For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

60 ల‌క్ష‌ల ఖాతాల్లో రూ. 2 లక్ష‌ల‌కు పైబ‌డి డిపాజిట్లు: ఐటీ శాఖ అప్ర‌మ‌త్త‌త‌

నోట్ల ర‌ద్దు త‌ర్వాత బ్యాంకింగ్ రంగంలోకి రూ. 15 లక్ష‌ల కోట్లు బ్యాకింగ్ రంగంలోకి వ‌చ్చాయ‌ని భావిస్తున్నారు. దీంతో ఆదాయ‌పు ప‌న్ను(ఐటీ) శాఖ ప్ర‌యివేటు సంస్థ‌ల ఆదాయ‌పు ప‌న్ను రిటర్నుల‌ను జాగ్ర‌త్త‌గా ప‌ర

|

పెద్ద‌ నోట్ల మార్పిడి త‌ర్వాత వివిధ వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వంలోని ప‌లు విభాగాలు ఎక్క‌డిక‌క్క‌డ అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో జరిగిన అవ‌త‌వ‌క‌ల‌పై ఆర్‌బీఐ నుంచి ఆర్థిక శాఖ ప‌లు వివ‌రాల‌ను ఇప్ప‌టికే కోరింది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత బ్యాంకింగ్ రంగంలోకి రూ. 15 లక్ష‌ల కోట్లు బ్యాకింగ్ రంగంలోకి వ‌చ్చాయ‌ని భావిస్తున్నారు. దీంతో ఆదాయ‌పు ప‌న్ను(ఐటీ) శాఖ ప్ర‌యివేటు సంస్థ‌ల ఆదాయ‌పు ప‌న్ను రిటర్నుల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తోంది. రూ. 2 లక్ష‌ల‌కు పైన 60 ల‌క్ష‌ల ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు జ‌రిగిన‌ట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఆయా ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తం రూ. 7.34 ల‌క్ష‌ల కోట్లుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 60 ల‌క్ష‌ల ఖాతాల్లో రూ. 2 లక్ష‌ల‌కు పైబ‌డి డిపాజిట్లు: ఐటీ

ఈ ఖాతాల‌ను లోతుగా విశ్లేషించేందుకు సాంకేతిక సాయం తీసుకుంటున్న ఐటీ శాఖ డేటా అన‌లిటిక్స్‌ను ఉప‌యోగిస్తున్న‌దని పీటీఐ నివేదించింది. బిజినెస్ ప్రాసెసింగ్ ద్వారా నోట్ల మార్పిడి త‌ర్వాత బ్యాంకుల్లోకి వ‌చ్చిన నోట్ల వివ‌రాల‌ను తెలుసుకుని వాటి ద్వారా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఐటీ శాఖ స‌రిచూస్తోంది. ఇది వ‌ర‌కే బ్యాంకుల‌ను ఆ మేర‌కు వివ‌రాలు స‌మ‌ర్పించాల్సిందిగా కోరింది. దాని ప్ర‌కారం బ్యాంకులు ఏప్రిల్‌1-న‌వంబ‌రు 8 మ‌ధ్య ఖాతా వివ‌రాల‌ను, న‌వంబ‌రు 10-డిసెంబ‌రు 30 మ‌ధ్య బ్యాంకు ఖాతాల వివ‌రాల‌ను వేర్వేరుగా స‌మ‌ర్పించ‌బోతున్నాయి. అందుబాటులో ఉన్న ఒక్క మార్గాన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ వ‌దిలేందుకు సిద్దంగా లేన‌ట్లు క‌నిపిస్తోంది. పాన్ కార్డు ఆధారంగా సైతం నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఖాతా లావాదేవీల‌ను జ‌ల్లెడ ప‌ట్ట‌బోతున్నారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ డేటా బేస్‌లో ఉన్న ఐటీ రిట‌ర్నులు, టీడీఎస్‌, థ‌ర్డ్ పార్టీ రిపోర్టింగ్‌, ట్యాక్స్ చెల్లింపులు వంటి వాటిన‌న్నింటిని స‌రిపోలుస్తూ బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను త‌నిఖీ చేయ‌బోతున్నార‌ని స‌మ‌చారం.

Read more about: it income tax currency notes
English summary

60 ల‌క్ష‌ల ఖాతాల్లో రూ. 2 లక్ష‌ల‌కు పైబ‌డి డిపాజిట్లు: ఐటీ శాఖ అప్ర‌మ‌త్త‌త‌ | 60 Lakh Accounts Got Deposits Of Over Rs 2 Lakh IT is analysing

With an estimated Rs 15 lakh crore in junked notes back in the banking system post demonetisation, the Income Tax department has started the process of engaging private entities to match the data with I-T return or other information of assessees. The I-T department has already found that post demonetisation more than Rs 2 lakh was deposited in over 60 lakh bank accounts and the total amount deposited in these accounts is over Rs 7.34 lakh crore.
Story first published: Friday, January 27, 2017, 14:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X