For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార‌త‌దేశంలోని 30 మంది అప‌ర కుబేరులు

రిల‌య‌న్స్ గ్రూప్‌ను ప్ర‌పంచ ప‌టంలో ఉంచిన ధీరూబాయ్ ప్ర‌స్థానాన్ని ఇద్ద‌రు త‌న‌యులు అదే రీతిన కొన‌సాగిస్తున్నారు. ఇదే త‌ర‌హాలో ఎంతో మంది యువ‌కులు పెద్ద పెద్ద సంస్థ‌ల‌ను స్థాపించి త‌మ నిక‌ర ఆస్తుల విలువ

|

1990ల నుంచి మ‌న దేశంలో బ‌హుళ జాతి సంస్థ‌ల‌కు, పెద్ద ఎత్తున ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు తెర‌తీశారు. అప్ప‌టి నుంచి దేశంలో ధ‌న‌వంతుల సంఖ్య‌, వారి సంప‌ద చాలా వేగంగా పెరుగుతూ వ‌స్తోంది. ఫార్మా, ఐటీ రంగాల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న దేశం త‌న‌దైన ముద్ర వేస్తోంది. రిల‌య‌న్స్ గ్రూప్‌ను ప్ర‌పంచ ప‌టంలో ఉంచిన ధీరూబాయ్ ప్ర‌స్థానాన్ని ఇద్ద‌రు త‌న‌యులు అదే రీతిన కొన‌సాగిస్తున్నారు. ఇదే త‌ర‌హాలో ఎంతో మంది యువ‌కులు పెద్ద పెద్ద సంస్థ‌ల‌ను స్థాపించి త‌మ నిక‌ర ఆస్తుల విలువ‌ను బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి పెంచుకున్నారు. అలాంటి 30 వ్య‌క్తుల‌ జాబితాను ఇక్క‌డ చూడండి.

1. ముకేశ్ అంబానీ

1. ముకేశ్ అంబానీ

ఈయ‌న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ సీఎండీగా ప‌నిచేస్తున్నారు.

వ‌య‌సు: 57

సంప‌ద విలువ‌: 38 బిలియ‌న్ డాల‌ర్లు

ధీరుబాయ్ అంబానీ అందించిన వార‌సత్వాన్ని ఈయ‌న కొన‌సాగిస్తున్నారు.

 2. అజీమ్ ప్రేమ్‌జీ

2. అజీమ్ ప్రేమ్‌జీ

విప్రో వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ అజీమ్ ప్రేమ్‌జీ అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

వ‌య‌సు: 69

సంప‌ద విలువ‌: 19.1 బిలియ‌న్ డాల‌ర్లు

3.దిలీప్ సంఘ్వీ

3.దిలీప్ సంఘ్వీ

ప్ర‌పంచంలోనే పేరొందిన ఫార్మా కంపెనీ స‌న్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ

వ‌య‌సు: 59

సంప‌ద విలువ‌: 11.1

బిలియ‌న్ డాల‌ర్లు

 4. శివ్ నాడ‌ర్‌

4. శివ్ నాడ‌ర్‌

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ ఛైర్మ‌న్ శివ్ నాడ‌ర్‌.

వ‌య‌సు: 69

సంప‌ద విలువ‌: 14.8 బిలియ‌న్ డాల‌ర్లు

5. ల‌క్ష్మి మిట్ట‌ల్‌

5. ల‌క్ష్మి మిట్ట‌ల్‌

ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ సీఈవో, ఛైర్మ‌న్‌గా ల‌క్ష్మీ మిట్ట‌ల్ ప‌నిచేస్తున్నారు.

వ‌య‌సు: 64

సంప‌ద విలువ‌: 13.5 బిలియ‌న్ డాల‌ర్లు

6. కుమార్ మంగ‌ళం బిర్లా

6. కుమార్ మంగ‌ళం బిర్లా

ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్నారు.

వ‌య‌సు: 47

సంప‌ద విలువ‌: 9 బిలియ‌న్ డాల‌ర్లు

7. ఉద‌య్ కొట‌క్‌

7. ఉద‌య్ కొట‌క్‌

కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు ఛైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్నారు.

వ‌య‌సు: 55

సంప‌ద విలువ‌: 7.2 బిలియ‌న్ డాల‌ర్లు

8. గౌత‌మ్ అదానీ

8. గౌత‌మ్ అదానీ

అదానీ గ్రూప్ ఛైర్మ‌న్‌గా గౌత‌మ్ అదానీ ప‌నిచేస్తున్నారు.

వ‌య‌సు: 52

సంప‌ద విలువ‌: 6.6 బిలియ‌న్ డాల‌ర్లు

9. సునీల్ మిట్ట‌ల్

9. సునీల్ మిట్ట‌ల్

దేశ న‌లుమూల‌లా ఎయిర్‌టెల్ నెట్వ‌ర్క్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రేమో.

ఎయిర్‌టెల్ మాతృ సంస్థ భార‌తీ ఎంట‌ర్‌ప్రైజ‌స్ వ్య‌వ‌స్థాప‌క ఛైర్మ‌న్ సునీల్ మిట్ట‌ల్‌

వ‌య‌సు: 57

సంప‌ద విలువ‌: 6.6 బిలియ‌న్ డాల‌ర్లు

 10. సైర‌స్ పూనావాలా

10. సైర‌స్ పూనావాలా

పుణె కేంద్రంగా ప‌నిచేస్తున్న సీర‌మ్ ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్య‌వ‌స్థాప‌కులు సైర‌స్ పూనావాలా. ఇమ్యునోలాజిక‌ల్ డ్ర‌గ్స్, వాక్సిన్ తయారీలో ఈ సంస్థ నిమ‌గ్న‌మైంది.

వ‌య‌సు: 73

సంప‌ద విలువ‌: 6.6 బిలియ‌న్ డాల‌ర్లు

11. దేశ్ బంధు గుప్తా

11. దేశ్ బంధు గుప్తా

లుపిన్ వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ దేశ్ బంధ్ గుప్తా.

వ‌య‌సు: 77

సంప‌ద విలువ‌: 5.8 బిలియ‌న్ డాల‌ర్లు

12. సావిత్రి జిందాల్ మ‌రియు కుటుంబం

12. సావిత్రి జిందాల్ మ‌రియు కుటుంబం

జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ లిమిటెడ్ అనే సంస్థ‌కు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌ప‌ర్స‌న్ గాను సావిత్రి జిందాల్ ప‌నిచేస్తున్నారు. 2016లో దేశంలో అత్య‌ధిక ధ‌నిక మ‌హిళ‌గాను, 16వ అత్యంత ధ‌నిక వ్య‌క్తిగాను ఈమె పేరుగాంచారు.

వ‌య‌సు: 65

సంప‌ద విలువ‌:5.3 బిలియ‌న్ డాల‌ర్లు

13. మిక్కీ జ‌గ్తియాని

13. మిక్కీ జ‌గ్తియాని

మిక్కీ జ‌గ్తియాని అనే వ్య‌క్తి దుబాయ్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్నారు. ల్యాండ్ మార్క్ పేరుతో రిటైల్ వ్యాపారంలో అగ్ర‌ప‌థంలో కొన‌సాగుతున్నారు.

వయ‌సు: 63

సంప‌ద విలువ‌: 5.2 బిలియ‌న్ డాల‌ర్లు

14. ఆదీ గొద్రెజ్ మరియు కుటుంబం

14. ఆదీ గొద్రెజ్ మరియు కుటుంబం

గోద్రెజ్ గ్రూప్ అనేది 1897లో ముంబైలోని లాగ్‌బాగ్‌లో ఆర్దెషిర్ మిర‌యు ఫిరోజ్ షా గొద్రెజ్‌ల‌చే స్థాపించ‌బ‌డిన భార‌తీయ భాగ‌స్వామ్య సంస్థ‌. దాదాపు 120 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన ఈ సంస్థ‌కు ఆది గోద్రెజ్ ఛైర్మ‌న్‌.

ఆదీ గొద్రెజ్ వ‌య‌సు 75

సంప‌ద విలువ‌: 4.8 బిలియ‌న్ డాల‌ర్లు

15. జ‌మ్షెడ్ గోద్రెజ్ మ‌రియు కుటుంబం

15. జ‌మ్షెడ్ గోద్రెజ్ మ‌రియు కుటుంబం

గోద్రెజ్ గ్రూప్ కంపెనీల్లో ఒక‌టైన గోద్రెజ్ అండ్ బోయ్స్ ఛైర్మ‌న్‌గా జ‌మ్షెడ్ గోద్రెజ్ ఉన్నారు.

వ‌య‌సు: 66

సంప‌ద విలువ‌: 4.8 బిలియ‌న్ డాల‌ర్లు

16. శశి అండ్ ర‌వి రుయా

16. శశి అండ్ ర‌వి రుయా

ఎస్సార్ గ్రూప్‌ను రుయా కుటుంబం స్థాపించింది. ర‌వి రుయా వైస్ ఛైర్మ‌న్‌గా ఉండ‌గా; శ‌శి రుయా వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

శశి రుయా వ‌య‌సు: 77

ర‌వి రుయా వ‌య‌సు: 68

సంప‌ద విలువ‌: 4.5 బిలియ‌న్ డాల‌ర్లు

17. సుభాష్ చంద్ర‌

17. సుభాష్ చంద్ర‌

జీ ఎంట‌ర్‌టైన్ మెంట్ ఎంట‌ర్‌ప్రైజ‌స్ ఛైర్మ‌న్‌గా సుభాష్ చంద్ర ప‌నిచేస్తున్నారు.

వ‌య‌సు: 64

సంప‌ద విలువ‌: 4.2 బిలియ‌న్ డాల‌ర్లు

18. వేణు గోపాల్ బంగూర్‌

18. వేణు గోపాల్ బంగూర్‌

శ్రీ సిమెంట్ ఛైర్మ‌న్‌గా వేణు గోపాల్ బంగూర్ ప‌నిచేస్తున్నారు.

వ‌య‌సు: 83

సంప‌ద విలువ‌: 4.1 బిలియ‌న్ డాల‌ర్లు

19. అనిల్ అంబానీ

19. అనిల్ అంబానీ

రిల‌య‌న్స్ గ్రూప్ ఛైర్మ‌న్‌గా అనిల్ అంబానీ పేరు అంద‌రికీ సుప‌రిచితం.

వ‌య‌సు: 55

సంప‌ద విలువ‌: 4 బిలియ‌న్ డాల‌ర్లు

20. విక్ర‌మ్ లాల్

20. విక్ర‌మ్ లాల్

వాణిజ్య వాహ‌న తయారీ కంపెనీ ఐష‌ర్ మోటార్స్ సంస్థ‌కు విక్ర‌మ్ లాల్ సీఈవో.

వ‌య‌సు: 75

సంప‌ద విలువ‌:3.9 బిలియ‌న్ డాల‌ర్లు

21. పంక‌జ్ ప‌టేల్‌

21. పంక‌జ్ ప‌టేల్‌

క్యాడిలా హెల్త్‌కేర్ సీఎండీగా పంక‌జ్ ప‌టేల్ ప‌నిచేస్తున్నారు.

వ‌య‌సు: 62

సంప‌ద విలువ‌: 3.9 బిలియ‌న్ డాల‌ర్లు

22. బ్ర‌జి్ మోహ‌న్ లాల్ ముంజ‌ల్‌

22. బ్ర‌జి్ మోహ‌న్ లాల్ ముంజ‌ల్‌

హీరో హోండా మోటార్స్ వ్య‌వ‌స్థాప‌క ఛైర్మ‌న్‌గా బ్రిజ్ మోహ‌న్ లాల్ ముంజ‌ల్ ప‌నిచేశారు.

వ‌య‌సు: 92(మ‌ర‌ణించారు)

సంప‌ద విలువ‌: 3.8 బిలియ‌న్ డాల‌ర్లు

23. మంగ‌ళ్ ప్ర‌భాత్ లోథా

23. మంగ‌ళ్ ప్ర‌భాత్ లోథా

లోథా గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కులు మంగ‌ళ్ ప్ర‌భాత్‌.

వ‌య‌సు : 59

సంప‌ద విలువ‌: 3.4 బిలియ‌న్ డాల‌ర్లు

24. కుశాల్ పాల్ సింగ్‌

24. కుశాల్ పాల్ సింగ్‌

డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మ‌న్, సీఈవో కుశాల్ పాల్ సింగ్‌

వ‌య‌సు: 83

సంప‌ద విలువ‌: 3.4 బిలియ‌న్ డాల‌ర్లు

25. సుధీర్, స‌మీర్ మెహ‌తా

25. సుధీర్, స‌మీర్ మెహ‌తా

స‌మీర్ మెహ‌తా టొరెంట్ ఫార్మా చైర్మ‌న్‌, సీఈవో. అహ్మ‌దాబాద్ కేంద్రంగా ఈ ఫార్మా కంపెనీ ప‌నిచేస్తోంది.

వ‌య‌సు: 58

సంప‌ద విలువ‌: 3.3 బిలియ‌న్ డాల‌ర్లు

 26. క‌లానిథి మార‌న్

26. క‌లానిథి మార‌న్

స‌న్ గ్రూప్ ఛైర్మ‌న్, ఎండీగా క‌లానిథి మార‌న్ అంద‌రికీ సుప‌రిచితులు. 2010లో స్పైస్ జెట్‌ను సొంతం చేసుకున్నారు. 2015

వ‌య‌సు: 53

సంప‌ద విలువ‌: 4.5 బిలియ‌న్ డాల‌ర్లు

27. బాబా క‌ల్యాణి

27. బాబా క‌ల్యాణి

భార‌త్ ఫోర్జ్ కంపెనీలో 1972లో బాబా క‌ల్యాణి చేరారు. ప్ర‌స్తుతం ఆ కంపెనీ ఛైర్మ‌న్‌, ఎండీగా కొన‌సాగుతున్నారు.

వ‌య‌సు:66

సంప‌ద విలువ‌: 2.6 బిలియ‌న్ డాల‌ర్లు

28. ర‌జ‌న్ ర‌హేజా

28. ర‌జ‌న్ ర‌హేజా

ముంబ‌యి కేంద్రంగా ఉన్న‌ ర‌హేజా గ్రూప్ చైర్మ‌న్గా ఉన్నారు.

వ‌య‌సు: 60

సంప‌ద విలువ‌: 2.6 బిలియ‌న్ డాల‌ర్లు

 29. రాహుల్ బ‌జాజ్

29. రాహుల్ బ‌జాజ్

బ‌జాజ్ గ్రూప్ ఛైర్మ‌న్‌గా రాహుల్ బ‌జాజ్ ప‌నిచేస్తున్నారు.

వ‌య‌సు: 76

సంప‌ద విలువ‌: 2.5 బిలియ‌న్ డాల‌ర్లు

30. ఎం.ఏ యూస‌ఫ్ అలీ

30. ఎం.ఏ యూస‌ఫ్ అలీ

వ‌య‌సు: 59

సంప‌ద విలువ‌: 2.5 బిలియ‌న్ డాల‌ర్లు

లులు గ్రూప్ అధినేత యూస‌ఫ్ అలీ. ఈ గ్రూప్ దిగుమతులు, ఎగుమ‌తులు, ట్రేడింగ్‌, షిప్పింగ్‌, ఐటీ, ట్రావెల్‌, టూరిజం, విద్యా రంగాల్లో వ్యాపార విస్త‌ర‌ణ‌ను క‌లిగి ఉంది.

Read more about: reliance richest india
English summary

భార‌త‌దేశంలోని 30 మంది అప‌ర కుబేరులు | 30 richest Indians worldwide 2017

Although the world economy is going through tough economic times, the number of Indians making it to the global rich list is increasing.As the year comes to an end, let us take a look at 30 richest Indians, listed by the msn.com in 2017
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X