For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ ఖాతాకు ఆధార్ నంబ‌రును లింక్ చేయడం ఎలా?

బ్యాంకు ఖాతాల‌తో ఆధార్‌ను అనుసంధానించేందుకు చాలా మందికి బ్యాంకు శాఖ‌కు వెళ్లేందుకు స‌మ‌యం ఉండ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను లింక్ చేసేందుకు ఉన్న వివిధ ప‌ద్ద‌తుల‌ను తెలుసుకుందాం

|

భారతదేశం లో ప్రతీ పౌరుడికీ ఆధార్ నెంబర్ ను జారీ చేయడం మరియు వారు ఎప్పుడయినా ఎక్కడైనా ఒక పోర్టబుల్ గుర్తింపుగా దృవీకరించబడేలా నివాసితులకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య‌ను జారీ చేయండం యూఐడీఏఐ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. యూఐడీఏఐ భార‌త ప్ర‌భుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ‌. ఆధార్ కార్డును చాలా సంస్థ‌లు ఈ మ‌ధ్య ఒక గుర్తింపు ప‌త్రంగా అంగీక‌రిస్తున్నాయి. దాదాపు అన్ని ఆర్థిక సంస్థ‌లు ఆధార్ సాయంతో మీ ఖాతాల‌ను సులువుగా తెరిచేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. అయితే బ్యాంకు ఖాతాల‌తో ఆధార్‌ను అనుసంధానించేందుకు చాలా మందికి బ్యాంకు శాఖ‌కు వెళ్లేందుకు స‌మ‌యం ఉండ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను లింక్ చేసేందుకు ఉన్న వివిధ ప‌ద్ద‌తుల‌ను తెలుసుకుందాం.

1. ఎస్బీఐ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా:

1. ఎస్బీఐ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా:

మొద‌ట www.onlinesbi.comలో లాగిన్ అవ్వాలి.

ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయిన త‌ర్వాత లింక్ యువ‌ర్ ఆధార్‌(Link your Aadhaar number) ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ఇది మై అకౌంట్స్‌లో ఉంటుంది.

దీని త‌ర్వాత వేరే స్క్రీన్‌కు రీడైరెక్ట్ అవుతుంది.

ఇప్పుడు అకౌంట్ నంబ‌రును ఎంచుకుని, ఆధార్‌నంబ‌రు ఎంట‌ర్ చేయండి.

స‌బ్‌మిట్‌ను నొక్కిన త‌ర్వాత మొబైల్ నంబ‌రులో చివ‌రి రెండంకెలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.

ఆధార్ అనుసంధానించిన ప్ర‌క్రియ గురించిన స‌మాచారం మీ మొబైల్ నంబ‌రుకు వ‌స్తుంది.

2. ఏటీఎమ్ ద్వారా ఆధార్ అనుసంధానం

2. ఏటీఎమ్ ద్వారా ఆధార్ అనుసంధానం

ఖాతాదార్లు ఎస్‌బీఐ ఏటీఎమ్‌లో కూడా ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానించ‌వ‌చ్చు.

అ. ఏటీఎమ్‌ను స్వైప్ చేసి పిన్ ఎంట‌ర్ చేయండి.

ఆ. మెనూలో స‌ర్వీస్‌-రిజిస్ట్రేష‌న్స్‌ను ఎంచుకోండి.

ఇ. ఇప్పుడు ఆధార్ రిజిస్ట్రేష‌న్ ఆప్ష‌న్ సెల‌క్ట్ చేయండి.

ఈ. అకౌంట్ రకాన్ని (పొదుపు లేదా క‌రెంట్) ఎంపిక చేసుకోవాలి.

ఉ. దీని త‌ర్వాత ఆధార్ నంబ‌రును ఎంట‌ర్ చేయాలి.

ఊ. స్క్రీన్ పైన ఒక మెసేజ్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.

3. ఆధార్ లింకింగ్ : స‌ంక్షిప్త సందేశం ద్వారా

3. ఆధార్ లింకింగ్ : స‌ంక్షిప్త సందేశం ద్వారా

  • ఈ ర‌క‌మైన సేవ‌ను పొందేందుకు మొబైల్ నంబ‌రు బ్యాంకు వ‌ద్ద రిజిస్ట‌రై ఉండాలి.

  • UID(space)Aadhaar number(space)Account number ఈ విధంగా మెసేజ్ టైప్ చేసి 567676 నంబ‌రుకు మెసేజ్ పంపాలి.

  • ఒక‌వేళ మొబైల్ నంబ‌రు బ్యాంకు వ‌ద్ద రిజిస్ట‌ర్ కాక‌పోయినా, ఇదివ‌ర‌కూ ఆధార్ లింక్ అయి ఉన్నా మీ ఎస్ఎంఎస్‌కు రిప్లై వ‌స్తుంది.

  • ఒక వేళ ఆధార్ లింకేజీ కాకుండా ఉండి ఉంటే బ్యాంకు నుంచి ఆధార్ లింకేజీ మెసేజీ వ‌స్తుంది.

  • బ్యాంకు యూఐడీఏఐను సంప్ర‌దించి ఆధార్ సంఖ్య‌ను వెరిఫై చేస్తుంది. ఒక‌వేళ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ విఫ‌ల‌మైతే ఖాతాదారుడికి బ్యాంకు శాఖ‌ను సంప్ర‌దించాల్సిందిగా ఎస్ఎంఎస్ వ‌స్తుంది.
  • అప్పుడు ఆధార్ నంబ‌రును తీసుకుని ఎస్‌బీఐ బ్యాంకు శాఖ‌కు వెళ్లాల్సిందే.
4. బ్రాంచీకి వెళ్లి ఆధార్‌ను అప్డేట్ చేయ‌డం

4. బ్రాంచీకి వెళ్లి ఆధార్‌ను అప్డేట్ చేయ‌డం

  • ఆధార్ కాపీతో లేదా ఈ-ఆధార్ తీసుకుని బ్యాంకు శాఖ‌కు వెళ్లాలి.

  • ఆధార్ సంఖ్య‌ను అనుసంధానించాల్సిందిగా బ్యాంకు మేనేజ‌ర్‌ను సంబోధిస్తూ ఒక లేఖ‌, దాంతో పాటు ఆధార్ న‌క‌లును బ్యాంకు వ‌ద్ద స‌మ‌ర్పించాలి.

  • అవ‌స‌ర‌మైన వెరిఫికేష‌న్ పూర్త‌యిన త‌ర్వాత బ్రాంచీ ఈ ప్ర‌క్రియ‌ను ముగిస్తుంది.

  • ఆధార్ లింకేజీ స్థితిగ‌తికి సంబంధించి మీరు బ్యాంకు నుంచి మెసేజ్ పొందుతారు.

Read more about: aadhaar bank account uidai
English summary

ఎస్‌బీఐ ఖాతాకు ఆధార్ నంబ‌రును లింక్ చేయడం ఎలా? | How Aadhaar can be linked to your existing sbi account

Login to the internet banking service of your bank. ...Find the 'Update Aadhaar Card Details' option or 'Aadhaar Card Seeding' option and click on it. ...Enter details about your Aadhaar card.Click on 'Submit'.
Story first published: Tuesday, May 16, 2017, 16:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X