For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశంలో క‌మొడిటీ వ్యాపారంలో మొద‌టి మ‌హిళ‌

గ్వాలియ‌ర్‌కు చెందిన ఒక అమ్మాయి క‌మొడిటీ వ్యాపారంలో ఒక సంప్ర‌దాయాన్ని మార్చేసింది. ఆమె ఏం చేసింది, ఎలా చేసిందో తెలుసుకుందాం.

|

అక్క‌డ ఏ కొత్త వ్యాపారం మొద‌లుపెట్టినా లిక్క‌ర్ మాఫియా వ‌చ్చేస్తుంది. మీ ప‌క్క‌నే బార్ తెరిచేస్తుంది. అది చంబ‌ల్ ప్రాంతంలో జ‌రిగే తంతు. అలాంటి ప‌రిస్థితుల్లో వ్యాపారం మొద‌ల‌లుపెట్టి కొన‌సాగించ‌డం అంత సులువేం కాదు. అయితే గ్వాలియ‌ర్‌కు చెందిన ఒక అమ్మాయి దీన్ని మార్చేసింది. ఆమె ఏం చేసింది, ఎలా చేసిందో తెలుసుకుందాం.

 1. దేశంలో క‌మొడిటీ వ్యాపారంలో ఉన్న ఏకైక మ‌హిళ‌

1. దేశంలో క‌మొడిటీ వ్యాపారంలో ఉన్న ఏకైక మ‌హిళ‌

28 ఏళ్ల దీపాళి చిన్న త‌నం నుంచే చాలా ర‌కాల వ్యాపారాలు ప్ర‌య‌త్నించింది. ఒక దాని త‌ర్వాత ఒక‌టిగా చివ‌ర‌కు క‌మొడిటీ వ్యాపారం ద‌గ్గ‌ర ఆగింది. మొత్తం మ‌గ‌వాళ్లే నిర్వ‌హించ‌గ‌ల క‌మొడిటీ వ్యాపారంలో మొట్ట‌మొద‌టి మ‌హిళ‌గా నిలిచింది. భార‌త్‌లో పూర్తి కాలం పాటు క‌మొడిటీ వ్యాపారంలో ఉన్న ఏకైక మ‌హిళ ఈ అమ్మాయే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం గోదుమ‌ల వ్యాపారానికి సంబంధించి ఒక సొంత సంస్థ‌ను ఇండోర్‌లో ఆమె రిజిస్ట‌ర్ చేసింది.

2. ఐఏఎస్ అధికారిణి కావాల‌నుకుని

2. ఐఏఎస్ అధికారిణి కావాల‌నుకుని

దీపాళి చిన్న నాటి క‌ళ ఐఏఎస్ అధికారిణి కావాల‌న‌ట‌. అయితే ఆ క‌ల దారి త‌ప్పి చివ‌ర‌కు దేశంలో మంచి పేరున్న క‌మొడిటీ వ్యాపారంలో ప్ర‌వేశించింది. మ‌న దేశం ఈ వ‌స్తు వ్యాపారానికి బాగానే ఉంటుంది. ఈ అమ్మాయి 12వ త‌ర‌గ‌తి చ‌దివేట‌ప్పుడు తండ్రి వ్యాపారంలో న‌ష్టాల పాల‌య్యారు. దాంతో ఆమె ఉన్న‌త చ‌దువుల‌కు ఆర్థికంగా తోడ్పాటు నందించ‌లేక‌పోయాడు.

3. ఓట‌మిని ఒప్పుకోలేదు...

3. ఓట‌మిని ఒప్పుకోలేదు...

సిందియా పాఠ‌శాల విద్యార్థి అయిన ఈ అమ్మాయి టిఫిన్ స‌ర్వీస్‌, హాస్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌, రెస్టారెంట్ న‌డ‌ప‌డం వంటి వాటిలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. వివిధ ర‌కాల ప‌నులు చేస్తూ త‌న చ‌దువులు పూర్తిచేసుకుంది. త‌ను ఒక ప‌క్క చ‌దువుకుంటూ మ‌రో వైపు ప‌నిచేస్తూ కుటుంబానికి సైతం ఆర్థికంగా త‌న వంతు తోడ్పాటు నందించింది.

4. ఇత‌ర వ్యాప‌కాలు

4. ఇత‌ర వ్యాప‌కాలు

చ‌దువులే కాదు ఇత‌ర అంశాల్లో సైతం ఆమెకు ఆస‌క్తి ఉంది. ఆట‌ల్లో చాలా చురుకుగా పాల్గొంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నో క్రీడ‌ల్లో పాల్గొంది. అంతే కాకుండా బాస్కెట్ బాల్‌, హాండ్ బాల్ క్రీడ‌ల్లో ఆమె జాతీయ స్థాయి క్రీడాకారిణి.

5. గోదుమ‌ల వ్యాపారంలోకి

5. గోదుమ‌ల వ్యాపారంలోకి

జ‌య ల‌క్ష్మి ఫుడ్స్ పేరుతో ఇండోర్ క‌మొడిటీ మార్కెట్లో త‌న సంస్థ‌ను ఆమె రిజిస్ట‌ర్ చేసింది. ప‌గ‌లు, రాత్రి ప‌నిచేసి క‌మొడిటీ ట్రేడింగ్‌లో మెల‌కువ‌లు నేర్చుకుంది. ఇండోర్ మార్కెట్లో దాదాపు 1500 రిజిస్ట‌ర్డ్ ట్రేడ‌ర్లు ఉన్నారు. అంద‌రూ ఈ వ్యాపారంలోకి దీపాళిని స్వాగ‌తించారు. ఆమె కార్యాల‌యం క‌మొడిటీ మార్కెట్ కౌన్సిల్ క్యాంప‌స్‌లో ఉంది.

6. రూ.60 కోట్ల వ్యాపారం

6. రూ.60 కోట్ల వ్యాపారం

ఆమె ఒక సంస్థ‌లో ప‌నిచేసేట‌ప్పుడు గోదుమ‌లు శాంపిల్ చెక్ చేసి ఆర్డ‌ర్ చేసే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించింది. త‌ర్వాత వాటిని కొరియ‌ర్లో పంప‌డం, ఆర్డ‌ర్లు వ‌చ్చిన త‌ర్వాత మార్కెట్లో వెళ్లి స‌ప్లై చేసేది. గ‌త మూడేళ్లుగా ఈ ట్రేడింగ్‌ను నిరాటంకంగా కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే దాదాపు రూ.60 కోట్ల మేర వ్యాపారం నిర్వ‌హించింది.

7. ఇండోర్‌కు వ‌చ్చి... అక్క‌డ ప‌నిచేసి...

7. ఇండోర్‌కు వ‌చ్చి... అక్క‌డ ప‌నిచేసి...

5 ఏళ్ల కింద‌ట దీపాళి ఇండోర్ వ‌చ్చిన‌ప్పుడు ఆమె మొద‌ట కే పీ ఫుడ్స్ సంస్థ‌లో ఉద్యోగంలో చేరింది. అక్క‌డ చాలా క‌ష్ట‌ప‌డి అంకిత భావంతో ప‌నిచేసింది. కొన్ని సార్ల‌యితే రాత్రి 10 గంట‌ల వ‌ర‌కూ ప‌నిచేసి చాలా కొత్త అంశాల‌ను తెలుసుకుంది. గ‌తేడాది సొంత వ్యాపారానికి అనుమ‌తి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆమె వెనుదిరిగి చూడ‌లేదు. ఆ వ్యాపారం స‌జావుగా న‌డుస్తోంది. మొద‌ట అనుమ‌తి రాక‌ముందు సంస్థ లాగా కాకుండా మామూలుగా బిజినెస్ న‌డిపింది.

Read more about: commodities wheat business
English summary

దేశంలో క‌మొడిటీ వ్యాపారంలో మొద‌టి మ‌హిళ‌ | Girl from Gwalior making waves in commodity business

Dipali wrapped up her business in Gwalior and reached Indore. Now, this girl is making waves in the commodity business which has been monopolised by men till now. 28-year-old Dipali has become the first woman in India to remain engaged in the commodity business full-time.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X