For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు స్మార్ట్‌ఫోన్ ఉప‌యోగిస్తున్న వారెంత మందో తెలుసా?

2020 నాటికి దేశీయ రిటైల్ బిజినెస్‌లో ఈ-బిజినెస్ 48 బిలియ‌న్ డాల‌ర్లుగా అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ షాపింగ్‌ 83% మంది స్మార్ట్‌ఫోన్ల‌తో చేస్తున్నార‌నే విష‌యం అంద‌రికీ సంతోషం క‌లిగించే

|

యువ‌త స్మార్ట్‌ఫోన్ల బాట ప‌ట్ట‌డంతో దేశ‌మంతా డిజిట‌ల్‌గా మారుతోంది. ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్లు విప‌రీత‌మైన ప్ర‌క‌ట‌న‌లు, ఆఫ‌ర్లు ఇవ్వ‌డంతో పాటు షాపింగ్ చేసేందుకు తీరిక, ఒపిక లేక‌పోవ‌డంతో యువ‌తరం ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నారు. గ‌తేడాది సెప్టెంబ‌రు 30 నాటికి ఫ్లిప్‌కార్ట్ 10 కోట్ల మైలురాయిని దాటేసింది. 2020 నాటికి దేశీయ రిటైల్ బిజినెస్‌లో ఈ-బిజినెస్ 48 బిలియ‌న్ డాల‌ర్లుగా అంచ‌నా వేస్తున్నారు. ఈ స‌ంద‌ర్భంలో ఆన్‌లైన్ షాపింగ్‌ 83% మంది స్మార్ట్‌ఫోన్ల‌తో చేస్తున్నార‌నే విష‌యం అంద‌రికీ సంతోషం క‌లిగించే విష‌యం. ఈ నేప‌థ్యంలో రెగాలిక్స్ అధ్య‌య‌నంలో మొబైల్ షాపింగ్ సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌ విష‌యాల‌ను చూద్దాం.

1. దేశ ఆన్‌లైన్ షాపింగ్‌లో ఫ్లిప్‌కార్ట్ ,అమెజాన్ నువ్వా నేనా?

1. దేశ ఆన్‌లైన్ షాపింగ్‌లో ఫ్లిప్‌కార్ట్ ,అమెజాన్ నువ్వా నేనా?

ఒక ప‌క్క ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్ వాడ‌కం దార్లు పెరిగార‌ని సంబ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో దాని వాల్యూయేష‌న్ ఈ మ‌ధ్యే 38% త‌గ్గ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. అమెజాన్‌లో ఉచిత షిప్పింగ్ కావాలంటే అయితే ప్రైమ్ క‌స్ట‌మ‌ర్ అయినా అవ్వాలి లేదా క‌నీస షాపింగ్ విలువ రూ. 499గా ఉండాలి. అయినప్ప‌టికీ భార‌తీయుల‌కు అమెజాన్‌పై మోజు త‌గ్గ‌డం లేదు. అక్టోబ‌ర్‌లో బిగ్ బిలియ‌న్ డేస్ స‌మ‌యంలో అమెజాన్ కంటే 70 నుంచి 80 శాతం ఎక్కువ అమ్మ‌కాలు జ‌రిపిన‌ట్లుగా ఫ్లిప్‌కార్ట్ ప్ర‌క‌టించింది.

2. ప్ర‌తి ముగ్గురు కొనుగోళ్ల‌దార్ల‌లో ఒక‌రు మొబైల్‌ఫోన్‌ కొంటున్నారు

2. ప్ర‌తి ముగ్గురు కొనుగోళ్ల‌దార్ల‌లో ఒక‌రు మొబైల్‌ఫోన్‌ కొంటున్నారు

25 నుంచి 34 మ‌ధ్య వ‌య‌సు వాళ్లు మొబైల్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నారు. సౌక‌ర్య‌వంతం, రేట్లు పోల్చుకోవ‌డం వంటి ఫీచ‌ర్ల కార‌ణంగానే ఈ విధంగా చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా క‌నీసం నెల‌కు ఒక‌సారి షాపింగ్ చేస్తున్న్ట‌ట్లు 33% మంది వెల్ల‌డించార‌ని రెగాలిక్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. మొత్తం యువ‌త‌లో వారానికి ఒక‌సారి షాపింగ్ చేసేవారి శాతం 28%, మూడు నెల‌లకోసారి చేసేవారి శాతం 25% గా ఉంది. కేవ‌లం 14% మంది మాత్ర‌మే ఏడాదికి ఒక‌సారి మొబైల్ ద్వారా వ‌స్తువుల‌ను బుక్ చేస్తున్నట్లు తెలిపారు.

3. మ‌గ‌వాళ్లే ఎక్కువంట‌

3. మ‌గ‌వాళ్లే ఎక్కువంట‌

ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆడ‌వాళ్ల కంటే మ‌గ‌వాళ్లే ఎక్కువ షాపింగ్ చేస్తున్న‌ట్లు వెళ్ల‌డ‌యింది. మ‌గ‌వాళ్ల‌లో 63% మంది నెల‌కు ఒక‌సారి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుండ‌గా; ఆడ‌వాళ్ల‌లో ఈ సంఖ్య 44% గా ఉంది. ఎక్క‌డి నుంచైనా ఏ స‌మ‌యంలో అయినా వ‌స్తువులు కొనుగోలు చేసే వీలుండ‌టం వీరంద‌రినీ ఆన్‌లైన్ బాట ప‌ట్టేలా చేస్తోంది. అంతే కాకుండా ఎప్పుడూ రాయితీలు, ఆఫ‌ర్ల చేత మార్కెట్ల‌ను ముంచెత్తుతుండ‌టం కూడా ఇందుకు మూల కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. మామూలుగా ఆఫ్‌లైన్ స్టోర్ల కంటే ఆన్‌లైన్‌లో త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువులు ల‌భ్య‌మ‌వుతున్నాయి. భార‌తీయులు ధ‌ర విష‌యంలో చాలా ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టంతో ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల‌కు ఇది వ‌ర‌మైంది. చెల్లింపుల‌, డెలివ‌రీ ఆప్ష‌న్లు కూడా వినియోగ‌దారుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండ‌టంతో క‌స్ట‌మ‌ర్ల స‌మ‌యం, శ‌క్తి ఆదా అవుతున్నాయి.

4. ఇప్ప‌టికీ మ‌నోళ్ల ఫేవ‌రెట్ ఇంకా ఫ్లిప్‌కార్టే

4. ఇప్ప‌టికీ మ‌నోళ్ల ఫేవ‌రెట్ ఇంకా ఫ్లిప్‌కార్టే

2016 సంవ‌త్స‌రంలో కొన్ని వివాదాలు చుట్టుముట్టినా ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌,యాప్‌ను వినియోగ‌దారులు దూరం పెట్ట‌లేదు. షాపింగ్ కోసం ఫ్లిప్‌కార్ట్ వైపు మొగ్గుచూపుతామ‌ని 44% మంది చెప్ప‌గా, అమెజాన్‌ను వాడ‌తామ‌ని 32% మంది చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, స్నాప్‌డీల్ మ‌ధ్య పోటీ అంత‌కంత‌కు పెరుగుతుంద‌ని చెప్ప‌కనే అర్థ‌మ‌వుతోంది. మ‌రో వైపు మార్కెట్ వాటా త‌గ్గుతోంద‌ని వ‌దంతులు(రూమ‌ర్లు) వ‌చ్చినా 19% మంది స్నాప్‌డీల్‌కు ఒటేశారు. అమెజాన్ అమెరికాకు చెందిన వెబ్‌సైట్ కాగా, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ ప్ర‌ముఖ దేశీయ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు. అయితే ఏది ఏమైన‌ప్ప‌టికీ వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల ద్వారా మార్కెట్ వాటాలో అమెజాన్ అగ్ర‌స్థానానికి చేర‌డం ఎంతో దూరంలో లేద‌నే చెప్పాలి.

5. ధ‌ర‌ల‌ను తెలుసుకునేందుకు మాధ్య‌మంగా ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్లు

5. ధ‌ర‌ల‌ను తెలుసుకునేందుకు మాధ్య‌మంగా ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్లు

వ‌స్తువుల‌ను కొనేందుకు డ‌బ్బులు పెట్టే విష‌యంలో మ‌నోళ్లు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తారు. మొబైల్ ఫోన్ల‌లో వ‌స్తువులు కొనేకంటే ముందు చాలా విష‌యాల‌ను ఆరాతీస్తారు. యువ‌త మొగ్గుచూపే వాటిలో గాడ్జెట్లు,ఎల‌క్ట్రానిక్స్ ; వ‌స్త్రాలు, యాక్సెస‌రీస్‌; ఇంటికి అవ‌స‌ర‌మ‌య్యే ఉత్ప‌త్తులు టాప్ 3 కేట‌గిరీల్లో ఉన్నాయి. వీట‌న్నింటిని ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో వెతుకుతున్నా అక్క‌డ కొన‌డం కంటే నేరుగా దుకాణాల్లో కొనేందుకు మొగ్గుచూపుతున్నారంట‌. దుస్తులు, పాద‌ర‌క్ష‌లు వంటి వాటిని ట్ర‌య‌ల్ చేసుకునే సౌల‌భ్యం ఉండ‌ట‌మే దీనికి కార‌ణం కావొచ్చు.

6. రేట్లు చెక్ చేసుకుంటాం

6. రేట్లు చెక్ చేసుకుంటాం

సాధార‌ణంగా వ‌స్తువు కొన్నా కొన‌క‌పోయినా ధ‌ర‌ను, వెరైటీల‌ను, ఉత్ప‌త్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ర‌క‌ర‌కాల వెబ్‌సైట్ల‌లో పోల్చి చూస్తారు. రెగాలిక్స్ గ‌తంలో చేసిన ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం 32% మంది ఇలా చేస్తున్నట్లు వినియోగ‌దారులు అంగీక‌రించార‌ని తెలిపింది. ఆఫ్‌లైన్‌లో కొనేందుక‌యినా ప్ర‌త్యేక డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు ముఖ్య‌మ‌ని వీరు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇంతే కాకుండా ఎక్కువ వెరైటీల‌ను ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోవ‌చ్చు. ఉత్ప‌త్తుల‌ను ఎక్కువ‌గా ఆప్‌లైన్‌లో కొన‌డానికి గ‌ల కార‌ణాల్లో వెరైటీల‌ను ట్రై చేయ‌వ‌చ్చ‌వ‌ని 22% మంది క‌స్ట‌మ‌ర్లు వెల్ల‌డించారు. మొత్తానికి ఉత్త‌మ డీల్స్‌, ఆప్ష‌న్లు షాపింగ్ నిర్ణ‌యాన్ని ప్ర‌భావితం చేస్తాయి.

7. నాణ్య‌త త‌క్కువ ఉండొచ్చేమో!

7. నాణ్య‌త త‌క్కువ ఉండొచ్చేమో!

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తే త‌క్కువ నాణ్య‌త గ‌ల ప్రాడ‌క్టులు ఇంటికి వ‌స్తాయ‌మ‌ని వినియోగ‌దారులు కొంత‌మంది భ‌య‌ప‌డుతున్నారు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయ‌ని వారిలో 75% మంది ఇదే కార‌ణంతో దూరంగా ఉంటున్న‌ట్లు తెలిసింది. రియ‌ల్ లైఫ్‌లో చాలా సార్లు మ‌నం చూస్తున్న సంఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు దీన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయి.

క‌స్ట‌మ‌ర్ల‌కు ఏదో లోపం ఉన్న ఉత్ప‌త్తులు రావ‌డం, ఒక‌టి బుక్ చేస్తే మ‌రేదో రావ‌డం అంద‌రికీ తెలిసిందే. భ‌ద్ర‌త‌(14%), డెలివరీ సేవ‌ల్లో లోపాలు(11%) వంటి మ‌రో రెండు కార‌ణాలు కొంత‌మందిని ఆన్‌లైన్ షాపింగ్‌కు దూరం ఉండేలా చేస్తున్నాయి.

8. ఎక్కువ మంది సీవోడీ(క్యాష్ ఆన్ డెలివ‌రీ)నే

8. ఎక్కువ మంది సీవోడీ(క్యాష్ ఆన్ డెలివ‌రీ)నే

63% మంది సీవోడీ(క్యాష్ ఆన్ డెలివ‌రీ)నే త‌మ ఫేవ‌రెట్ పేమెంట్ ఆప్ష‌న్ అని చెప్పారు. దీంతో త‌మ‌ను ఆన్‌లైన్ రిటైల‌ర్లు మోసం చేయ‌లేర‌ని వినియోగ‌దారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 17శాతం మంది మాత్ర‌మే చెల్లింపుల‌కు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మార్గాల‌ను ఎంచుకుంటున్న‌ట్లు తెలిపారు. 18-24 వ‌యస్సువారిలో 67%; 25-34 వ‌య‌స్సు వారిలో 53% మంది క్యాష్ ఆన్ డెలివ‌రీకే మొగ్గుచూపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌హిళ‌ల్లో కార్డుల‌(7%) కంటే నెట్‌బ్యాంకింగ్‌(25%) ఆప్ష‌నే పాపుల‌ర్‌.

9. వెబ్‌సైట్ల కంటే యాప్‌లే ఉత్త‌మ ఆప్ష‌న్‌

9. వెబ్‌సైట్ల కంటే యాప్‌లే ఉత్త‌మ ఆప్ష‌న్‌

వెబ్‌సైట్ల కంటే యాప్‌లే యువ‌త‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం వెబ్‌సైట్ల కంటే యాప్‌ల వైపే మొగ్గుచూపుతామ‌ని స‌ర్వేలో పాల్గొన్న వారిలో 94% మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన ప‌లు స‌ర్వేల్లో సైతం యాప్‌లు వెబ్‌సైట్ల కంటే వేగంగా ప‌నిచేస్తాయ‌ని 80% మంది అంగీక‌రించారు. షాపింగ్ అనుభూతినే స‌రికొత్త‌గా మార్చ‌డంలో స్మార్ట్‌ఫోన్ల ఘ‌న‌నీయ‌మైన పాత్ర‌ను పోషించాయ‌డన‌డంలో అతిశ‌యోక్తి లేదు. మీరు ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులైతే ఏదో ఈ-కామ‌ర్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి మ‌రి.

Read more about: ecommerce online shopping
English summary

దేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు స్మార్ట్‌ఫోన్ ఉప‌యోగిస్తున్న వారెంత మందో తెలుసా? | 1 Out of 3 Shoppers in India Buy Using Mobile Phone says Report

It’s high time companies and marketers set their priorities right. They have the opportunity to attract new and old customers by offering the best possible deals. Winning the trust of the consumers is another important factor! Smartphones have revolutionized the way shopping is done. Thanks to the rise of several eCommerce platforms, the competition is getting fierce day by day. Starting with flash sales and heavy discounts, companies are doing everything to attract and retain online shop-a-holics!
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X