For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దిగ‌జారుడు నిజ‌మే: ఎస్‌బీఐ నివేదిక

దేశ ఆర్థిక వ్యవస్థ గత ఏడాది సెప్టెంబర్‌నుంచి దిగజారుతూనే ఉందని, ఈ మాంద్యం నిజమైందే తప్ప సాంకేతికపరమైంది కాదని ఎస్‌బీఐ రిసెర్చ్‌ ఒక నివేదికలో స్పష్టం చేసింది.

|

దేశ ఆర్థిక వ్యవస్థ గత ఏడాది సెప్టెంబర్‌నుంచి దిగజారుతూనే ఉందని, ఈ మాంద్యం నిజమైందే తప్ప సాంకేతికపరమైంది కాదని ఎస్‌బీఐ రిసెర్చ్‌ ఒక నివేదికలో స్పష్టం చేసింది. ఈ మాంద్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వ వ్యయం పెరగాలని కూడా సూచించింది.'2016 సెప్టెంబర్ నుంచి కూడా ఆర్థిక వ్యవస్థ దిగజారుడు ధోరణిలోనే ఉందని తాము భావిస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం దాకా కూడా కొనసాగిన ఈ మాంద్యం సాంకేతికంగా చూసినట్లయితే తాత్కాలికమైనది కాదనిపిస్తోంఇద' అని ఆ నివేదిక స్పష్టం చేసింది. మాంద్యం ఇప్పటికీ కొనసాగుతూ ఉండడంతో ఇది తాత్కాలికమైనదా కాదా అనే ప్రశ్న తలెత్తుతోందని ఆ నివేదిక పేర్కొంది కానీ ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం తెలపలేదు. వరసగా ఆరో త్రైమాసికంలో కూడా ఆర్థిక వృద్ధి మందగిస్తూ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గత మూడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా వృద్ధి రేటు 5.7 శాతం నమోదు కావడం తెలిసిందే. అయితే సాంకేతిక కారణాల వల్లనే వృద్ది రేటు మందగించిందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కొద్ది రోజుల క్రితం పేర్కొనడం తెలిసిందే. అయితే అది సాంకేతికపరమైంది కాదని దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బిఐకి చెందిన రిసెర్చ్ విభాగం పేర్కొనడం గమనార్హం. యుపిఏ అధికారంలో ఉన్న 2014 ఆర్థిక సంవత్సరంలో 4.7 శాతానికి పడిపోయిన వృద్ధి రేటు తిరిగి 7.1 శాతానికి పెరిగిందని కూడా అమిత్ షా చెప్పారు. కాగా, ప్రభుత్వ వ్యయం పెంచడమే ఈ సమస్యకు పరిష్కారమని ఎస్‌బిఐ రిసెర్చ్ అభిప్రాయ పడింది.

 ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఎస్‌బీఐ నివేదిక‌

ప్రభుత్వం రుణాల సేకరణకు సంబంధించిన గణాంకాలను దెబ్బ తీయకుండా ప్రభుత్వం జాగ్రత్తగా ఖర్చును పెంచాలని తాము అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్లు ఆ నివేదిక తెలిపింది. గతంలో ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి చర్యలను రేటింగ్ ఏజన్సీలు ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యంగా అభివర్ణించాయని ఆ నివేదిక గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం గనుక ఇలాంటి విధానాలను కొనసాగించినట్లయితే భారత్ రేటింగ్‌ను తగ్గిస్తామని కూడా అంతర్జాతీయ రేటింగ్ ఏజన్సీలు బెదిరించాయి కూడా. 2008 అంతర్జాతీయ రుణ సంక్షోభం తర్వాత ప్రభుత్వ వ్యయం పెరిగిన మాట నిజమేనని నివేదిక అంగీకరిస్తూనే, అయితే రేటింగ్ ఏజన్సీల హెచ్చరికలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని నిర్ద్వంద్వంగా పేర్కొంది.'రేటింగ్ పెరుగుదలకోసం మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. గత పాతికేళ్లలో భారత్ రేటింగ్ పెరుగుతూనే ఉంది' అని కూడా ఎస్‌బిఐ రిసెర్చ్ స్పష్టం చేసింది.'వృద్ధి రేటును పెంచడానికి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు ద్రవ్యపరమైన ఊతం అవసరం' అని ఆ నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్య లోటు మరింతగా పెరగకుండా చూడడం కోసం ప్రభుత్వం ఎక్కువ రుణాలకోసం వెళ్లకుండా బైబ్యాక్‌లు లాంటివి ఎక్కువ చేయాలని ఆ నివేదిక అభిప్రాయ పడింది. అంతేకాదు స్వల్పకాలిక రుణాలను తీసుకోవడాన్ని పెంచుకునే మార్గాలను పరిశీలించాలని కూడా నివేదిక సూచించింది.

Read more about: sbi report gdp economy
English summary

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దిగ‌జారుడు నిజ‌మే: ఎస్‌బీఐ నివేదిక | Economic slowdown is Real and not technical Sbi repost said

Noting that the economy has been on a downslide since September 2016, SBI Research today said the slowdown is real and not technical and called for more public spending to arrest the slide.
Story first published: Wednesday, September 20, 2017, 15:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X