For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతోష‌మైన దేశాల్లో ఇండియా 122

భార‌త్ గ‌తేడాది కంటే 4 స్థానాలు దిగ‌జారి 122వ ర్యాంకు సాధించింది. ఈ విష‌యంలో మ‌న పొరుగు దేశాలైన చైనా,పాక్‌,నేపాల్ కంటే మ‌నం వెన‌కుండ‌టం విశేషం. ఐక్య‌రాజ్య‌స‌మితి ఈ ఏడాదికి గాను వ‌ర‌ల్డ్ హ్యాపినెస్ రిప

|

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంతోషంగా జీవిస్తున్న దేశాల్లో భార‌త్ గ‌తేడాది కంటే 4 స్థానాలు దిగ‌జారి 122వ ర్యాంకు సాధించింది. ఈ విష‌యంలో మ‌న పొరుగు దేశాలైన చైనా,పాక్‌,నేపాల్ కంటే మ‌నం వెన‌కుండ‌టం విశేషం. ఐక్య‌రాజ్య‌స‌మితి ఈ ఏడాదికి గాను వ‌ర‌ల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2017 పేరిట రూపొందించిన నివేదిక‌లో నార్వే అత్యంత సంతోష‌క‌ర‌మైన దేశంగా ఉంది.

Norway most happiest country in the world

గ‌త నాలుగేళ్ల‌లో డెన్మార్క్ మూడుసార్లు మొద‌టిస్థానంలో నిల‌వ‌గా దాన్ని తోసిరాజ‌ని ఈసారి నార్వే మూడు స్థానాలు ఎగ‌బాకి ప్ర‌థ‌మ స్థానాన్ని సంపాదించింది. 2013-15 నివేదిక‌లో 118 ర్యాంకులో ఉన్న మ‌న దేశం ఈసారి 4 స్థానాలు దిగ‌జారి 122కు చేరింది. ఈ నివేదిక కోసం జీడీపీ ప‌ర్ క్యాపిటా, సామాజిక మ‌ద్ద‌తు, ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న స్థితిగ‌తుల అంచ‌నా, జీవితంలో చేసే ప‌నికి అవ‌కాశాల ఎంపిక‌కు స్వేచ్చ‌, అవినీతి మొద‌లైన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. ఈ మొత్తం రిపోర్టులో చైనా(79), పాకిస్తాన్‌(80),బంగ్లాదేశ్‌(110), ఇరాక్‌(117), శ్రీ‌లంక‌(120) వంటి దేశాలు మ‌న కంటే ముందు నిలిచాయి. మార్చి 20న అంత‌ర్జాతీయ సంతోష దినం సంద‌ర్భంగా ఈ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

Read more about: india un
English summary

సంతోష‌మైన దేశాల్లో ఇండియా 122 | India ranks a low 122 among world's happiest countries

India ranked a lowly 122 on a list of the world's happiest countries, dropping four slots from last year and coming behind China, Pakistan and Nepal. Norway ranks as the happiest country in the world, according to The World Happiness Report 2017, which ranks 155 countries by their happiness levels. Norway jumped three spots from last year, displacing Denmark, which had held the top spot for three out of the past four years.
Story first published: Tuesday, March 21, 2017, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X