భారీస్థాయిలో ఉద్యోగాల కోత ఉండదంటున్న నాస్కామ్
ఐటీ రంగంలో భారీ ఉద్యోగాల కోతలు ఉండవు అంటూనే, ఈ ఏడాది 1.5 లక్షల నియామకాలు జరుగుతాయని నాస్కామ్ వెల్లడించింది. అయితే టెక్కీలు తమను తాము కొత్త నైపుణ్యాల దిశగా మార్చుకోవాల్సి ఉంటుందని ఐటీ పరిశ
వివిధ నివేదికలు చెపుతున్నట్లుగా ఐటీ రంగంలో భారీ ఉద్యోగాల కోతలు ఉండవు అంటూనే, ఈ ఏడాది 1.5 లక్షల నియామకాలు జరుగుతాయని నాస్కామ్ వెల్లడించింది. అయితే టెక్కీలు తమను తాము కొత్త నైపుణ్యాల దిశగా మార్చుకోవాల్సి ఉంటుందని ఐటీ పరిశ్రమల సమాఖ్య సూచించింది. గత కొన్ని నెలల నుంచి విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు దాదాపు 50 వేల మందిని తొలగిస్తాయని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

"పెద్ద సంఖ్యలో ఉద్యోగుల కోత ఉంటుందన్న దాన్ని మేం అంగీకరించం. 2017 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 1.7 లక్షల మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నాం. కేవలం నాలుగో త్రైమాసికంలోనే ఐదు పెద్ద కంపెనీలు 50 వేల మందిని నియమించుకున్నాయి." అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ విలేకరులకు వెల్లడించారు. ఆటోమేషన్, రోబోటిక్స్, అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతలకు అనుగుణంగా ఉద్యోగులంతా తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైతే తమను తాము నైపుణ్యాలను మెరుగుపరుచుకోలేని స్థితిలో ఉన్నారో పరిశ్రమకు వారి అవసరం ఉండకపోవచ్చన్నారు. ఇంకా స్టార్టప్‌లు, ఈ-కామర్స్, డిజిటల్ ఇండియా, డిజిటల్ చెల్లింపులు వంటి వాటిల్లో నూతన అవకాశాలకు తావుందన్నారు. 2025 నాటి కల్లా 30 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని చెప్పారు. అయితే ఉద్యోగుల తొలగింపు గురించి ఇంత పెద్ద ఎత్తున భయాందోళనలు చెలరేగుతున్నాయో వివరించడంలో నాస్కామ్ స్పష్టత కనబరచలేదు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications