For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెలినార్(యునినార్‌)ను కొనేందుకు ఎయిర్‌టెల్ సిద్ద‌మా?

దేశ‌ టెలికాం రంగంలో మరో విలీనానికి రంగం సిద్ధమవుతోంది. దేశ టాప్ మొబైల్ నెట్వ‌ర్క్‌ సర్వీసు ప్రొవైడర్‌ ఎయిర్‌టెల్‌, యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క

|

దేశ‌ టెలికాం రంగంలో మరో విలీనానికి రంగం సిద్ధమవుతోంది. దేశ టాప్ మొబైల్ నెట్వ‌ర్క్‌ సర్వీసు ప్రొవైడర్‌ ఎయిర్‌టెల్‌, యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలులో టెలినార్‌ ఇండియా ఆస్తుల బదలాయింపు అంశం కూడా ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. అయితే దీనికి సంబంధించిన ఆర్థిక వివ‌రాలేవీ వెల్ల‌డి అవ్వ‌లేదు. ఇటీవలే ఐడియా - వొడాఫోన్‌ వీలీనం జరగనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కొనుగోలు అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది.

Airtel To Buy Telenor India As Norwegian Telecom Operator Exits

టెలినార్ ఇండియాకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, యూపీ(ఈస్ట్‌), యూపీ(వెస్ట్‌), అస్సాం స‌ర్కిళ్ల‌లో నెట్‌వ‌ర్క్ విస్త‌ర‌ణ ఉంది.ఈ స‌ర్కిళ్ల‌లో టెలినార్‌ను చేజిక్కుంచుకుంటే 1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్ర‌మ్‌లో ఎయిర్‌టెల్ సంస్థ‌కు కొత్త‌గా 43.4 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం అద‌నంగా స‌మ‌కూర‌గ‌ల‌దు. ఆయా వార్త‌ల‌తో టెలికాం రంగ షేర్ల‌కు డిమాండ్ ఏర్ప‌డింది. ఎయిర్‌టెల్ దాదాపు 8 శాతం పైకి ఎగ‌సింది. ట్రేడింగ్ ముగిసే స‌రికి కేవ‌లం 1.5% లాభంతో సరిపెట్టుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5 లాభ‌ప‌డి 366 వ‌ద్ద ముగిసింది.

Read more about: telecom idea airtel uninor
English summary

టెలినార్(యునినార్‌)ను కొనేందుకు ఎయిర్‌టెల్ సిద్ద‌మా? | Airtel To Buy Telenor India As Norwegian Telecom Operator Exits

Bharti Airtel said that the acquisition will boost its spectrum footprint with the addition of 43.4 MHz spectrum in the 1800 MHz band. Nitin Soni, director for Asian Corporates at Fitch Ratings, said the Telenor deal will boost Airtel’s 4G footprint, which is very much essential to compete with Reliance Jio. The deal is subject to clearance from regulatory agencies.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X