English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఆన్‌లైన్ షాపింగా? ఈ 40 వెబ్‌సైట్లలో దొరికే కూప‌న్ కోడ్‌ల ద్వారా మీరు డ‌బ్బు ఆదా చేసుకోవ‌చ్చు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ఆన్లైన్ షాపింగ్‌ల గురించి తెలియ‌ని వారు ఎవ‌రూ లేరంటే అతిశ‌యోక్తి కాదు. దీని గురించి తెలియని వారెవరున్నారు చెప్పండి ? మరి ఈ క‌థ‌నం ఎందుకు అంటారా ? ఆన్‌లైన్ షాపింగ్ అంటే కొందరు అంతా మోసం అంటున్నారు , మరికొందరేమో ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఏంటో మాకు తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు , మరి కొందరు ఇలా చేస్తూ కూడా మాకు ఏంటి ప్ర‌యోజ‌నం అనే ప్రశ్న‌లు వేస్తుంటారు ... దానికోసమే ఆన్‌లైన్ షాపింగ్ చేసే వాళ్లకు ఇక్క‌డ కొన్ని ముఖ్య విష‌యాల గురించి తెలియ‌జేయాల‌నుకుంటున్నాం. అవి ఏంటో కింద చ‌ద‌వండి.

1. ఈ-షాపింగ్ జాగ్ర‌త్త‌గా చేయాలి

1. ఈ-షాపింగ్ జాగ్ర‌త్త‌గా చేయాలి

దేశీయ ఈ-కామ‌ర్స్ రంగం ఫ్లిప్‌కార్ట్ త‌ర్వాత చాలా మారిపోయింది. అయితే కొంత మంది చేసే చిన్న త‌ప్పుల వ‌ల్ల ఆన్‌లైన్ షాపింగ్ మోసం అనే ముద్ర వేస్తున్నారు. నిజానికి కంగారుగా కాకుండా జాగ్ర‌త్త‌గా షాపింగ్ చేస్తే మ‌న‌కు న‌ష్టం ఏమీ ఉండ‌దు. అయితే ప్ర‌తి వ‌స్తువు కొనేముందు కొంత శోధ‌న చేయ‌డం మంచిది. ఆన్‌లైన్‌లో వ‌స్తువు రేటింగ్ చూడొచ్చు. కొంత మంది ఆయా వెబ్‌సైట్ల‌లో కొన్న వ‌స్తువుల‌కు రివ్యూలు రాస్తుంటారు. వీల‌యితే ఒక‌సారి వాటినీ ప‌రిశీలించండి. మీరే ఏదో వ‌స్తువు కోసం పేటీఎమ్, ఫ్లిప్‌కార్ట్లోకి వెళ్లారు. అక్క‌డ ఒక వ‌స్తువు కొనాలంటే దాని గురించి కొంచెం అయినా శోధిస్తారు క‌దా. ఒక‌వేళ మీకు కావాల్సిన వ‌స్తువు మీరు ఎంట‌ర్ అయిన వెబ్సైట్లో దొర‌క‌లేదంటే ఆ వెబ్‌సైట్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం మంచిది.

2. ధ‌రే ముఖ్యం కాకూడ‌దు

2. ధ‌రే ముఖ్యం కాకూడ‌దు

ఏదైనా వ‌స్తువును ఆన్‌లైన్‌లో కొనేట‌ప్పుడు చాలా మంది ఆలోచించేది ఎక్క‌డ త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుంద‌ని. త‌క్కువ రేటుకు వ‌స్తుంద‌ని ఏది ప‌డితే అది ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కొన‌కూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది హ‌డావిడిలో చేసే పెద్ద తప్పు ఇదే. అవ‌స‌రం ఉన్నా లేకున్నా త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుంద‌ని కొనేస్తుంటారు.

 3. రాయితీలు, కూప‌న్లు కూడా డ‌బ్బుని ఆదా చేస్తాయి...

3. రాయితీలు, కూప‌న్లు కూడా డ‌బ్బుని ఆదా చేస్తాయి...

ఆన్‌లైన్‌లో మ‌నం ఎక్కువగా చేసే ప‌ని డిస్కౌంట్లు, కూప‌న్లు ఎక్క‌డ దొరుకుతాయా అని. వాటిని కూడా ప‌రిశీలించండి. ఒక్కో వెబ్‌సైట్లో ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. వివిధ వెబ్‌సైట్ల‌లో దేనికి సంబంధించిన కూప‌న్లు మంచిగా ఉంటాయో తెలుసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు గ్రాబ్‌.ఆన్ బుక్‌మైషో కూప‌న్ల‌ను బాగా ఇస్తూ ఉంటుంది. కూప‌న్ కోడ్ అప్లై చేయ‌డం ద్వారా డ‌బ్బు ఆదా చేసుకోవ‌చ్చు. కూప‌న్ కోడ్ ఇవ్వ‌డం మ‌రిచిపోయారంటే ఒక‌సారి ఆర్డ‌ర్ ఇచ్చిన త‌ర్వాత మీరు అక్క‌డ సూచించిన డ‌బ్బు చెల్లించాల్సిందే. లేక‌పోతే మ‌ర‌లా ఆర్డ‌ర్ క్యాన్సిల్ చేసి ఆర్డ‌ర్ ఇవ్వాల్సి వ‌స్తుంది. కొన్ని వ‌స్తువుల‌కు ఫ‌ర్వాలేదు. కొన్నింటిని క్యాన్సిల్ చేస్తున్నారంటే కొంత క్యాన్సిలేష‌న్ రుసుము కూడా మీరే భ‌రించాల్సి రావొచ్చు. కాబట్టి ఈ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి.

4. క్యాష్‌బ్యాక్ కోసం వెబ్‌సైట్లు

4. క్యాష్‌బ్యాక్ కోసం వెబ్‌సైట్లు

క్యాష్ బ్యాక్ కోసం జ‌నాల్లో ఎక్కువ‌గా పాపుల‌ర్ అయిన వెబ్‌సైట్లు పేటీఎమ్‌, ఫ్రీచార్జీ వంటివి. దాదాపుగా ఆ వెబ్‌సైట్లో కొనే ప్ర‌తి వ‌స్తువుకు మొద‌ట్లో ఈ రీచార్జీ వెబ్‌సైట్ల‌న్నీ ఏదో ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించేవి. క్యాష్ బ్యాక్ కోసం ప్ర‌త్యేకంగా ఉన్న వాటిలో న‌మ్మ‌దగిన వెబ్‌సైట్లను మాత్ర‌మే ఫాలో అవండి. లేదా స‌మ‌యం వృథా అవుతుంది.

5. అద‌నంగా డ‌బ్బు ఆదా చేసేందుకు

5. అద‌నంగా డ‌బ్బు ఆదా చేసేందుకు

దీపావ‌ళి, ద‌స‌రా, సంక్రాంతి, కొత్త సంవ‌త్స‌రం లేదా ఇత‌ర పండుగ‌ల‌కు అప్పుడ‌ప్పుడు వెబ్‌సైట్లు డిస్కౌంట్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుంటాయి. ఆన్‌లైన్‌లో క్యాష్‌కరో.కామ్‌, గ్రాబ్ఆన్‌.ఇన్‌ వంటివి ఈ మ‌ధ్య ప్రాచుర్యంలోకి వ‌స్తున్నాయి. కొన్ని దీర్ఘ‌కాల ప్ర‌ణాళిక‌తో కొనే వ‌స్తువుల కోస‌మయితే మీ షాపింగ్‌ను కొద్ది రోజులు వాయిదా వేసి ఆయా ప్ర‌త్యేక సంద‌ర్భాల కోసం వేచి చూడ‌టం మంచిది.

6. ఆర్డ‌ర్ చేసిన వ‌స్తువు న‌చ్చ‌లేదంటే ఎలా?

6. ఆర్డ‌ర్ చేసిన వ‌స్తువు న‌చ్చ‌లేదంటే ఎలా?

మీరు ఆర్డ‌ర్ చేసిన వ‌స్తువు మీ చేతికి వ‌చ్చిన త‌ర్వాత వెన‌క్కు పంపేందుకు అవ‌కాశం ఉంటుంది. రిట‌ర్ను పాల‌సీ ఆధారంగా మీరు ఇది చేయండి. పోటీ కార‌ణంగా చాలా వ‌స్తువుల‌కు ప్ర‌ముఖ వెబ్‌సైట్ల‌న్నీ వారం నుంచి రెండు వారాల్లోపు రిట‌ర్ను చేసేందుకు వీలుగా అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. కాబ‌ట్టి కొనేశాము క‌దా, న‌చ్చ‌క‌పోతే ఎలా అనే అనుమానం అవ‌సరం లేదు. మీరు ఆర్డ‌ర్ చేసే ప్ర‌తి వ‌స్తువుని ఎంత స‌మ‌యంలో రిట‌ర్ను చేయాల‌నే విష‌యాన్ని మీ ప్యాకేజీలో రాసి ఉంటారు. రిట‌ర్ను చేశాక ఏ ఖాతాతో అయితే ఆర్డ‌ర్ చేశామో, ఆ బ్యాంకు ఖాతాలోకి డ‌బ్బు తిరిగి వ‌చ్చేస్తుంది.

7. ఆన్‌లైన్ షాపింగ్ కోసం వినియోగ‌దారుడి వ‌ద్ద ఏమి ఉండాలి?

7. ఆన్‌లైన్ షాపింగ్ కోసం వినియోగ‌దారుడి వ‌ద్ద ఏమి ఉండాలి?

* షాపింగ్ కోసం ఏ వెబ్‌సైట్లు మంచి సేవ‌ల‌ను అందిస్తున్నాయో మీకు మీరే తెలుసుకోవాలి.

* ఆ ఈ-కామ‌ర్స్ లేదా షాపింగ్ వెబ్‌సైట్ల‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉండాలి.

* వ‌స్తువు కొనేందుకు ఒక్కో వెబ్‌సైట్ ఒక్కో ర‌క‌మైన స‌దుపాయాన్ని ఇస్తుంది.

* వ‌స్తువు కొన్న త‌ర్వాత డ‌బ్బు చెల్లింపు మార్గాల‌కు వివిధ ఆప్ష‌న్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి.

  • ఈఎమ్ఐ(నెల‌వారీ వాయిదాలు)
  • క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు
  • నెట్ బ్యాంకింగ్‌
  • క్యాష్ ఆన్ డెలివ‌రీ - (వ‌స్తువు ఇంటికొచ్చిన త‌ర్వాత డ‌బ్బు చెల్లించ‌డం)
8. ఈ-కామ‌ర్స్‌లో దేశంలో ప్ర‌సిద్ది పొందిన కొన్ని సంస్థ‌లు-వాటి వెబ్‌సైట్లు

8. ఈ-కామ‌ర్స్‌లో దేశంలో ప్ర‌సిద్ది పొందిన కొన్ని సంస్థ‌లు-వాటి వెబ్‌సైట్లు

అమెజాన్‌-www.Amazon.com

ఫ్లిప్‌కార్ట్‌- www.Flipkart.com

స్నాప్‌డీల్-www.Snapdeal.com

పేటీఎమ్‌ -www.Paytm.com

ఈబే- www.Ebay.in

జ‌బాంగ్‌- www.Jabong.com

మైంత్రా- www.Myntra.com

షాప్‌క్లూస్‌- www.Shopclues.com

పెప్ప‌ర్‌ఫ్రై.కామ్‌- www.Pepperfry.com

హోంషాప్‌18 - www.Homeshop18.com

9. కూప‌న్ కోడ్‌లు దొరికే కొన్ని వెబ్‌సైట్లు

9. కూప‌న్ కోడ్‌లు దొరికే కొన్ని వెబ్‌సైట్లు

1. Kooponwala 2. Coupon Codes for India 3. Groupon India 4. Retail Me Not

5. CupoNation 6. 27 Coupons 7. Coupon Hero 8. Coupon Dunia 9. Price Burp

10. Coupon Raja 11. Coupon Codes India 12. Desi Dime 13. Coupon Album

14. Coupon Centre 15. Coupon Codes 4 U 16. Coupon Codes Bazaar 17. Coupon Codes N Offers 18. Coupon Low 19. Coupon Mamu 20. Coupon Mania 21. Coupon Myntra

22. Coupon Plaza 23. Coupon Refund 24. Coupon Zoot 25. Coupons N Offers

26. Deals Pick 27. India Coupons 28. My Smart Price 29. I Coupon Codes India

30. Just Pay Less 31. Shoppal 32. Couponz Guru 33. Coupon Rani 34. Coupon Daddy

35. FlipIt 36. EverySaving 37. Compare Raja 38. 33Coupons 39. వ‌న్ఇండియాకూప‌న్స్

40. grabon

10. ఆన్‌లైన్ షాపింగ్ జాగ్ర‌త్త‌లు

10. ఆన్‌లైన్ షాపింగ్ జాగ్ర‌త్త‌లు

ఆఫ‌ర్ల కోసం మీ మెయిల్‌కు వ‌చ్చే అన‌వ‌స‌ర‌మైన వెబ్‌సైట్ల లింక్‌ల‌పై క్లిక్ చేయ‌వ‌ద్దు.

సాధ్య‌మైనంత వ‌ర‌కూ మీ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను న‌మోదు చేయ‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నించండి.

మొబైల్‌కు వ‌చ్చే సెక్యూరిటీ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించండి.

ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తానికి సంబంధించిన లావాదేవీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోండి

వ‌స్తువు డెలివ‌రీకి సంబంధించి క‌చ్చిత‌మైన చిరునామా ఇవ్వండి

మీరు వ‌స్తువు కొన్న‌ప్ప‌టి నుంచి డెలివరీ వ‌ర‌కూ ఫాలో అప్ చేయండి.

వ‌స్తువు న‌చ్చ‌క‌పోయినా, డ్యామేజీ అయినా, గ‌డువు లోపు వెన‌క్కు పంపండి

Read more about: online shopping, ecommerce
English summary

with these coupon code websites you can save in Online shopping

Nowadays Indian youth are crazy about Online shopping. when in traditional shopping there is a scope for bargain here is the different case. you have to be very smart in e-commerce websites. Here we are giving tips to save money for online shopping through coupon codes
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns