For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్ల‌ల కోసం ముందుగానే పొదుపు ప్ర‌ణాళిక

పిల్ల‌ల‌కు నాణ్య‌మైన ఉత్త‌మ విద్య‌ను, మంచి భ‌విష్య‌త్తును అందించాల‌ని ప్ర‌తి త‌ల్లిదండ్రుల‌కూ ఉంటుంది. చాలా మంది జీవిత ల‌క్ష్యాల్లో ఇది ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నారా?

|

పిల్ల‌ల‌కు నాణ్య‌మైన ఉత్త‌మ విద్య‌ను, మంచి భ‌విష్య‌త్తును అందించాల‌ని ప్ర‌తి త‌ల్లిదండ్రుల‌కూ ఉంటుంది. చాలా మంది జీవిత ల‌క్ష్యాల్లో ఇది ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటే చాలా మంది మౌనం పాటిస్తారు. దాని కోసం అవ‌స‌ర‌మైన డ‌బ్బును స‌మ‌కూర్చుకుంటున్నారా? బీమా కంపెనీలు అందించే పిల్ల‌ల పాల‌సీల నుంచి ఆడ పిల్ల‌ల‌కు ఉండే సుక‌న్య స‌మృద్ది ప‌థ‌కం వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిలోంచి మీరు ఏది ఎంచుకోవాల‌నేదే అస‌లు స‌మ‌స్య‌. ఈ నేప‌థ్యంలో పిల్ల‌ల పొదుపు ప్ర‌ణాళిక కోసం చ‌క్క‌టి మార్గం మీ కోసం.

చ‌దువుల కోసం

చ‌దువుల కోసం

ప్ర‌స్తుత రోజుల్లో చదువుకోవ‌డం కాదు, చ‌దువును కొనాల్సి వ‌స్తోంది. ఎల్‌కేజీ నుంచే త‌ల్లిదండ్రుల‌పై విద్యార్థుల ఫీజుల భారం ల‌క్ష‌ల్లో మొద‌ల‌వుతున్నాయంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఉన్న‌త విద్య కోసం చాలా మంది పిల్ల‌లకు న‌చ్చిన కాలేజీలో చేర్పించ‌లేక వెనుక‌డుగు వేస్తున్న ప‌రిస్థితి ఉంది. మంచి కాలేజీల్లో ఇంజినీరింగ్ చ‌దివించాలంటే మేనేజ్‌మెంట్ కోటాలో దాదాపు రూ. 10 ల‌క్ష‌ల నుంచి రూ. 25 లక్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు అవుతోంది. మెడిసిన్ మేనేజ్‌మెంట్ సీటులో చ‌దివించాలంటే కోట్ల‌కు పైమాటే. ఈ విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకుని త‌ల్లిదండ్రులు పిల్ల‌ల చ‌దువుల కోసం ముందే నుంచే పొదుపు ప్ర‌ణాళిక‌ను వేసుకోవాలి. అవ‌స‌ర‌మైతే మంచి ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణుల‌ను సంప్ర‌దించి వారి సాయం తీసుకోవ‌చ్చు.

పెళ్లి కోసం

పెళ్లి కోసం

పిల్ల‌ల వివాహం చేయ‌డం త‌ల్లిదండ్రుల కీల‌క బాధ్య‌తల్లో ఒక‌టి. పెళ్లి ఖ‌ర్చులు నేటి కాలంలో అమాంతం పెరిగిపోయాయి. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని పిల్ల‌ల పెళ్లి, ఆ త‌ర్వాత వ‌చ్చే ఖ‌ర్చుల కోసం ముందు నుంచే పొదుపు చేయ‌డం ప్రారంభించాలి. దీని వ‌ల్ల వివాహ స‌మ‌యానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిశ్చింత‌గా ఉండొచ్చు.

బ్యాంకు పొదుపు ఖాతా...

బ్యాంకు పొదుపు ఖాతా...

పిల్ల‌లు పుట్టినప్పుడే వారి పేరిట ఏదైనా బ్యాంకులో ఖాతా ప్రారంభిస్తే మంచిది. ఇటువంటి ఖాతాల‌కు త‌ల్లిదండ్రులు సంర‌క్ష‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌తి నెలా కొంత మొత్తాన్ని ఆ ఖాతాలో పొదుపు చేస్తూ ఉండాలి. నెల‌కు రూ.వేయి మొద‌లుకొని రూ. 2 వేలు పొదుపు చేస్తూ పోయినా సంవ‌త్స‌రాంతానికి రూ. 12 నుంచి రూ. 24 వేల వ‌ర‌కూ జ‌మ అవుతుంఇ. ఆ మొత్తాన్ని మ‌రింత రాబ‌డి ఇచ్చే ఏదైనా పెట్టుబ‌డి ప‌థ‌కంలోకి మ‌ళ్లిస్తే పిల్ల‌ల‌కు యుక్త వ‌య‌సు వ‌చ్చేసరికి అది చాలా పెద్ద‌మొత్త‌మే అవుతుంది.

బీమా క‌వ‌రేజీ

బీమా క‌వ‌రేజీ

పిల్ల‌లు పుట్ట‌క ముందు ఖ‌ర్చులు కాస్త ప‌రిమితంగానే ఉంటాయి. పెళ్లి త‌ర్వాత ఆర్థిక బాధ్య‌త‌లు పెరిగిపోతాయి. మీ పైన ఆధార‌ప‌డిన వారు ఉన్న‌ప్పుడు ఒక‌వేళ అనుకోని ప‌రిస్థితుల్లో మ‌న‌కు ఏదైనా జ‌రిగితే పిల్ల‌ల‌కు ఆర్థిక ఇబ్బందులు త‌లెత్త‌కుండా మీ ఆదాయానికి 10 నుంచి 12 రెట్ల ట‌ర్మ్ పాల‌సీని తీసుకోవ‌డం ఉత్త‌మం. పాలసీ కొనుగోలు స‌మ‌యంలో పిల్లల చ‌దువు, వివాహం, దిన‌స‌రి ఖ‌ర్చులు దృష్టిలో ఉంచుకోవాల‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తారు.

సుక‌న్య స‌మృద్ది ప‌థ‌కం:

సుక‌న్య స‌మృద్ది ప‌థ‌కం:

ఎక్కువ‌గా రిస్క్ చేయ‌లేని పెట్టుబ‌డిదారుల‌కు ఇది ఉత్త‌మ మార్గం. అయితే ఇది ఆడ‌పిల్ల‌లు క‌లిగిన త‌ల్లిదండ్రుల‌కు మాత్ర‌మే. ఖాతా తెరిచేసరికి అమ్మాయి వ‌య‌సు 10 ఏళ్లు మించ‌కూడ‌దు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80సీ కింద రూ. 1ల‌క్షా 50 వేల వ‌ర‌కూ మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు.

ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌)

ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌)

పీపీఎఫ్ లేదా ఆర్‌డీల‌పై 8.0 శాతంపైనే వ‌డ్డీ వ‌స్తోంది. పీపీఎఫ్‌లోని పెట్టుబ‌డుల‌కు ప్ర‌భుత్వ హామీ ఉన్నందున ఇవి సుర‌క్షిత‌మైన‌వి. పిల్ల‌ల ఆర్థిక భ‌విష్య‌త్తు కోసం చేసే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు సైతం ఉన్నాయి. పీపీఎఫ్‌పై లాక్ఇన్ పీరియ‌డ్ ఎక్కువ ఉంటుంది అని భావించే వారు రిక‌రింగ్ డిపాజిట్ల‌కు మొగ్గుచూప‌వ‌చ్చు.

ఈక్విటీల్లో

ఈక్విటీల్లో

పిల్ల‌ల కోసం పొదుపు చేస్తున్న‌ప్పుడు దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళికే ఉంటుంది. అన్నింటి కంటే త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకున్న పెట్టుబ‌డి షేర్ల‌ను కొని పెట్టుకోవ‌డం. ఇండియాలో నిఫ్టీలో ఈక్విటీల‌ను ఎంచుకుంటే మంచిది. నిఫ్టీ ఆధారంగా ఈటీఎఫ్‌ల్లో కానీ, ఇండెక్స్ ఫండ్స్‌లో కానీ పెట్టుబ‌డి పెట్టి నేరుగా స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డి పెడితే వ‌చ్చే ప్రయోజ‌నాల‌ను అందుకోవ‌చ్చు. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ ఎక్స్‌పోజ‌ర్ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడూ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించిన రాబ‌డుల‌ను ఇస్తాయ‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తూ ఉంటారు.

బ్యాలెన్స్‌డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు

బ్యాలెన్స్‌డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు

బ్యాలెన్స్‌డ్ ఫండ్ల ఆస్తుల‌ను క‌నీసం 65 శాతం ఈక్విటీల‌లోను మిగిలిన దాన్ని డెట్ షేర్ల‌లోనూ పెడ‌తారు. ప‌న్ను ఉద్దేశంలో చూస్తే వీటిని ఈక్విటీ ఫండ్లుగానే లెక్కగ‌డ‌తారు. వీటికి కొంచెం త‌క్కువ ఈక్విటీ ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ అంత ఎక్కువ రిస్క్ చేయ‌ని పెట్టుబ‌డిదార్ల‌కు ఇవి బాగానే స‌రిపోతాయి.

ఆర్థిక లక్ష్యాలపై స‌మీక్ష‌

ఆర్థిక లక్ష్యాలపై స‌మీక్ష‌

కుటుంబంలో కొత్త వ్యక్తి చేరిన (పెళ్లి తర్వాత) వెంటనే ఆర్థిక లక్ష్యాలు మారిపోతాయి. ఆదాయంలో వృద్ధి లేకపోయినా పెరిగే ఖర్చులు తట్టుకుంటూనే మరింతగా పొదుపు చేసేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యతలో ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు పుట్టిన వెంటనే ప్రతి వ్యక్తి తన ఆర్థిక లక్ష్యాలను స‌మీక్షించి మారిన పరిస్థితులకు అనుగుణంగా సవరించుకోవాలి.

English summary

పిల్ల‌ల కోసం ముందుగానే పొదుపు ప్ర‌ణాళిక | How to choose best savings for children in India

It is important for children to learn money lessons early in life so that they can inculcate some of those lessons whe they become adults. Parents play an important role in developing money habits in children.It is parents responsibility to save and make them children to learn about importance of savings.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X