For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్చి8న ప‌బ్లిక్ ఇష్యూకు డీమార్ట్

ఇండియాలో ఎప్పుడూ లాభాల్లో ఉండే రిటైల్ గొలుసు దుకాణాల నిర్వ‌హ‌ణా దిగ్గ‌జం మార్కెట్‌కు శుభ‌వార్తనందించింది. రాధాకిషన్‌ దమానీ ప్రమోటర్‌గా క‌లిగిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ , సూపర్‌ మార్కెట్‌ లీడర్‌ డీమార్ట

|

ఇండియాలో ఎప్పుడూ లాభాల్లో ఉండే రిటైల్ గొలుసు దుకాణాల నిర్వ‌హ‌ణా దిగ్గ‌జం మార్కెట్‌కు శుభ‌వార్తనందించింది. రాధాకిషన్‌ దమానీ ప్రమోటర్‌గా క‌లిగిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ , సూపర్‌ మార్కెట్‌ లీడర్‌ డీమార్ట్‌ త్వరలో ఐపీవోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ డెవ‌ల‌ప్‌మెంట్ గురించి ముఖ్య విష‌యాల‌ను తెలుసుకుందాం.

 విక్ర‌యానికి 6 కోట్ల‌కు పైగా షేర్లు

విక్ర‌యానికి 6 కోట్ల‌కు పైగా షేర్లు

దేశవ్యాప్తంగా రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తున్న డీమార్ట్‌ మార్చి 8న పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. మార్చి 10న ముగియనున్న ఇష్యూకి రూ. 290-299 ప్రైస్‌ బ్రాండ్‌గా ప్రకటించింది. ఈ ఐపీవో ద్వారా రూ. 1,810-1866 కోట్లను సమీకరించాలని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 6.23 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది.

 ఎవ‌రికి ఎన్ని షేర్లు

ఎవ‌రికి ఎన్ని షేర్లు

యాంకర్‌ ఇన్వెస్టర్లకు 1.87 కోట్ల షేర్లను విక్రయించనుంది. మరో 1.24 కోట్ల షేర్లను అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్‌), 93.59 లక్షల షేర్లను సంపన్న వర్గాలకు రిజర్వ్‌ చేసింది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటాలో 2.18 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. ఇష్యూ తరువాత డీమార్ట్‌ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. 2016 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ సంస్థ రూ.300 కోట్ల మేర లాభాల‌ను రాబ‌ట్ట‌డంతో పాటు, రూ. 8600 కోట్ల రెవెన్యూను క‌లిగి ఉంది.

మ‌హీంద్రా క్యాపిట‌ల్ ఆధ్వ‌ర్యంలో

మ‌హీంద్రా క్యాపిట‌ల్ ఆధ్వ‌ర్యంలో

ఈ ఇష్యూకు గ్లోబల్‌ కోఆర్డి నేటర్‌గా, లీడ్ మేనేజర్ కొటక్ మహీంద్రా క్యాపిటల్ వ్యవహరిస్తోంది. ఇతర లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ క్యాపిటల్, ఎడెల్‌వీస్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇంగా కాపిటల్, జెఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ క్యాపిటల్‌ అడ్వైజర్‌, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌ వ్యవహరిస్తున్నాయి.

డీమార్ట్ గురించి

డీమార్ట్ గురించి

డీమార్ట్‌కు 45 న‌గ‌రాల్లో 120 రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో బ‌ల‌మైన విస్త‌ర‌ణ ఉంది. నాలుగేళ్ల నుంచి ఆదాయ ప‌రంగా మంచి లాభాల్లో న‌డుస్తూ ఉంది. ప్ర‌స్తుతం ఇది తెలుగు రాష్ట్రాల్లోనూ వేగంగా విస్త‌రిస్తున్న‌ది. మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల్లో 6 ప్యాకేజింగ్ కేంద్రాలను డీమార్ట్ నిర్వ‌హిస్తోంది.

Read more about: dmart డీమార్ట్
English summary

మార్చి8న ప‌బ్లిక్ ఇష్యూకు డీమార్ట్ | Dmart is ipo is opening on march 8

Incorporated in 2002, Avenue Supermarts Limited is Mumbai based supermarket chain D-Mart. Company is among the largest and the most profitable F&G retailer in India. Commpany offer a wide range of products with a focus on the Foods, Non-Foods (FMCG) and General Merchandise & Apparel product categories. present D-mart has 120 stores in 45 cities
Story first published: Wednesday, March 1, 2017, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X