For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ రెండింటిలో ఆంధ్ర ప్ర‌గ‌తి గ్రామీణ బ్యాంక్

ఇటీవ‌ల ఫ‌లితాల ప్ర‌కారం దేశంలో 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రెండు బ్యాంకులు మాత్రం నిక‌ర లాభంలో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచాయి.

|

రెండు గ్రామీణ బ్యాంకుల లాభాలు రూ.150 కోట్లు
దేశంలో బ్యాంకుల ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రికీ తెలుసు. మ‌రి గ్రామీణ బ్యాంకుల ప‌రిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. అయితే ఇటీవ‌ల ఫ‌లితాల ప్ర‌కారం దేశంలో 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రెండు బ్యాంకులు మాత్రం నిక‌ర లాభంలో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచాయి. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.150 కోట్ల‌కు పైగా లాభాన్ని ఆర్జించాయి. మొత్తం 49 బ్యాంకులు లాభాలు గ‌డించగా అత్య‌ధిక లాభాల‌ను ఈ రెండు బ్యాంకులే సాధించాయి. ఆర్‌బీఐ విడుద‌ల చేసిన బ్యాంకింగ్ పురోగ‌తి నివేదిక ఆధారంగా చూస్తే 56 గ్రామీణ బ్యాంకుల్లో 45 మాత్రం ఎటువంటి న‌ష్టాల‌ను కొన‌సాగించ‌కుండా లాభాల‌ను గ‌డించాయి.

ఆంధ్ర ప్ర‌గ‌తి గ్రామీణ బ్యాంక్ 2016-17 లాభం రూ.174 కోట్లు

మెరుగుప‌డుతున్న గ్రామీణ బ్యాంకుల ప‌రిస్థితి

సిండికేట్ బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ప్ర‌థ‌మ బ్యాంక్, క‌ర్ణాట‌క గ్రామీణ వికాస్ బ్యాంక్‌, ఆంధ్ర‌ప్ర‌గ‌తి గ్రామీణ బ్యాంక్ 2015-16 సంవ‌త్స‌రంతో పోలిస్తే నిక లాభాల్లో పురోగ‌తి సాధించాయి. ఈ మూడు గ్రామీణ బ్యాంకులు మూడు రాష్ట్రాల్లో 18 జిల్లాల‌ను క‌వ‌ర్ చేశాయి. మొత్తం 1563 బ్యాంకు శాఖ‌లు వీటి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయి. క‌ర్ణాట‌క గ్రామీణ వికాస్ బ్యాంక్ దాదాపు 154 కోట్ల లాభాన్ని గ‌డించ‌గా, ఆంధ్ర ప్ర‌గ‌తి గ్రామీణ బ్యాంక్ 174 కోట్ల లాభాన్ని గ‌డించింది. అంత‌కు ముందు మార్చి 31,2016తో ముగిసిన ఆర్థిక సంవవ‌త్స‌రంలో సైతం అత్య‌ధిక లాభాల‌ను గ‌డించిన వాటిలో ఈ రెండు బ్యాంకులు ముందుండ‌టం గ‌మ‌నార్హం.

Read more about: rrb rural banks banking
English summary

ఆ రెండింటిలో ఆంధ్ర ప్ర‌గ‌తి గ్రామీణ బ్యాంక్ | Only seven of the 56 RRBs suffer losses during the year

Of the 56 regional rural banks (RRBs) in the country, two notched up net profit of over ₹150 crore each during 2016-17. These are among the 49 RRBs that recorded a profit in 2016-17. Seven RRBs suffered losses during the period.
Story first published: Wednesday, August 23, 2017, 17:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X