For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశ్చ‌ర్యం! యాపిల్‌ను వెన‌క్కినెట్టిన గూగుల్‌. ఎందులో?

ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా వ‌రుస‌గా ఐదేళ్ల పాటు నిరాటంకంగా కొన‌సాగిన యాపిల్ ఈసారి రెండో స్థానానికి దిగ‌జారింది. ఈ యేటి మేటి జాబితాలో ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా గూగుల్ అవతరించింద

|

ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా వ‌రుస‌గా ఐదేళ్ల పాటు నిరాటంకంగా కొన‌సాగిన యాపిల్ ఈసారి రెండో స్థానానికి దిగ‌జారింది. ఈ యేటి మేటి జాబితాలో ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా గూగుల్ అవతరించింది. వరుసగా ఐదేండ్ల నుంచి అగ్రస్థానం దక్కించుకున్న ఆపిల్ కంప్యూటర్స్ బ్రాండ్ విలువ 27% త‌గ్గ‌డంతో ఈ సంవ‌త్స‌రం రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వినియోగ‌దారుల న‌మ్మ‌కం, ఉద్యోగులు, వాటాదార్ల‌, వ్యాపార సామ‌ర్థ్యం, పెట్టుబ‌డులే ప్రాతిప‌దిక‌గా ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ వెల్ల‌డించిన తాజా నివేదిక ప్ర‌కారం ప్ర‌పంచంలోనే టాప్ బ్రాండ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

1. గూగుల్

1. గూగుల్

ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన సంస్థ‌గా గూగుల్ నిలిచింది. 2016లో అది రెండో స్థానంలో ఉంది. 2011 నుంచి అప్ర‌తిహ‌తంగా మొద‌టి స్థానంలో కొనసాగుతున్న యాపిల్‌ను గూగుల్ వెనక్కి నెట్టడం ఈ ఏడాది ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకోవ‌చ్చు. గూగుల్ బ్రాండ్ విలువ 1,09,470 మిలియ‌న్‌ డాల‌ర్లుగా ఉంది. సెర్చ్ ఇంజిన్‌గా మొద‌లైన్ గూగుల్ యాడ్ వ‌ర్డ్స్, గూగుల్ డ్రైవ్‌, యూట్యూబ్‌, గూగుల్ న్యూస్ డివిజ‌న్ల‌తో విప‌రీతంగా ఆన్‌లైన్ సామ్రాజ్యాన్ని విస్త‌రింప‌జేసుకుంది.

 2. యాపిల్

2. యాపిల్

గ‌తేడాది ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న యాపిల్ ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచింది.

2016లో బ్రాండ్ విలువ‌: 1,45,918 మి. డాల‌ర్లు

2017లో బ్రాండ్ విలువ: 1,07,141 మి. డాల‌ర్లు

యాపిల్ బ్రాండ్ విలువ గ‌ణ‌నీయంగా 27% త‌గ్గింది.

3. అమెజాన్.కామ్ (అమెజాన్‌)

3. అమెజాన్.కామ్ (అమెజాన్‌)

ఈ-కామ‌ర్స్ షాపింగ్‌లో కొత్త ఒర‌వ‌డి సృష్టించిన అమెజాన్ ఏటా త‌న స్థానాన్ని ప‌దిల‌ప‌రుచుకుంటోంది. ఈ ఏడాది దీని బ్రాండ్ విలువ 53% పెరిగింది.

2016లో బ్రాండ్ విలువ‌: 69,642 మి. డాల‌ర్లు

2017లో బ్రాండ్ విలువ‌: 106,369 మి. డాల‌ర్లు

 4. ఏటీ అండ్ టీ

4. ఏటీ అండ్ టీ

అమెరికాకు చెందిన ప్ర‌ముఖ‌ టెలికమ్యూనికేషన్ సేవల దిగ్గజం ఏటీ అండ్ టీ. దీనికి 138 ఏళ్ల చ‌రిత్ర ఉంది. ఈ ఏడాది దీని బ్రాండ్ విలువ 45% పెరిగింది. ప్ర‌పంచంలోనే మొబైల్ టెలిఫోన్ సేవ‌ల కంపెనీల్లో అతిపెద్ద వాటిలో ఏటీ అండ్ టీ సైతం ఒక‌టిగా ఉంది.

2016లో బ్రాండ్ విలువ‌: 59,904 మి. డాల‌ర్లు

2017లో బ్రాండ్ విలువ: 87,016 మి. డాల‌ర్లు

 5. మైక్రోసాఫ్ట్

5. మైక్రోసాఫ్ట్

టెక్నాల‌జీకే కొత్త అర్థం చెప్పిన వ్య‌క్తి బిల్‌గేట్స్‌. ఆప‌రేటింగ్స్ సిస్ట‌మ్స్‌లో నిరుప‌మాన‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను నెల‌కొల్పిన మైక్రోసాఫ్ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌లో త‌న‌కంటూ పోటీ లేకుండా సాగుతోంది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగు వ్య‌క్తి స‌త్య నాదెళ్ల కొనసాగుతుండ‌టం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం.

2016లో బ్రాండ్ విలువ‌: 67,258 మి. డాల‌ర్లు

2017లో బ్రాండ్ విలువ: 76,265 మి. డాల‌ర్లు

6. శ్యామ్‌సంగ్

6. శ్యామ్‌సంగ్

2004, 2005లో ప్ర‌పంచంలోనే అత్యంత ఆద‌ర‌ణ క‌లిగిన వినియోగ‌దారు ఎల‌క్ట్రానిక్స్ బ్రాండ్స్‌గా సోనీని అధిగ‌మించిన శామ్‌సంగ్ ఎల‌క్ట్రానిక్స్‌, ప్ర‌స్తుతం ఆరో స్థానంలో ఉంది. గ‌త ఏడాది ఏడో స్థానంలో ఉన్న శ్యామ్‌సంగ్ గ్రూప్ ఈ యేడు 6వ స్థానానికి ఎగ‌బాకింది. ఈ సంస్థ‌కు సంబంధించిన సేవ‌ల్లో ఎల‌క్ట్రానిక్స్‌, ఫుడ్ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, బీమా, సెక్యూరిటీలు, రిటైల్ రంగాలు ఉన్నాయి. ఇది ద‌క్షిణ కొరియాకు చెందిన కంపెనీ.

2016లో బ్రాండ్ విలువ‌: 58,619 మి. డాల‌ర్లు

2017లో బ్రాండ్ విలువ: 66,219 మి. డాల‌ర్లు

7. వెరిజోన్

7. వెరిజోన్

అంతర్జాతీయ క‌మ్యూనికేష‌న్ల రంగంలో రారాజుగా వెలుగొందుతోంది వెరిజోన్‌. గ‌తేడాది 5వ స్థానంలో ఉన్న ఈ బ్రాండ్ ఈసారి 7వ స్థానానికి ప‌డిపోయింది. అయిన‌ప్ప‌టికీ బ్రాండ్ వాల్యూ మాత్రం 4% పెర‌గ‌డం చెప్పుకోద‌గ్గ విష‌యం

2016లో బ్రాండ్ విలువ‌: 63,116 మి. డాల‌ర్లు

2017లో బ్రాండ్ విలువ: 65,875 మి. డాల‌ర్లు

8. వాల్‌మార్ట్‌

8. వాల్‌మార్ట్‌

2016లో బ్రాండ్ విలువ‌: 53,657 మి. డాల‌ర్లు

2017లో బ్రాండ్ విలువ: 62,496 మి. డాల‌ర్లు

దేశంలో టాప్ బ్రాండ్లేవిదేశంలో టాప్ బ్రాండ్లేవి

9. ఫేస్‌బుక్

9. ఫేస్‌బుక్

2016లో బ్రాండ్ విలువ‌: 34,002 మి. డాల‌ర్లు

2017లో బ్రాండ్ విలువ: 61,998 మి. డాల‌ర్లు

10. ఐసీబీసీ (ఇండ‌స్ట్రియ‌ల్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంక్ ఆఫ్ చైనా)

10. ఐసీబీసీ (ఇండ‌స్ట్రియ‌ల్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంక్ ఆఫ్ చైనా)

2016లో బ్రాండ్ విలువ‌: 36,334 మి. డాల‌ర్లు

2017లో బ్రాండ్ విలువ: 47832 మి. డాల‌ర్లు

 ఆపిల్ బ్రాండ్ విలువ త‌గ్గిందా?

ఆపిల్ బ్రాండ్ విలువ త‌గ్గిందా?

గత ఏడాది 1,45,918 మి. డాలర్లుగా నమోదైన ఆపిల్ బ్రాండ్ విలువ ఈ సంవత్సరంలో 1,07,141 కోట్ల మి. డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో గూగుల్ బ్రాండ్ విలువ ఎగబాకింది. బ్రాండ్ విలువలో 53 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసుకున్న అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఈ ఏడాది లిస్టులోనూ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ర్యాంక్ 17వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎగబాకింది. సెర్చ్ ఇంజిన్‌ గూగుల్ సంస్థ మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్ గా నిలువగా, అత్యంత అడ్వాన్స్డ్ ఫోన్ త‌యారీ సంస్థ యాపిల్‌ రెండో స్థానంలో ఉందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. ఆపై అమెజాన్, ఏటీ అండ్ టీ, ఫేస్ బుక్, శ్యామ్‌సంగ్ నిలిచాయి.

English summary

ఆశ్చ‌ర్యం! యాపిల్‌ను వెన‌క్కినెట్టిన గూగుల్‌. ఎందులో? | Top 10 valuabale Brands in the world

Apple has for the last five years held sway as theworld’s most valuable brand. Apple was once aparagon of branding excellence. It has ameticulously constructed, sleek and innovativevisual identity that runs consistently through all itsproducts, services and retail sites. Its monobrandstructure created marketing efficienciesand helped to cement its logo as an icon of the21st century. Reliability, user-friendly interfaces,knowledgeable staff and, most importantly, itstransformative technology meant that the brandfulfilled its promises.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X