For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార‌త్‌లో త‌గ్గుతున్న వినియోగ‌దారు విశ్వాసం: మాస్ట‌ర్ కార్డ్ సర్వే

జూలైతో ముగిసిన మొదటి అర్థ భాగంలో భారత ఆర్థిక వ్యవస్థపై వినియోగదారుల విశ్వాసం భారీగా తగ్గిపోయిందని మాస్టర్‌కార్డ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తికర విష‌యాలు ఇక్క

|

మ‌న‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్రజల మాట
ప్రభుత్వం దేశం అభివృద్ధి చెందుతోందని సర్కారు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వాటిని పూర్తిగా విశ్వసించే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలైతో ముగిసిన మొదటి అర్థ భాగంలో భారత ఆర్థిక వ్యవస్థపై వినియోగదారుల విశ్వాసం భారీగా తగ్గిపోయిందని మాస్టర్‌కార్డ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తికర విష‌యాలు ఇక్క‌డ తెలుసుకుందాం.

ఈ ఏడాది మొద‌టి ఆరు నెల‌ల కాలంలో

ఈ ఏడాది మొద‌టి ఆరు నెల‌ల కాలంలో

అంతకు ముందు జులై-డిసెంబరు మధ్య కాలంతో పోలిస్తే వినియోగదారుల విశ్వాసం ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో బాగా దెబ్బతిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశంలో జీవన ప్రమాణాలు బాగా ప్రభావితమైనట్టుగా పేర్కొంది. ఈ మాస్ట‌ర్ కార్డ్ స‌ర్వే దాదాపు 20 ఏళ్ల ట్రాక్ రికార్డు క‌లిగి ఉంది. ఇక్క‌డ ఉండే పాయింట్ల‌లో 100 గ‌రిష్ట విశ్వాసాన్ని సూచించ‌గా 50 పాయింట్లు వ‌స్తే అది త‌ట‌స్థ భావ‌న‌ను తెలుపుతుంది.

ఆసియా ప‌సిఫిక్‌లో ప‌లు దేశాల్లో స‌ర్వే

ఆసియా ప‌సిఫిక్‌లో ప‌లు దేశాల్లో స‌ర్వే

మాస్టర్‌ కార్డ్‌ సంస్థ సోమవారం 'కన్జూమర్‌ కాన్ఫిÛడెన్స్‌ సూచీ' వివరాలను వెల్లడించింది. ఈ నివేదికలో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని 19 మార్కెట్లలో మొత్తం 11 మార్కెట్లలో వినియోగదారుల విశ్వాసం నిలకడగా ఉందని సంస్థ పేర్కొంది. భారత్‌లో వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతున్నప్పటికీ ఆశావాద విభాగంలోని నిలిచి ఉందని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలో 18 నుంచి 64 ఏండ్ల మధ్య వయస్కులైన దాదాపు 9,153 మంది నుంచి వారివారి ఆర్థిక వ్యవస్థల పట్ల అభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం మాస్టర్‌ కార్డ్‌ ఈ నివేదికను విడుదల చేసింది.

ఉపాధి, జీవన ప్రమాణాలపై అనిశ్చితి

ఉపాధి, జీవన ప్రమాణాలపై అనిశ్చితి

ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు, నిరంతర ఆదాయ అవకాశాలు, స్టాక్‌ మార్కెట్లు, జీవన ప్రమాణాలలో పరిణామాలను గురించి ఆయా దేశాల్లో ప్రజలు అభిప్రాయాలను మాస్టర్‌ కార్డ్‌ సమీకరించి ఈ నివేదికను తయారు చేసింది. భారత్‌ విషయానికి వస్తే నివేదికకు ప్రామాణికంగా తీసుకున్న అయిదు అంశాల్లోనూ ప్రజల విశ్వాసం సన్నగిల్లుతూ కనిపించడం విశేషం. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం (-11.0), జీవన ప్రామాణాలు (-11.6) విభాగంలో ప్రజల్లో భారీగా విశ్వాస లోపం కనిపించింది.

వివిధ దేశాల్లో ఇలా...

వివిధ దేశాల్లో ఇలా...

చైనా మ‌న‌కంటే మెరుగ్గా క‌నిపించింది. ప్రధానంగా ఉపాధి అవకాశాల రంగంలో అత్యధికంగా (12.1%) వృద్ధి కనిపించింది. దక్షిణ-కొరియా, సింగపూర్‌, మలేషియాలలో కూడా వినియోగదారుల విశ్వాసం పెరగడం గమనార్హం. స్టాక్‌ మార్కెట్లలో మెరుగైన వృద్ధి, ఉపాధి అవ‌కాశాలు మెరుగవుతుండడంతో దాదాపు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో వినియోగదారుల విశ్వాసం పెరగడం కనిపించింది. గ‌తేడాది కంటే విశ్వాస సూచీలో 9.3 పాయింట్లు త‌గ్గి ఇండియా 86 ద‌గ్గ‌ర ఉన్న‌ప్ప‌టికీ ఇండియా ఇప్ప‌టికీ అంత‌ర్జాతీయంగా ఆశాజ‌న‌కంగా ఉండ‌టం కొస‌మెరుపు. అయితే పొరుగు దేశం చైనా విష‌యంలో విశ్వాస సూచీ పాయింట్లు 88.2గా ఉన్నాయి. అయిదు విభాగాల్లో మేటి ప్రదర్శనను కనబరిచిన చైనా ర్యాకింగ్‌లో భారత్‌ కంటే మెరుగైన స్థానంలో నిలిచింది. ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో వినియోగ‌దారు విశ్వాసంలో ద‌క్షిణ కొరియా అగ్ర స్థానంలో ఉండ‌గా, మ‌య‌న్మార్ కంటే దిగువ‌న ఇండియా ఉంది.

Read more about: master card consumer
English summary

భార‌త్‌లో త‌గ్గుతున్న వినియోగ‌దారు విశ్వాసం: మాస్ట‌ర్ కార్డ్ సర్వే | India continues to stay in very optimistic territory in asia pacific

ndia continues to stay in very optimistic territory at 86.0 points, despite posting the region's largest decline of 9.3 points. Consumer sentiment also saw a slight deterioration of 6 points in Myanmar. According to the Index, pessimism towards Quality of Life was the key driver of decline for both India and Myanmar.
Story first published: Tuesday, August 22, 2017, 14:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X