For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్‌డీ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

|

ఒకేసారి మొత్తం కాకుండా అప్పుడ‌ప్పుడు కొంచెం డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టి పొదుపు చేయాల‌నుకునే వారికి ఆర్‌డీ(రిక‌రింగ్ డిపాజిట్‌) ఉత్తమంగా ఉంటుంది. పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌ల‌ను కొత్త‌గా ఆరంభించే వారికి సైతం ఆర్‌డీలు బెట‌ర్‌గా ఉంటాయి. బ్యాంకుల్లో ఆర్‌డీ కాల‌ప‌రిమితి క‌నీసం ఏడాది ఉంటుంది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఆర్‌డీ క‌నీస కాల‌ప‌రిమితి ఏడాది నుంచి మొద‌ల‌వుతుంది. పోస్టాఫీసు ఆర్‌డీల కాల‌ప‌రిమితి 5 ఏళ్లు ఉంటుంది. ఇంకా అద‌నంగా 5 ఏళ్ల పాటు కొన‌సాగించే వీలుంటుంది.
గ‌తేడాది కేంద్ర బ‌డ్జెట్‌లో బ్యాంక్ ఆర్‌డీల‌కు సైతం టీడీఎస్ అమ‌ల‌వుతుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. పోస్టాఫీసు ఆర్‌డీల‌కు అలా ఏమీ ఉండ‌దు. ఇలాంటి ప‌లు వ్యత్యాసాల‌ను కింద తెలుసుకుందాం.

పోస్టాఫీసు ఆర్‌డీని ఎలా తెర‌వాలి?

పోస్టాఫీసు ఆర్‌డీని ఎలా తెర‌వాలి?

మీ ద‌గ్గ‌ర్లోని పోస్టాఫీసుకు వెళ్లి రిక‌రింగ్ డిపాజిట్ ఫారంను నింపండి. పే ఇన్ స్లిప్ మీద వివ‌రాల‌ను న‌మోదు చేసి సంత‌కం చేసి మొద‌టి చెల్లింపును చేయండి. సీనియ‌ర్ సిటిజ‌న్లు ప్ర‌త్యేక ఫారంను నింపాల్సి ఉంటుంది. రిక‌రింగ్ డిపాజిట్‌ను మైన‌ర్ పేరిట సైతం తెర‌వొచ్చు. 10 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన మైన‌ర్ల పేరిట ఖాతా తెరిచి వారిచేత ఆప‌రేట్ చేయించ‌వ‌చ్చు. ఈ ఖాతాల‌ను ఒక పోస్టాఫీసు నుంచి మ‌రో పోస్టాఫీసు సైతం బ‌దిలీ చేసుకునే వీలుంటుంది. 6 నెల‌ల ఇన్‌స్టాల్‌మెంట్ల‌ను ముందుగానే చెల్లిస్తే పోస్టాఫీసు మీకు రిబేట్‌ను ఇస్తుంది. ఇద్ద‌రు క‌లిసి ఉమ్మ‌డి ఖాతాను సైతం తెరిచేందుకు ఆర్‌డీల్లో వీలుంటుంది. సింగిల్ అకౌంట్‌ను ఉమ్మ‌డి ఖాతాగా, ఉమ్మ‌డి ఖాతాను సింగిల్ అకౌంట్‌గా మార్చుకునే సౌల‌భ్యం ఉంది.

విత్‌డ్రాయ‌ల్ ఎలా?

విత్‌డ్రాయ‌ల్ ఎలా?

ఒక ఏడాది త‌ర్వాత మొత్తం బ్యాలెన్స్‌లో 50% వ‌ర‌కూ ఖాతాదారుడు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమ‌తిస్తారు. ఒక వేళ డిపాజిట్ దారుడు చ‌నిపోతే కొన్ని ష‌ర‌తుల‌తో రూ. 50 మొత్తాల్లో తీసుకునేందుకు అనుమ‌తిస్తారు.

పోస్టాఫీసులో రిక‌రింగ్ డిపాజిట్‌ చేయడం ఏ విధంగా మేలు?

పోస్టాఫీసులో రిక‌రింగ్ డిపాజిట్‌ చేయడం ఏ విధంగా మేలు?

బ్యాంకు రిక‌రింగ్ డిపాజిట్ల‌లో రూ. 10 వేల కంటే వ‌డ్డీ ఎక్కువ వ‌స్తే టీడీఎస్ అమ‌ల‌వుతుంది. అదే పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ల‌కు అయితే టీడీఎస్ మిన‌హాయింపు ఉంటుంది. రిక‌రింగ్ డిపాజిట్ పైన వ‌చ్చే మొత్తం వ‌డ్డీపైన బ్యాంకు ప‌న్ను(టీడీఎస్‌) క‌ట్ చేస్తుంది.

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్‌పై ప‌న్ను వ‌ర్తింపులు ఎలా?

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్‌పై ప‌న్ను వ‌ర్తింపులు ఎలా?

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ల‌కు వ‌చ్చే వ‌డ్డీపై టీడీఎస్ ఉండ‌దు. అయితే ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేసేట‌ప్పుడు ఇత‌ర వ‌న‌రుల నుండి(Income from another sources) వ‌చ్చే ఆదాయం కింద దాని గురించి తెల‌పాల్సి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మొత్తం మీ ఆదాయంలో భాగంగా ఆర్‌డీ వ‌డ్డీకి ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తించ‌దు. కేవ‌లం టీడీఎస్ మిన‌హాయింపు మాత్ర‌మే ఉండ‌గ‌ల‌దు.

ఆర్‌డీ చెల్లింపులు క్ర‌మంగా చేయ‌క‌పోతే

ఆర్‌డీ చెల్లింపులు క్ర‌మంగా చేయ‌క‌పోతే

అంటే మీరు ఎంచుకున్న క్రమానుగ‌త స‌మ‌యానికి(రెగ్యుల‌ర్ ఇంట‌ర్వెల్‌) క‌చ్చితంగా డ‌బ్బు డిపాజిట్ చేయాలి. ఒక‌వేళ మీరు అలా చేయ‌క‌పోతే ప్ర‌తి రూ. 5 కు 5 పైస‌ల పెనాల్టీతో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇలా వ‌రుస‌గా నాలుగుసార్లు మీరు టైమ్‌కు డిపాజిట్ చేయ‌క‌పోతే రిక‌రింగ్ డిపాజిట్‌ను హోల్డ్‌లో ఉంచుతారు. అలాంట‌ప్పుడు ఖాతాను రెండు నెల‌ల్లోపు పున‌రుద్ద‌రించుకోవాలి. అలా 2 నెల‌ల్లోపు చేయ‌క‌పోతే త‌ర్వాత డిపాజిట్ చేసేందుకు అనుమ‌తించ‌రు. ఖాతాను పున‌రుద్ద‌రించుకునేట‌ప్పుడు మొద‌ట డిఫాల్ట్‌(పెండింగ్‌) ఉన్న డిపాజిట్ సొమ్మును పెనాల్టీతో స‌హా క‌ట్టి ప్ర‌స్తుత నెల డిపాజిట్‌ను చేయాలి.

కాంపౌండింగ్ అడ్వాంటేజ్‌

కాంపౌండింగ్ అడ్వాంటేజ్‌

ప్ర‌స్తుతం మీరు 7.4% వ‌డ్డీకి ఆర్‌డీలో 10 రూపాయ‌ల‌ను పెట్టుబ‌డి పెడితే ఐదేళ్ల మెచ్యూరిటీ త‌ర్వాత అది రూ.726.97 అవుతుంది. దాన్ని ఐదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఐదేళ్ల‌కు కొన‌సాగించ‌వచ్చు. ప్ర‌స్తుతానికి త్రైమాసికానికి ఒక‌సారి వ‌డ్డీ కాంపౌండ్(చ‌క్ర‌వ‌డ్డీ) అవుతోంది. అయితే పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ల‌కు ప్ర‌భుత్వం వ‌డ్డీరేట్ల‌ను మూడు నెల‌ల‌కొక‌సారి మారుస్తూ ఉంటుంది.

సాధార‌ణంగా ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఆర్‌డీల కంటే 0.25% నుంచి 0.50% వ‌ర‌కూ పోస్టాఫీసు ఆర్‌డీ వ‌డ్డీ రేటు ఎక్కువ ఉండొచ్చు.

Read more about: rd recurring deposit post office
English summary

ఆర్‌డీ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి | which is better among post office RD or bank RD

Recurring deposit is the best to start with as it will help an investor with systematic and disciplined investment process. Individuals who are new to investing can start with recurring deposit. In banks, the tenure of the RD starts with minimum 1 year. RD in post office would be maintained for 5 years and can be extended for another 5 years
Story first published: Tuesday, October 4, 2016, 10:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X