For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెపో రేటును య‌థాత‌థంగా ఉంచిన రిజ‌ర్వ్ బ్యాంక్‌

పాల‌సీ రేట్ల స‌మీక్ష‌లో ఆర్‌బీఐ ఎటువంటి ఆశ్చ‌ర్యాల‌కు తావివ్వ‌లేదు. అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటు 6.25 శాత

|

పాల‌సీ రేట్ల స‌మీక్ష‌లో ఆర్‌బీఐ ఎటువంటి ఆశ్చ‌ర్యాల‌కు తావివ్వ‌లేదు. అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటు 6.25 శాతం వద్దనే ఉంచుతున్నట్టు ప్రకటించింది. రివర్స్ రెపో రేటు మాత్రం 25 బోనస్ పాయింట్లు పెంచడంతో 6 శాతానికి పెరిగింది.

రేట్ల కోత‌పై ఆర్బీఐ

6 మందితో కూడిన ద్ర‌వ్య పాల‌సీ క‌మిటీ రెపో రేటును మార్చ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంది. రివ‌ర్స్ రెపోను మాత్రం 0.25 శాతం స్వ‌ల్పంగా పెంచారు. తద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీకి చెక్‌ పెట్టాలని ఆర్‌బీఐ భావిస్తోంది. బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద డిపాజిట్‌ చేసే నిధులకు లభించే వడ్డీ రేటు రివర్స్‌ రెపో 0.25 శాతం పెంపుతో ఇది 6 శాతంగా ఉండనుంది.
ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి నిర్ణయాలను ప్రకటించింది. దీంతో ద్వైమాసిక పాలసీ సమీక్షలో భాగంగా ఎంఎస్‌ఎఫ్‌ రేటును 6.50 శాతానికి తగ్గించింది.

English summary

రెపో రేటును య‌థాత‌థంగా ఉంచిన రిజ‌ర్వ్ బ్యాంక్‌ | RBI increased reverse repo rate and lowered MSF in policy review

There were no surprises in the first policy announcement of the new fiscal.The Reserve Bank of India maintained status quo and retained the repo rate at 6.25 per cent in the first policy announcement of the new fiscal. The decision by the 6-member monetary policy committee was unanimous.
Story first published: Thursday, April 6, 2017, 16:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X