గుద‌ల‌కు ఉద్యోగాల సృష్టికి సంబంధం ఉంటుంది. జీడీపీ పెరిగిన‌ప్పుడు ఉద్యోగాల కల్ప‌న పెరిగిన‌ప్పుడు జీడీపీ త‌గ్గితే సైతం ఉద్యోగాలు త‌గ్గిపోతాయి. సాధార‌ణంగా జీడీపీ 1% పెరిగితే 10 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగాలు వ‌స్తాయని న‌మ్మిక‌. అయితే ఇప్పుడు జీడీపీ త‌గ్గిన‌ప్పుడు సైతం అంతే స్థాయిలో నిరుద్యోగం పెరుగుతుంద‌నే అనుకోవాలి. దీనికి సంబంధించి ఆదిత్యా బిర్లా గ్రూప్ ముఖ్య ఆర్థిక వేత్త అజిత్ ర‌న‌డే విశ్లేష‌ణ ఈ విధంగా ఉంది "జీడీపీకి, ఉద్యోగాల క‌ల్ప‌న‌కు అవినాభావ సంబంధం క‌చ్చితంగా ఉంది. జీడీపీ పెరిగిన‌ప్పుడు ఉద్యోగాలు పెరిగితే జీడీపీ వృద్ది త‌గ్గితే ఉద్యోగాలు పోతాయ‌నేది స‌త్యం. కచ్చిత‌మైన ప్ర‌భావం గురించి చ‌ర్చించొచ్చు కానీ, ఏటా కార్మిక జ‌నాభాలో కొత్త‌గా 12 నుంచి 13 మిలియ‌న్లు జ‌త చేరుతుంటే 1% జీడీపీ మార్పు క‌నీసం 1 మిలియ‌న్ మందిపై ప‌డుతుంది."
ప్లేస్‌మెంట్లు క‌ల్పించే సంస్థ‌ల‌కు సైతం ఇది అంత సానుకూలంగా లేదు. అడెక్కో ఇండియా మేనేజ‌ర్,ఎండీ ప్రియాన్ష్ సింగ్ మాట్లాడుతూ "ఐటీ,బీపీవో వంటి ఉద్యోగాల క‌ల్ప‌న ఎక్కువ క‌ల్పించే రంగాల ద్వారా మ‌నం 15-20 ఏళ్లు న‌డిచాం. ప్ర‌స్తుతం అవి ఆ స్థాయిలో లేవు. దేశంలో జ‌నాభా ఎక్కువ అవుతుండ‌టంతో పాటు ల‌క్ష‌ల మంది ప్ర‌తి నెలా ఉద్యోగ మార్కెట్లోకి వ‌స్తున్నారు. ఇంత మందికి ఉద్యోగాల క‌ల్ప‌న ఎలా? ప‌్ర‌తి నెలా ల‌క్ష‌ల మంది ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ప్ర‌తి ఏటా కొత్త‌గా క‌ల్పిస్తున్న ఉద్యోగాల‌తో చూస్తే చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. " అన్నారు.
క్రిసిల్ ముఖ్య ఆర్థిక‌వేత్త థ‌ర్మ‌క్రితి జోషి సైతం దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. అయితే ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో కాస్త విబేధించారు. ఉద్యోగాల సృష్టి అనేది ఆయా రంగాల వృద్దిపైన ఆధార‌ప‌డి ఉంటుంది. గ‌తేడాది జీడీపీ ప‌డిపోయిన‌ప్పుడు అధిక ఉద్యోగాలు క‌ల్పించే త‌యారీ, నిర్మాణ రంగాలు నేరుగా ప్ర‌భావం చూపించింది. గ‌త కొన్నేళ్ల జీడీపీ వృద్ది చూసిన‌ప్పుడు అది ఆర్థిక సేవలు, టెలికాం రంగం, ఐటీ,ఐటీఈఎస్‌,బీపీవో వంటి రంగాల వల్ల జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం అవుతోంది అన్నారు. జీడీపీ వృద్దితో ఉద్యోగాల క‌ల్ప‌నకు పెద్ద‌గా సంబంధం ఉండద‌న్నారు. ఉద్యోగాల క‌ల్ప‌న‌కు సంబంధించి ఆటోమేష‌న్‌, కార్మిక చ‌ట్టాలు వంటివి కార‌కాల‌వుతాయి అని వివ‌రించారు.

Read more about: it jobs jobs automation gdp
English summary

ఉద్యోగాల క‌ల్ప‌న‌పై ప్ర‌భావం చూపుతున్న జీడీపీ వృద్ది | will gdp decline impact on New job creation in India

The moderation in GDP growth rate may further widen the gap between the number of job aspirants entering the market and the rate at which job creation is taking place. The situation has got staffing firms worried, and here’s why. According to the Economic Survey, the employment in organised sectors as on March 31, 2012, is 46.8 million.
Story first published: Thursday, September 21, 2017, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X