For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైతుల‌కు స్వ‌ల్ప‌కాలిక రుణాల‌కు వ‌డ్డీ రాయితీ

రైతులు రూ.3 ల‌క్ష‌ల లోపు తీసుకునే స్వ‌ల్ప‌కాలిక రుణాల‌కు 7% వ‌డ్డీ రేటు కొన‌సాగనుంది. అదే గ‌డువుకు లోపు రుణాలు చెల్లించే వారికి 4% వ‌డ్డీకి రుణాలు అంద‌నున్నాయి. ఎందుకంటే 2017-18 సంవత్స‌రానికి కేంద్ర‌

|

రైతులు రూ.3 ల‌క్ష‌ల లోపు తీసుకునే స్వ‌ల్ప‌కాలిక రుణాల‌కు 7% వ‌డ్డీ రేటు కొన‌సాగనుంది. అదే గ‌డువుకు లోపు రుణాలు చెల్లించే వారికి 4% వ‌డ్డీకి రుణాలు అంద‌నున్నాయి. ఎందుకంటే 2017-18 సంవత్స‌రానికి కేంద్ర‌ ప్ర‌భుత్వం రైతు రుణాల‌పై స‌బ్సిడీ రేట్ల‌ను ప్ర‌క‌టించింది. 2017-18 సంవ‌త్స‌రానికి సంబంధించి వ‌డ్డీ రాయితీ ప‌థ‌కానికి కేంద్ర కేబినెట్ బుధ‌వారం ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేంద్రం ఈ ఏడాది రూ.20,339 కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వంలోని ఒక సీనియ‌ర్ అధికారి వెల్ల‌డించారు.

 రైతుల‌కు స్వ‌ల్ప‌కాలిక రుణాల‌కు 7% వ‌డ్డీ రేటే

స‌కాలంలో రుణం చెల్లించే రైతుల‌కు రూ.3 ల‌క్ష‌ల లోపు వాటిపై 4% వ‌డ్డీ అమ‌లు అవుతుంది. ప్ర‌స్తుతానికి రిజ‌ర్వ్ బ్యాంక్ సైతం స్వ‌ల్ప‌కాలిక రుణాల‌పై వ‌డ్డీ రాయితీల‌ను ఇవ్వాల్సిందిగా బ్యాంకుల‌ను కోరింది. ఒక ప‌క్క రైతులు దేశ‌వ్యాప్తంగా ప‌లు చోట్ల ఆందోళ‌న‌లు చేస్తున్న నేప‌థ్యంలో కేబినెట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో వైపు మ‌ధ్య‌ప్ర‌దేశ్ రైతు రుణాల‌ను మాఫీ చేసే విధంగా రైతులు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు. 2017-18 సంవ‌త్స‌రంలో రూ.10 ల‌క్ష‌ల కోట్ల‌ను వ్య‌వ‌సాయ రుణాలుగా ఇచ్చేందుకు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. 2016-17లో ఇది రూ.9 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది.

Read more about: farmers agriculture
English summary

రైతుల‌కు స్వ‌ల్ప‌కాలిక రుణాల‌కు వ‌డ్డీ రాయితీ | The Interest Subvention Scheme for 2017-18 has been approved in the Cabinet meeting

Farmers will continue to get short-term loan of up to Rs 3 lakh at a subsidised interest rate of 7 per cent, and prompt repayers will get it at 4 per cent as the government on Wednesday extended the subsidy to banks for 2017-18.
Story first published: Thursday, June 15, 2017, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X