For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లోని నల్లధనం ఆసియా దేశాల బ్యాంకుల్లోకి!

దేశంలో న‌ల్ల‌ధ‌నం ఇంత‌కుముందు ఎక్కువ‌గా కొన్ని స్వ‌ర్గ‌ధామాల‌కు మాత్ర‌మే వెళ్లేది. అయితే ఈ మ‌ధ్య ఈ తీరు మారింది. స్విట్జ‌ర్లాండ్ ఇంక ఎంత మాత్రం దానికి ప్ర‌ధాన కేంద్రం కాద‌ని వెల్ల‌డ‌వుతోంది. దీనికి

|

దేశంలో ఉన్న‌ న‌ల్ల‌ధ‌నం ఇంత‌కుముందు ఎక్కువ‌గా కొన్ని స్వ‌ర్గ‌ధామాల‌కు మాత్ర‌మే వెళ్లేది. అయితే ఈ మ‌ధ్య ఈ తీరు మారింది. స్విట్జ‌ర్లాండ్ ఇంక ఎంత మాత్రం దానికి ప్ర‌ధాన కేంద్రం కాద‌ని వెల్ల‌డ‌వుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

 స్విస్ బ్యాంకు డిపాజిట్ల‌లో 2007 నుంచి త‌గ్గుద‌ల‌

స్విస్ బ్యాంకు డిపాజిట్ల‌లో 2007 నుంచి త‌గ్గుద‌ల‌

దేశంలో నల్లధనం 2007 నుంచి 2015 నాటికి 90 శాతం పెరిగి, 62.9 బిలియన్ డాలర్లు అంటే రూ.4 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఈ సంపద విలువ 2015 స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతం. అలాగే స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే భారతీయుల సంఖ్య 2007తో పోల్చుకుంటే గణనీయంగా తగ్గిపోయింది. 2007లో 58 శాతంగా ఉన్న భారతీయ డిపాజిట్లు 2015 నాటికి 31 శాతానికి తగ్గిపోయాయి. మరోవైపు భారతీయుల సంపదలో సుమారు 53 శాతం హాంకాంగ్, మకావూ, సింగ్‌పూర్, బహ్రెయిన్, మలేషియా లాంటి ఆసియా దేశాల్లోనే డిపాజిట్ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

బీఐఎస్ నివేదిక‌

బీఐఎస్ నివేదిక‌

ద్వైపాక్షిక విదేశీ నిధుల ఒప్పందంలో భాగంగా బాసెల్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) తొలిసారిగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. గతేడాది వరకు అన్ని అంతర్జాతీయ లావాదేవీల అంశాలను వెల్లడించిన బీఐఎస్, డిపాజిట్ చేసిన వారి వివరాలను మాత్రం పేర్కొలేదు. బీఐఎస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో పన్ను చెల్లించని ఆదాయం 8.6 ట్రిలియన్ బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అంటే ప్రపంచ జీడీపీలో ఇది 11.6 శాతం. 2007తో పోల్చుకుంటే ఇది 54 శాతం పెరిగింది. రియల్ ఎస్టేట్, కళల లాంటి ఆర్థికేతర ఆస్తుల విలువను ఇందులో చేర్చలేదు.

ఎక్కువ‌గా ఆసియా దేశాల్లో

ఎక్కువ‌గా ఆసియా దేశాల్లో

భారత్‌లో నల్లధనానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా, దానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఈ వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో స్విట్జర్లాండ్ కొంత పారదర్శకంగా వ్యవహరించడంతో నల్లకుబేరులు తమ నిధులను హాంకాంగ్, సింగపూర్ లాంటి దేశాలకు తరలిస్తున్నారు. ఇదే విషయాన్ని పనామా పత్రాలు కూడా వెల్లడించాయి. భారతీయులు డిపాజిట్ చేసిన ధనం స్విట్జర్లాండ్‌లో 31 శాతం, ఆసియా దేశాల్లో 53 శాతం, కరేబియన్ దేశాల్లో 4 శాతం, ఐరోపాలో 14 శాతంగా ఉంది.

 స్కాండివేనియా దేశాల న‌ల్ల‌ధ‌నం వాటి జీడీపీలో కొద్ది శాతం మాత్ర‌మే...

స్కాండివేనియా దేశాల న‌ల్ల‌ధ‌నం వాటి జీడీపీలో కొద్ది శాతం మాత్ర‌మే...

నల్లధనం విషయంలో దేశాల మధ్య వైవిధ్యమైన అసమానతలు ఉన్నాయి. స్కాండివేనియా దేశాలలో వారి జీడీపీలో కేవలం కొద్ది శాతం మాత్రమే. రష్యా, గల్ఫ్, అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో ఇది 60 శాతం వరకు పెరిగింది. చైనాలో సుమారు 287 బిలియన్ డాలర్ల నల్లధనం ఉందిది, ఇది ఆ దేశ 2015 జీడీపీలో 2.4 శాతం. జపాన్, కొరియా దేశాల్లో పన్ను చెల్లించని ఆదాయం చాలా తక్కువ మొత్తంలో ఉంది. ఈ విశ్లేష‌ణ‌లో బ‌య‌ట‌ప‌డిన విష‌యం మ‌రొక‌టి ఉంది. ప్ర‌పంచంలో మొద‌టి 0.1 శాతం ధ‌న‌వంతుల సంప‌ద‌ను వారు విదేశాల్లో దొంగ‌గా దాచిన దాంతో క‌లిపి లెక్కిస్తే వివిధ దేశాల సంప‌ద వ్య‌త్యాసాలు ఇంకా బ‌య‌ట‌ప‌డతాయి.

Read more about: black money asia swiss bank
English summary

భారత్‌లోని నల్లధనం ఆసియా దేశాల బ్యాంకుల్లోకి! | Indian offshore wealth parks itself in tax havens of asia

Offshore wealth held by Indians in tax havens has surged nearly 90 per cent since 2007 to $62.9 billion (about Rs 4 lakh crore) in 2015. That's about 3.1 per cent of the country's GDP in 2015, the latest year for which data is available.
Story first published: Saturday, September 16, 2017, 12:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X