English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇది చ‌ద‌వండి

Posted By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

పాల‌సీదారు అత‌ని కుటుంబానికి స‌రైన ఆర్థిక భ‌రోసా క‌ల్పించే వాటిలో ట‌ర్మ్ పాల‌సీలు ఉత్త‌మ‌మైన‌వి. గ‌త కొన్నేళ్ల నుంచి ఈ ట‌ర్మ్ పాల‌సీలు సైతం ఆన్‌లైన్‌లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఆన్‌లైన్ అవ‌డం వ‌ల్ల సంప్ర‌దాయ ఆఫ్‌లైన్ పాల‌సీల కంటే కొంచెం ప్రీమియం త‌క్కువ‌కే ఈ పాల‌సీలు దొరుకుతున్నాయి. ప్రీమియం పోల్చి చూసుకునే వారికైతే ఆఫ్‌లైన్ పాల‌సీల కంటే ఆన్‌లైన్ పాల‌సీలు కొంచెం బెట‌ర్‌గా ఉంటాయి. పాల‌సీ తీసుకునే ముందు అదే పాల‌సీని ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో పోల్చి చూసుకుంటే మంచిది. అయితే ప్రీమియం పొగ తాగే అలవాటును బ‌ట్టి మారుతుంది. పొగ తాగే అల‌వాటు ఉన్న‌వారికి ప్రీమియం ఎక్కువ ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.

మార్కెట్లో వివిధ కంపెనీల ట‌ర్మ్ పాల‌సీలు ఆన్‌లైన్‌లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. మీ జీవ‌న‌శైలికి న‌ప్పే ప్లాన్‌ను చూసుకోవాలి. త‌ద్వారా మీరు లేని స‌మ‌యంలో మీ కుటుంబానికి ఆర్థిక భ‌ద్ర‌త ఉంటుంది.  ఈ నేప‌థ్యంలో వివిధ కంపెనీల ఆన్‌లైన్ ట‌ర్మ్ ప్లాన్‌ల గురించి చూద్దాం.

ఎల్ఐసీ ఈ-ట‌ర్మ్‌

ఎల్ఐసీ ఈ-ట‌ర్మ్‌

ఎల్ఐసీ ఈ-ట‌ర్మ్ పాల‌సీ కేవ‌లం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇందులో మీరు వెబ్‌సైట్ ద్వారా నేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇందులో ప్రీమియం కేట‌గిరీలు రెండు ఉంటాయి.- 1.స్మోక‌ర్(అగ్రిగేట్) 2. నాన్‌స్మోక‌ర్

క‌నీస బీమా హామీ మొత్తం రూ. 25 లక్ష‌లు, రూ. 50 ల‌క్ష‌లు ఉండ‌గా ఉండ‌గా, పాల‌సీ ట‌ర్మ్ గ‌రిష్టంగా 35 ఏళ్లుగా ఉంటుంది. ఈ పాల‌సీలో ప్ర‌ధాన అడ్వాంటేజ్ ఏంటంటే అన్మోల్ జీవ‌న్, అమూల్య జీవ‌న్ పాల‌సీల కంటే 30% త‌క్కువ ప్రీమియంకే పాల‌సీ క‌వ‌రేజీ ఎక్కువ‌గా వ‌స్తుంది.

అయితే ఈ-ట‌ర్మ్ పాల‌సీకి ప్రీమియంను ఏడాదికి ఒక‌సారి మొత్తం చెల్లించాలి.

ఎల్ఐసీ క్లెయిం రేషియో(పాలసీ దారుల‌కు క్లెయింలు చెల్లించ‌డం)లో 98.14% గా ఉంది.

ఐసీఐసీఐ ప్రూ ఐ ప్రొటెక్ట్ ప్లాన్‌

ఐసీఐసీఐ ప్రూ ఐ ప్రొటెక్ట్ ప్లాన్‌

అకస్మాత్తుగా పాల‌సీదారుకు ఏదైనా జ‌రిగితే నామినీకి పెద్ద‌మొత్తంలో బీమా హామీ మొత్తాన్ని అందించేందుకు ఐసీఐసీఐ ప్రూ ఐ ప్రొటెక్ట్ ప్లాన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. 30 ఏళ్ల వ‌య‌సులో గృహ రుణం తీసుకుందార‌నుకుందాం. అలాంట‌ప్పుడు రూ. 1 కోటికి ప్రు ఐ ప్రొటెక్ట్ ప్లాన్‌లో బీమా తీసుకునేందుకు వీలుంది. ఒక‌వేళ అనుకోనిది ఏదైనా జ‌రిగి పాల‌సీదారు మ‌ర‌ణిస్తే నామినీ రూ.1 కోటి అందుకుంటారు. ఇది రుణం తీర్చేందుకు ప‌నికొస్తుంది. అంతే కాకుండా కుటుంబానికి కొద్ది రోజుల పాటు రోజువారీ ఖ‌ర్చులు గ‌డిచేందుకు డ‌బ్బులు ఉంటుంది.

ఒక‌వేళ పాల‌సీదారు వైక‌ల్యం పొందితే, ప్రీమియం మాఫీ చేసేందుకు సైతం స‌దుపాయం ఉంటుంది. ఇంకా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ బెనిఫిట్‌, డెత్ బెనిఫిట్‌, ట‌ర్మిన‌ల్ ఇల్‌నెస్ బెనిఫిట్ పాల‌సీల ప్ర‌యోజ‌నాలు ప్ర‌ధాన పాల‌సీలో క‌లిసి ఉంటాయి. మ‌ర‌ణ ప్ర‌యోజ‌నం(డెత్ బెనిఫిట్‌) అందుకునేలా సైతం ఐసీఐసీఐ ప్రు ఐ ప్రొటెక్ట్ సౌక‌ర్యం క‌ల్పిస్తుంది. అంటే మొత్తం డ‌బ్బును ఒకేసారి లేదా నెల‌వారీ ఆదాయం(పెరుగుతూ ఉండేలా) రూపంలో పాల‌సీ బీమా హామీ మొత్తం ప్ర‌యోజ‌నాల‌ను అంద‌జేస్తారు.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్(Click 2 Protect)

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్లిక్ 2 ప్రొటెక్ట్(Click 2 Protect)

ఇది పూర్తిగా ర‌క్ష‌ణ క‌ల్పించే పాలసీ. స‌రైన ప్రీమియంకు పాల‌సీదారుకు సరిప‌డినంత ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ మీ కుటుంబ స‌భ్యుల‌కు అత్య‌వ‌సరాల్లో ఆర్థిక ఆస‌రాగా నిల‌బ‌డుతుంది. ప్రీమియంను ఒకేసారి చెల్లించ‌వ‌చ్చు లేదా నెల‌వారీ, త్రైమాసికానికి ఒక‌సారి, ఆరు నెల‌ల‌కొక‌సారి, సంవ‌త్స‌రానికి ఒక‌సారి చెల్లించే ఏర్పాటు ఉంటుంది. 10 ఏళ్ల క‌నీస ప‌రిమితి నుంచి 40 ఏళ్ల కాల‌ప‌రిమితి వ‌రకూ ఉండేలా పాల‌సీదారు పాల‌సీ కాల‌ప‌రిమితి(టర్మ్)ను ఎంచుకోవ‌చ్చు. క‌నీస బీమా హామీ మొత్తం రూ. 25 ల‌క్ష‌లుగా ఉంది. క‌నీస వార్షిక ప్రీమియం రూ. 3000 నుంచి ప్రారంభ‌మ‌వుతోంది.

ఐఆర్‌డీఏ లెక్క‌ల ప్ర‌కారం ఈ కంపెనీ 2014-15లో క్లెయిం రేషియో 90.5 శాతంగా క‌లిగి ఉంది.

ఎస్‌బీఐ లైఫ్ షీల్డ్‌

ఎస్‌బీఐ లైఫ్ షీల్డ్‌

ఎస్‌బీఐ లైఫ్ షీల్డ్ అనేది వ్య‌క్తిగ‌త‌, నాన్‌లింక్‌డ్‌, నాన్ పార్టిసిపేటింగ్ ట‌ర్మ్ ప్లాన్‌. సామాన్యుడు కూడా భ‌రించేలా త‌క్క‌వ మొత్తంలో ప్రీమియం ఉంటూ ఉత్త‌మ ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పించేలా ఈ పాల‌సీని రూపొందించారు. క‌నీస బీమా హామీ మొత్తం రూ. 20 ల‌క్ష‌ల నుంచి ప్రారంభ‌మ‌వుతోంది. అది రూ. 1 ల‌క్ష మొత్తాల్లో మాత్ర‌మే ఉంటుంది.

అన్ని ప్రీమియంల‌ను క్ర‌మంగా చెల్లించిన పాల‌సీల‌కే మ‌ర‌ణ ప్ర‌యోజ‌నాన్ని(డెత్ బెనిఫిట్‌) క‌ల‌గ‌జేస్తారు. క్లెయిం చేసేట‌ప్ప‌టికీ పాల‌సీ యాక్టివ్‌గా ఉండి ఉండాలి.

నాన్‌స్మోక‌ర్ కేట‌గిరీకి రాయితీ ఉంటుంది. రూ. 50 ల‌క్ష‌ల బీమా హామీ మొత్తాన్ని నాన్ స్మోక‌ర్ ఎంచుకుంటే త‌క్కువ ప్రీమియంకే ల‌భిస్తోంది.

ఈ కంపెనీ క్లెయిం సెటిల్మెంట్ రేషియో 2014-15లో 89.43% గా ఉంది.

బ‌జాజ్ అలియంజ్‌

బ‌జాజ్ అలియంజ్‌

మీ కుటుంబ ఆర్థిక అవ‌స‌రాల‌ను భ‌ద్ర‌ప‌రిచే విధంగా బ‌జాజ్ అలియంజ్ ఐసెక్యూర్ పాల‌సీని రూపొందించారు. అధిక బీమా మొత్తాన్ని త‌క్కువ ప్రీమియంలో అందించే లెవ‌ల్ ట‌ర్మ్ క‌వ‌రేజీ ఇది.

క‌నీస కాల‌పరిమితి 10 ఏళ్లుగా ఉంటూ, గ‌రిష్టంగా 30 ఏళ్లు కాల‌ప‌రిమితిని ఎంచుకునేందుకు పాల‌సీలో అవ‌కాశం క‌ల్పించారు. పాల‌సీ ట‌ర్మ్‌ను 10,15,20,25,30 ఏళ్లుగా ఎంచుకునే ఆప్ష‌న్ ఉంటుంది. అది వ్య‌క్తి ఆర్థిక ప‌రిస్థితి, అవ‌స‌రాన్ని బ‌ట్టి మారుతుంది కాబ‌ట్టి బాగా ఆలోచించుకోవాలి.

మ్యాక్స్ లైఫ్ ఆన్‌లైన్ ట‌ర్మ్ ప్లాన్‌

మ్యాక్స్ లైఫ్ ఆన్‌లైన్ ట‌ర్మ్ ప్లాన్‌

మీరు లేని స‌మ‌క్షంలో మీకు బాగా ఇష్ట‌మైన వారు, మీ మీద ఆధార‌ప‌డిన వారి ఆర్థిక ర‌క్ష‌ణను మ్యాక్స్ లైఫ్ ఆన్‌లైన్ ట‌ర్మ్ ప్లాన్ క‌వ‌ర్ చేస్తుంది. ప్రీమియం కూడా దాదాపుగా అంద‌రూ భ‌రించే విధంగా ఉంది. పాల‌సీ తీసుకునే వ్య‌క్తులు మ్యాక్స్ లైఫ్ కాంప్రెహెన్సివ్ యాక్సిడెంట‌ల్ డెత్ బెనిఫిట్‌, మ్యాక్స్ లైఫ్ వేవ‌ర్ ఆఫ్ ప్రీమియం ప్ల‌స్‌(ప్రీమియం మాఫీ), ప్ర‌మాదం జ‌రిగి, వ్యాధి వ‌చ్చి మ‌ర‌ణించినా, వైక‌ల్యం సంభ‌వించినా అటువంటి వాటికి అద‌న‌పు ర‌క్ష‌ణ క‌ల్పించేలా పాల‌సీ ఆప్ష‌న్లు అవ‌కాశ‌మిస్తున్నాయి.

ఏగాన్ లైఫ్ ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌

ఏగాన్ లైఫ్ ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌

ఏగాన్ కంపెనీ స‌రికొత్త ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీని ఆన్‌లైన్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఇది కొన్ని అద‌న‌పు ఆప్ష‌న్ల‌తో వ‌చ్చింది. త‌క్కువ ప్రీమియంతోనే అధిక ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం, జీవితంలోని వివిధ ద‌శ‌ల‌కు అనుగుణంగా పాల‌సీ విలువ పెంచుకునేందుకు వీలుంటుంది. ప్రీమియంను నెల‌వారీ, త్రైమాసికానికి, ఆరు నెల‌లు,సంవ‌త్స‌రానికి ఒక‌సారి మ‌నం ఎంచుకునే వ్య‌వ‌ధిని బ‌ట్టి చెల్లించాలి.పాల‌సీ క‌నీస కాల‌ప‌రిమితి ఐదేళ్లు మొద‌లుకొని గ‌రిష్టంగా 62 ఏళ్లుగా ఉంది. 18 ఏళ్ల వ‌య‌సు నుంచి మొద‌లుకొని 65 ఏళ్ల లోపు వారు పాల‌సీ తీసుకునేందుకు అర్హులు. పాల‌సీ క‌నీస బీమా హామీ మొత్తం రూ. 25 ల‌క్ష‌లు. పాల‌సీదారుకు అనుకోకుండా ఏదైనా జ‌రిగితే మొత్తం ప‌రిహారాన్ని చెల్లిస్తారు. అలా కాకుండా 100 నెల‌ల పాటు క్రమంగా కొంత మొత్తాన్ని తీసుకునేందుకు సైతం అవ‌కాశం ఉంది. ఇంకా వెసులుబాటు కావాలంటే మొద‌ట కొంత మొత్తాన్ని తీసుకుని మిగిలిన దాన్ని కొంత నిర్ణీత కాలం పాటు కొంత కొంత తీసుకోవ‌చ్చు.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ట‌ర్మ్ ప్లాన్ తీసుకునే వారికి ఆదాయపు ప‌న్ను చ‌ట్టం 80సీ కింద ల‌భించే ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. దీని కింద మ‌నం క‌ట్టిన ప్రీమియంల‌కు ప్ర‌భుత్వం తెలిపిన విధంగా పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ఆదాయపు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 10(10డీ) కింద మెచ్యూరిటీ బెనిఫిట్‌, డెత్ బెనిఫిట్‌, స్వాధీన విలువ‌(స‌రెండ‌ర్ వాల్యూ) మొద‌లైన వాటికి ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

ఏ ట‌ర్మ్ ప్లాన్ కొనేట‌ప్పుడు అయినా క్లెయిం సెటిల్‌మెంట్ ప్ర‌ధాన కార‌కంగా ఉండాలి. అంటే ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. అంతే కాకుండా ప్లాన్ ఉద్దేశం, ఫీచ‌ర్లు, ప్ర‌యోజ‌నాలు, ప్రీమియం వంటివ‌న్నీ జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి ఉత్త‌మ ట‌ర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవాలి.

English summary

best online term insurance plans

Term insurance is a must for a breadwinner of the family as that will take care of financial responsibility of the policy holder in the event of death.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC