For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశ‌వ్యాప్త నెట్వ‌ర్క్‌తో పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంకు

పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌కు ఉన్న 1.55 లక్ష‌ల కార్యాల‌యాలు, 3 లక్ష‌ల మంది ఉద్యోగుల ద్వారా 2018 చివ‌రి క‌ల్లా దేశంలోనే రెండో అతిపెద్ద పేమెంట్ బ్యాంకు మొద‌ల‌వుతుంది.

|

1.55 ల‌క్ష‌ల తపాలా శాఖ‌ల ద్వారా పోస్ట‌ల్ బ్యాంకు శాఖ‌ల‌ను తెరిచేందుకు సన్నాహాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ఆర్‌బీఐ గ‌తంలోనే దీనికి సంబంధించి తుది అనుమ‌తులు ఇచ్చింది. పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌కు ఉన్న 1.55 లక్ష‌ల కార్యాల‌యాలు, 3 లక్ష‌ల మంది ఉద్యోగుల ద్వారా 2018 చివ‌రి క‌ల్లా దేశంలోనే రెండో అతిపెద్ద పేమెంట్ బ్యాంకు మొద‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో దీనికి సంబంధించి మ‌రిన్ని అంశాలు తెలుసుకుందాం.

 1. మార్చి, 2018 నాటికి ప్ర‌తి జిల్లాలో పోస్ట‌ల్ బ్యాంకు

1. మార్చి, 2018 నాటికి ప్ర‌తి జిల్లాలో పోస్ట‌ల్ బ్యాంకు

మార్చి,2018 నాటికి ప్ర‌తి జిల్లాలో పోస్ట‌ల్ బ్యాంకు ఉంటుంది. 1.55 లక్ష‌ల త‌పాలా కార్యాల‌యాలు, పోస్ట్‌మెన్‌, గ్రామీణ్ డాక్ సేవ‌క్ చేతుల్లో పేమెంట్ వ్య‌వ‌హ‌రాలు జ‌రిపేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ప‌రిక‌రాన్ని అందిస్తారు. అని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) సీఈవో ఏపీ సింగ్ యునైటెడ్ నేష‌న్స్ నిర్వ‌హించిన ఫైనాన్సియ‌ల్ ఇంక్లూజ‌న్ కార్య‌క్ర‌మంలో చెప్పారు.

2. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు

2. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు

ప్రైవేటు రంగంలో సైతం ప‌లు పెద్ద సంస్థ‌ల‌కు ఆర్బీఐ పేమెంట్ బ్యాంకుల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తిచ్చింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మైన ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు దాదాపు నెట్‌వ‌ర్క్‌లోని 2.5 ల‌క్ష‌ల ఎయిర్‌టెల్ రిటైల‌ర్ల సాయంతో పేమెంట్ బ్యాంకు చెల్లింపుల విధానాన్ని విస్త‌రించింది. పేమెంట్ బ్యాంకుల ద్వారా చిన్న మొత్తాల డిపాజిట్ల‌ను సైతం స్వీక‌రిస్తోంది.

3. రూ.1 ల‌క్ష లోపు డిపాజిట్ చేయించుకోవ‌చ్చు.

3. రూ.1 ల‌క్ష లోపు డిపాజిట్ చేయించుకోవ‌చ్చు.

పేమెంట్ బ్యాంకులు ఒక్కో ఖాతాకు రూ.1 ల‌క్ష లోపు డిపాజిట్ల‌ను సైతం స్వీక‌రించ‌వ‌చ్చు. కేవ‌లం ఇది వ్య‌క్తుల నుంచే కాకుండా చిన్న చిన్న వ్యాపారుల నుంచి సైతం చేయ‌వ‌చ్చు. ఈ త‌ర‌హా బ్యాంకింగ్లో వ్య‌క్తులు, చిన్న వ్యాపారాల‌కు వివిధ మొబైల్ సంస్థ‌లు, సూప‌ర్ మార్కెట్ దుకాణాలు వంటి వాటి ద్వారా బ్యాంకింగ్ అవ‌స‌రాలు తీరాల‌నేది ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

4. పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంకు

4. పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంకు

ఇండియ‌న్ పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంకు త‌న విస్తృత నెట్‌వ‌ర్క్ ద్వారా డిపాజిట్ల‌ను తీసుకోవ‌చ్చు. రూ.25 వేల లోపు డిపాజిట్ల‌పై 4.5%, రూ.25 వేల నుంచి రూ.50 వేల వ‌ర‌కూ ఉండే డిపాజిట్ల‌కు 5%, రూ.50,000-రూ.1 ల‌క్ష మ‌ధ్య డిపాజిట్ల‌కు 5.5% మేర వ‌డ్డీ రేట్ల‌ను పోస్ట‌ల్ బ్యాంకు చెల్లిస్తుంది.

5.ఆధార్‌తో చెల్లింపులు త‌క్కువ ధ‌ర‌లో

5.ఆధార్‌తో చెల్లింపులు త‌క్కువ ధ‌ర‌లో

కింది నుంచి పై స్థాయి వ‌ర‌కూ ప‌నిచేసేలా పోస్ట‌ల్ బ్యాంకు విధానం ఉంటుంది. బ్యాంకింగ్‌ను ఎస్‌బీఐ ప్ర‌జ‌ల‌కు ఎలా చేరువ చేసిందో అదే విధంగా అంద‌రిలోకి డిజిట‌ల్ చెల్లింపుల‌ను తీసుకుపోవ‌డంలో పోస్ట‌ల్ బ్యాంక్ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని సింగ్ అన్నారు. తాము చెల్లింపుల విధానంలో ఆధార్‌ను పేమెంట్ అడ్ర‌స్‌గా ఉప‌యోగిస్తామ‌ని ఏపీ సింగ్ చెప్పారు. త‌ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపులు అతి త‌క్కువ ధ‌ర‌లో ఒక లావాదేవీ 1పైసా అయ్యేలా చేస్తామ‌న్నారు.

Read more about: postal bank payment banks banking
English summary

దేశ‌వ్యాప్త నెట్వ‌ర్క్‌తో పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంకు | all post offices to offer payments bank service from next financial year

India Post Payments Bank is gearing up to provide its financial services through all of 1.55 lakh post offices and 3 lakh employees by the end of 2018 -- which will create India’s second-largest payments bank in terms of reach.
Story first published: Thursday, September 14, 2017, 11:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X