For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిపాజిట్లు రూ.2 ల‌క్ష‌లపైన‌ చేసిన వారు ఇది చ‌దవాల్సిందే...

|

నోట్ల ర‌ద్దు త‌ర్వాత చాలా బ్యాంకు ఖాతాల్లో అనుమాన‌స్ప‌ద లావాదేవీలు జ‌రిగాయి. కొన్ని బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో న‌గ‌దు జమ చేశారు. అయితే రూ.2 ల‌క్ష‌ల లోపు న‌గ‌దు జమ చేస్తే పెద్ద స‌మ‌స్య‌మీ లేదు. వివిధ ఖాతాల్లో రూ.2 ల‌క్ష‌ల‌కు పైబ‌డి న‌గ‌దు లావాదేవీలు జ‌రిగి ఉంటే అంతే. అలా 5.5 లక్ష‌ల ఖాతాల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ క‌న్ను ప‌డింది. దీని గురించి మ‌రిన్ని వివ‌రాలు మీ కోసం...

 5.5 లక్ష‌ల ఖాతాల‌ను సిద్దం చేసిన ఐటీ శాఖ‌

5.5 లక్ష‌ల ఖాతాల‌ను సిద్దం చేసిన ఐటీ శాఖ‌

నోట్ల ర‌ద్దు త‌ర్వాత కొన్ని ల‌క్ష‌ల ఖాతాల విశ్లేష‌ణ ద్వారా అనుమాన‌స్ప‌ద లావాదేవీల‌ను ఐటీ అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో న‌గ‌దు జ‌మ అయిన, లావాదేవీ జ‌రిగిన ఖాతాదారుల‌కు నోటీసులు, మెయిల్స్ పంపారు. అయితే వీటికి అంద‌రూ స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం నోట్ల రద్దు త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆధారంగా చేసుకుని 5.5 ల‌క్ష‌ల అనుమాస్పద ఖాతాదారుల‌ను వివ‌ర‌ణ అడిగటానికి ఆదాయ‌పు ప‌న్ను శాఖ సిద్దంగా ఉంది. అంతే కాకుండా మ‌రో ల‌క్ష మందిని వారి బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉన్నాయో చెప్పాల‌ని అడిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 ఆప‌రేష‌న్ క్లీన్ మ‌నీలో భాగంగా

ఆప‌రేష‌న్ క్లీన్ మ‌నీలో భాగంగా

దేశంలో న‌ల్ల‌ధ‌నం ఏరివేత‌కు ఆప‌రేష‌న్ క్లీన్ మ‌నీ అనే పేరు పెట్టారు. ఆప‌రేష‌న్ క్లీన్ మ‌నీ రెండో ద‌శ‌లో భాగంగా ఆదాయంతో ఏ మాత్రం స‌రిపోల‌ని వారి బ్యాంకు ఖాతాల వివ‌రాలు, వారు నోట్ల ర‌ద్దు త‌ర్వాత చేసిన లావాదేవీల వివ‌రాల‌ను అడుగుతున్నారు. ఈ మ‌ధ్య జ‌రిపిన శోధ‌న‌లో బ‌య‌ట‌పడిన అనుమానస్ప‌ద లావాదేవీల‌పై క‌న్నేశారు. ఇందుకోసం గ‌త న‌వంబ‌రు నుంచి ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు.

 ఈమెయిల్‌, ఎస్ఎంఎస్‌

ఈమెయిల్‌, ఎస్ఎంఎస్‌

5.5 ల‌క్ష‌ల మందిలో ప్ర‌తి ఒక్క‌రికీ ఈమెయిల్స్‌, ఎస్ఎంఎస్‌లు పంపే కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టామ‌ని సీబీడీటీ(కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు)లో ఒక సీనియ‌ర్ అధికారి వెల్ల‌డించారు.

అధికారులు ఏం చేస్తున్నారు?

అధికారులు ఏం చేస్తున్నారు?

అధిక రిస్క్ అనిపించిన కొంద‌రి విష‌యంలోనూ, షెల్ కంపెనీలు, బినామీ ఆస్తుల‌ని అనుమానం క‌లిగిన వాటికి సంబంధించి ఆదాయపు ప‌న్ను శాఖ అధికారులు డేటా అన‌లిటిక్స్‌పై ఆధార‌ప‌డ్డారు. ఆప‌రేష‌న్ క్లీన్ మ‌నీలో భాగంగా కొంత మందిని బ్యాంకు ఖాతాల వివ‌రాలు తెల‌పాల్సిందిగా అడిగారు. అయితే దాదాపు ల‌క్ష మంది దీనికి సంబంధించి ఎటువంటి స్పంద‌న తెల‌ప‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ వారిని గుర్తించి, ప్రశ్నించే ప‌నిలో ప‌డ్డారు.

 డిపార్ట్‌మెంట్ అలా... ప్ర‌జ‌లు ఇలా...

డిపార్ట్‌మెంట్ అలా... ప్ర‌జ‌లు ఇలా...

ఐటీ శాఖ మొద‌టి ద‌శ‌లో దాదాపు 17.92 ల‌క్ష‌ల ఖాతాల‌ను గుర్తించి వారంద‌రికీ ఈమెయిల్‌, ఎస్ఎంఎస్‌ల ద్వారా వివ‌ర‌ణ‌లు అడిగింది. అందులో కేవ‌లం 9.72 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే వారి విన‌తుల‌ను ఆన్‌లైన్ ద్వారా స‌మ‌ర్పించారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆ డిపాజిట్ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని పాన్ క‌లిగిన వ్య‌క్తుల ఈ-ఫైలింగ్ ద్వారా ఐటీ శాఖ వెబ్‌సైట్లో అప్‌డేట్ చేశారు.

 మిగిలిన వారెంత మంది?

మిగిలిన వారెంత మంది?

ఇప్ప‌టికి ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఇంకా 6.5 ల‌క్ష‌ల మంది ఆదాయ‌పు ప‌న్ను శాఖ కార్యాల‌యాల‌కు వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండానే ఆన్‌లైన్‌లో త‌మ స్పంద‌న‌ల‌ను తెలియ‌జేయాల్సి ఉంది. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో రూ.2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ డిపాజిట్ చేసి ఉంటే ఈ ఏడాది ఐటీ రిట‌ర్నుల్లో చూపాల్సిందే.

 ఐటీ శాఖ ఇలా చేస్తుందని అంచ‌నా

ఐటీ శాఖ ఇలా చేస్తుందని అంచ‌నా

ఐటీ రిట‌ర్నుల్లో పెద్ద లావాదేవీల స‌మాచారాన్ని క‌చ్చితంగా ప‌న్ను చెల్లింపుదారులు ఇవ్వాల్సిందే. అలా వ‌చ్చిన స‌మాచారాన్ని ఐటీ శాఖ ఇది వ‌ర‌కే సేక‌రించిన స‌మాచారంతో స‌రిపోలుస్తుంది. న‌వంబ‌రు 8న అర్ధ‌రాత్రి నుంచి హ‌ఠాత్తుగా నోట్ల ర‌ద్దు చేసి దాదాపు డిసెంబ‌రు 30 వ‌ర‌కూ పాత నోట్ల డిపాజిట్ కోసం స‌మ‌యాన్ని ప్ర‌భుత్వం ఇచ్చిన విష‌యం తెలిసిందే.

 నోట్ల ర‌ద్దు త‌ర్వాత అన‌ధికారిక డ‌బ్బుకు సంబంధించి

నోట్ల ర‌ద్దు త‌ర్వాత అన‌ధికారిక డ‌బ్బుకు సంబంధించి

నోట్ల ర‌ద్దు త‌ర్వాత అన‌ధికారిక డ‌బ్బు ఎవ‌రైనా క‌లిగి ఉంటే ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న ద్వారా ప్ర‌క‌టించి కొంత ప్ర‌భుత్వానికి పన్ను క‌ట్టి, కొంత బ్యాంకు ఖాతాలో జ‌మ చేసి నిర్ణీత స‌మ‌యం త‌ర్వాత తీసుకునేలా వెసులుబాటు క‌ల్పించారు. దీనికి ప్ర‌భుత్వం ఆశించినంతంగా స్పంద‌న రాలేదు. దేశ‌వ్యాప్తంగా ఈ ప‌థకం కింద డిక్లేర్ అయిన సొమ్ము విలువ రూ.5 వేల కోట్లు మాత్ర‌మే.

English summary

you will be under IT dept lens if you did not disclose high value deposits after notes ban

Over 5.5 lakh people who deposited cash during the demonetisation drive are set to get a call from the income tax department while another one lakh people are on the radar of tax officials for not disclosing all their bank accounts.
Story first published: Friday, July 14, 2017, 10:21 [IST]
Company Search