For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భూరికార్డులు సైతం ఆధార్‌తో అనుసంధానం!

భూమి సొంతదారుల‌కు సంబంధించి 1950ల నుంచి ఉన్న అన్ని భూమి రికార్డుల‌ను ఆధార్‌తో అనుసంధానించేందుకు కేంద్రం ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అన్ని స్థిరాస్తుల‌కు సంబంధించిన ల్యాండ్ రికార్డుల‌ను డిజిట‌లీక‌ర‌

|

భూమి సొంతదారుల‌కు సంబంధించి 1950ల నుంచి ఉన్న అన్ని భూమి రికార్డుల‌ను ఆధార్‌తో అనుసంధానించేందుకు కేంద్రం ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అన్ని స్థిరాస్తుల‌కు సంబంధించిన ల్యాండ్ రికార్డుల‌ను డిజిట‌లీక‌ర‌ణ చేయాల్సిందిగా కేంద్రం అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోరింది. బినామీ లావాదేవీల‌(నిషేధ‌) స‌వ‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం ఆన్‌లైన్ భూరికార్డుల‌ను సొంత దారుల ఆధార్ నంబ‌ర్ల‌తో లింక్ చేసే దిశ‌గా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చించింది.

 స్థిరాస్తి రికార్డుల‌తో భూ సొంత దారుల ఆధార్‌కు లింక్‌

ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి జూన్ 15న అన్ని రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌ను ఆదేశిస్తూ ఒక లేఖ రాశారు. ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య అధికారులు, ఢిల్లీ లెఫ్ట‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌, నీతి ఆయోగ్ కార్య‌ద‌ర్శికి సైతం స‌మాచారం అందించారు. లేఖ‌లో 1950 నుంచి ఉన్న భూ రికార్డుల‌ను ఆన్‌లైన్‌లో ఎక్కించాల‌ని, అంతే కాకుండా ఆ స్థిరాస్తి సొంత దారుల ఆధార్ నంబ‌ర్ల‌ను స‌ద‌రు ఆస్తుల‌తో అనుసంధానించాల‌ని స్ప‌ష్టంగా కోరిన‌ట్లు తెలుస్తోంది.

Read more about: aadhar aadhaar land records uidai
English summary

భూరికార్డులు సైతం ఆధార్‌తో అనుసంధానం! | Link your land records with Aadhaar, else face action under Benami Act

The union government is mulling linking of all land records from 1950 with Aadhaar numbers of land owners. All states have been asked to complete digitalisation of land records from 1950 of all immovable property. The government is now considering action under the new Benami Transaction (Prohibitions) Amended Act against those who fail to link the digitalised land record with Aadhaar numbers of the owners
Story first published: Monday, June 19, 2017, 15:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X