i
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి వేడుక‌కు బీమానా ? దీంతో ప్ర‌యోజ‌న‌మేమిటో...

|

భార‌త్‌లో పెళ్లంటే నూరేళ్ల పంట‌. వివాహాన్ని ఒక పండుగ‌లా భావిస్తారు బంధుమిత్రులంతా. ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును వివాహం అనే వేడుక‌లో చాలా తేలికగా ఖ‌ర్చుపెడ‌తారు. ఎన్నో ప్ర‌ణాళిక‌లు వేసుకున్న‌ప్ప‌టికీ ఒక్కోసారి అనుకోని కార‌ణాల వ‌ల్ల పెళ్లి ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఒక వేళ ఇలా పెళ్లి క్యాన్సిల్ అయితే అప్ప‌టికే పెట్టిన ఖ‌ర్చంతా ఎవ‌రు చెల్లిస్తారు.? ఎవ‌రో ఎందుకు చెల్లిస్తారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబాలు చేసిన ఖ‌ర్చంతా వృథానే. అందుకే ఈ మ‌ధ్య ధ‌న‌వంతుల ఇళ్ల‌ల్లో వివాహ వేడుక‌కు సైతం ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి సైతం స‌రిప‌డేలా బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాల‌సీల్లో మార్పులను చేస్తున్నాయి. అలాంటి బీమా పాల‌సీ గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

ఏయే సంద‌ర్భాల్లో బీమా వ‌ర్తిస్తుంది?

ఏయే సంద‌ర్భాల్లో బీమా వ‌ర్తిస్తుంది?

పెళ్లి బీమాను చాలా రకాల కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇరువైపుల కుటుంబాల్లో ఎవరైనా అకాల మరణం చెందితే పెళ్లి ఆగిపోతుంది. లేదా ఏదైనా అనుకోనిది జరిగినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయాల్లో పెళ్లి కార్డుల ప్రింటింగ్ కు అయిన ఖర్చు, వాటి పంపిణీ వ్యయం, కేటరర్లు, వెండర్లు, ఆభరణాల కొనుగోలు, వేదిక అలంకరణకు అయిన వ్యయంలో కొంత మేర పరిహారంగా బీమా కంపెనీ అందిస్తుంది. ఈ పాలసీలో ఏవేవీ కవర్ అవుతాయన్నది కంపెనీలను బట్టి మారిపోతుంటుంది. అందుకే వివిధ కంపెనీల పాలసీ వివరాలను తెలుసుకున్న తర్వాత తమ అవసరాలకు సరిపోలే పాలసీని తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పెళ్లి వాయిదా పడినా గానీ నష్టం ఎక్కువే ఉండవచ్చు. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీకి కూడా నష్టం ఎదురవుతుంది. వీటికి కవరేజీ ఉంటుందా అన్నది తెలుసుకోవాలి.

 ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణిస్తే

ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణిస్తే

ప్రమాదవశాత్తూ ఎదురయ్యే మరణానికి కూడా పరిహారం పెళ్లి బీమాలో ఉంటుంది. మ‌నం త‌ర‌చూ వినే వాటిలో ఎవ‌రైన ద‌గ్గ‌ర బంధువులు చ‌నిపోవ‌డం వ‌ల్ల పెళ్లి వాయిదా ప‌డింది అనేది ఒక‌టి. రక్తసంబంధీకులకూ ఈ విధమైన రక్షణ ఉంటుంది. అయితే, నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదాలకు కంపెనీలు పరిహారం ఇవ్వవని తెలుసుకోవాలి.

పెళ్లి వేడుక‌లో దొంగ‌త‌నం, దోపిడీ జ‌రిగితే

పెళ్లి వేడుక‌లో దొంగ‌త‌నం, దోపిడీ జ‌రిగితే

పెళ్లి అన్నాక సంద‌డి సంద‌డిగా ఉంటుంది. వారి చుట్టాలు, వీరి చుట్టాలు, దూరపు బంధువులు అంతా వ‌స్తారు. దీంతో అంతా హ‌డావిడిగా ఉంటుంది. ఒక్కోసారి దొంగతనం, దోపిడీకి పెళ్లి వేడుకల్లో అవకాశం లేకపోలేదు. పెళ్లి సమయంలో విలువైన ఆభరణాలను ధ‌రించాల‌ని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ముఖ్యంగా స్త్రీలు అయితే ఎప్ప‌టి నుంచో మూల‌న పెట్టిన‌ నగలన్నింటినీ బయటకు తీసి ధరించేది ఇలాంటి అందమైన వేడుకల్లోనే. చోరీలకూ అవకాశం ఉంటుంది. కనుక పెళ్లి బీమా ఇలాంటి వాటికీ రక్షణనిస్తుంది.

వీటికి పరిహారం రాదు...

వీటికి పరిహారం రాదు...

అగ్ని ప్రమాదం జరిగితే వాటిల్లే నష్టానికి పరిహారాన్ని పెళ్లి బీమా పాలసీల కింద కంపెనీలు అందిస్తాయి. కానీ, విద్యుత్ పరికరాలను నిర్లక్ష్యంగా నిర్వహించడం వల్ల ప్రమాదం జరిగి నష్టం ఎదురైతే కంపెనీలు పరిహారం ఇవ్వవు. బంద్ లు, అల్లర్ల కారణంగా పెళ్లిని రద్దు చేసుకుంటే కొన్ని బీమా కంపెనీలు తమ పాలసీల్లో భాగంగా పరిహారం ఇవ్వడం లేదు. ఎవ‌రికైతే పెళ్లి జ‌ర‌గాలో వారిలో ఎవ‌రైనా కిడ్నాప్‌కు గురై పెళ్లి ర‌ద్దైనా పాల‌సీ వ‌ర్తించ‌దు.

క్లెయిమ్ విధానం...

క్లెయిమ్ విధానం...

దేశంలో వీటికీ కూడా పాల‌సీలు ఉంటాయా?

Read more about: marriage wedding
English summary

Wedding Insurance: Interesting Things To Know in India

Many Indian parents save and invest all their hard earned money to have a lavish wedding for their children. But, what happens when the wedding is cancelled or postponed due to some reason? Who will pay for the amount spent? Yes, no one other then the bride, bridegroom or their parents are responsible to pay for the same.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X