For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్ర‌య‌ల్స్‌లోనే దూసుకెళ్తున్న రిల‌య‌న్స్ జియో

|

రిల‌య‌న్స్ జియో విస్త‌ర‌ణ‌కు కొత్త మార్గాల‌ను అన్వేషిస్తోంది. మార్కెట్‌లోకి రానున్నామ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి రిల‌య‌న్స్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. రిల‌య‌న్స్ డిజిట‌ల్ స్టోర్స్‌, డిజిట‌ల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్ల‌లో ఉచిత జియో టెస్ట్ సిమ్‌ను అందిస్తోంది. దీంతో మొబైల్ గొలుసు దుకాణాలైన బిగ్‌సీ, లాట్ మొబైల్ స్టోర్ల‌లో 4జీ ఫోన్ల‌ను కొనేందుకు జ‌నం విప‌రీతంగా ఆస‌క్తిని చూపుతున్నారు. కొన్ని మొబైల్ ఫోన్ల కొనుగోలుతో జియో సిమ్‌ను ఉచితంగా అంద‌జేయ‌డ‌మే దీనికి కార‌ణం. జియో ద్వారా 90 రోజుల అన్‌లిమిటెడ్ డేటాను ఉచితంగా అందించ‌నుండ‌టం టెలికాం రంగంలో ఒక సంచ‌ల‌నం. ఇంకా ఈ జియో ఇన్ఫోకామ్‌ ప్ర‌క‌ట‌న త‌ర్వాత జ‌రిగిన స‌త్వ‌ర మార్పుల‌ను, సిమ్ ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకుందాం.

రిల‌య‌న్స్ జియో ఆఫ‌ర్లు

రిల‌య‌న్స్ జియో ఆఫ‌ర్లు

సిమ్ ప్రివ్యూ ఆఫ‌ర్లో భాగంగా ఉచిత 4జీ ఇంట‌ర్నెట్‌, VoLTE వాయిస్ కాలింగ్‌, వీడియో కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్‌ల‌ను 90 రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

జియో సిమ్ ఇత‌ర ఫీచ‌ర్లు

జియో సిమ్ ఇత‌ర ఫీచ‌ర్లు

జియో సిమ్ కొనుగోలు చేసిన వారికి జియో ప్లే, జియోఆన్‌డిమాండ్‌, జియోబీట్స్,జియోమ్యాగ్స్‌, జియోఎక్స్‌ప్రెస్ న్యూస్, జియోడ్రైవ్‌,జియో సెక్యూరిటీ, జియో మ‌నీ వంటి అద‌న‌పు సేవ‌ల‌ను వాడుకునే అవ‌కాశం ఉంది. జియోఆన్‌డిమాండ్‌లో సినిమాలు, టీవీ షోలు,లైవ్ టీవీ వంటి సౌక‌ర్యాలు ఉంటాయి.

ఏఏ పోన్ల‌లో

ఏఏ పోన్ల‌లో

ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ఆఫ‌ర్ శ్యామ్‌సంగ్‌, ఎల్‌జీ,పనాసోనిక్‌, మైక్రోమ్యాక్స్‌, ఆసుస్‌, టీసీఎల్‌, అల్కాటెల్‌, లైఫ్ మొబైల్ ఫోన్ల‌లో ఈ ఆఫ‌ర్‌ను టెస్టింగ్ ఫేజ్‌లో అందిస్తున్నారు. జియో కొత్త 4జీ-ఎల్‌టీఈ, అన్ని ఐపీ ఆధారిత నెట్‌వ‌ర్క్‌ల ద్వారా ఇత‌ర స్మార్ట్‌ఫోన్ల‌కు విస్త‌రిస్తున్నారు.

 రిల‌య‌న్స్ జిమ్ సిమ్ ఎలా తెచ్చుకోవాలి? (యాప్ ద్వారా)

రిల‌య‌న్స్ జిమ్ సిమ్ ఎలా తెచ్చుకోవాలి? (యాప్ ద్వారా)

ప్లేస్టోర్‌లోకి వెళ్లి మైజియో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

యాప్‌లో బ్యాన‌ర్‌లోకి వెళ్లి ‘గెట్ జియో సిమ్‌'పై క్లిక్ చేయాలి.

అగ్రీ అనే బ‌ట‌న్‌పైన క్లిక్ చేస్తే రిల‌య‌న్స్ జియో సిమ్ ఆఫ‌ర్ వ‌స్తుంది.

డ్రాప్ డౌన్ ఫీచ‌ర్లో మీ లొకేష‌న్ వివ‌రాలివ్వాలి.

అక్క‌డ నిర్దేశించిన విధంగా చేసిన త‌ర్వాత నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి

అప్పుడు రిల‌య‌న్స్ జియో సిమ్ ఆఫ‌ర్ కోడ్ ఫ్లాష్ అవుతుంది. దాన్ని రాసుకోండి

చిరునామా, వ్య‌క్తిగ‌త గుర్తింపు ధ్రువీక‌ర‌ణల కోసం మీరు కొన్ని డాక్యుమెంట్ల‌ను

స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. దీంతో కేవైసీ ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.

రిల‌య‌న్స్ స్టోర్‌కు వెళ్లి వారు సూచించిన డాక్యుమెంట్ల‌ను ఇస్తే మీరు సిమ్ పొందుతారు.

రిల‌య‌న్స్ జియో సిమ్ ప్ర‌భావం

రిల‌య‌న్స్ జియో సిమ్ ప్ర‌భావం

మార్కెట్లోకి రిలయ‌న్స్ రాక‌తో టెలికాం కంపెనీల‌న్నీ జాగ్ర‌త్త ప‌డుతున్నాయి. వ్యూహాలు ర‌చిస్తున్నాయి. గ‌త నెల రోజుల నుంచి ఉన్న డేటా ప్యాక్‌ల‌కే అద‌న‌పు డేటా ఆఫ‌ర్లు ఇవ్వ‌డం లేదా డేటా ప్యాక్‌ల ధ‌ర‌లు త‌గ్గించ‌డం చేస్తున్నాయి. ఎందుకంటే ఒక‌సారి క‌స్ట‌మ‌ర్ బేస్ పోతే మ‌ళ్లీ సంపాదించుకోవ‌డం క‌ష్టం. అందుకే ప్ర‌ముఖ టెలికాం కంపెనీల‌న్నీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. దీంతో అంతిమంగా వినియోగదారుడికి మేలు జ‌రిగితే మంచిదే. ఈ క్ర‌మంలోనే వోడాఫోన్‌, ఐడియా సంయుక్తంగా ఒక సంస్థ‌ను ఏర్పాటు చేస్తాయ‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే విలీనం దిశ‌గా ఎటువంటి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌ట్లేద‌ని గురువారం ఐడియా సెల్యూలార్ వివ‌ర‌ణ ఇచ్చింది.

90 రోజుల త‌ర్వాత ఏమ‌వుతుంది?

90 రోజుల త‌ర్వాత ఏమ‌వుతుంది?

మొద‌టి 90 రోజుల పాటు సేవ‌ల‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఆ త‌ర్వాత టారిఫ్ ప్లాన్ల‌ను ఎంచుకోవ‌డానికి వినియోగ‌దారుడికి అవ‌కాశం క‌ల్పిస్తారు. అందుక‌నుగుణంగా ప్లాన్ల‌ను రీచార్జీ చేయించుకోవాలి. అయితే ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం మేర‌కు ఒక ఎంబీ డేటాకు 50 పైస‌లు చార్జీ చేస్తార‌ని భావిస్తున్నారు.

వాణిజ్య‌ప‌ర‌మైన సేవ‌ల ప్రారంభం

వాణిజ్య‌ప‌ర‌మైన సేవ‌ల ప్రారంభం

నిజానికి ఆగ‌స్టు 15నే వాణిజ్య సేవ‌ల‌ను ప్రారంభించ‌వ‌ల‌సి ఉంది. ఇప్పుడు మార్కెట్లో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం చూస్తే రిల‌య‌న్స్ సాధార‌ణ వార్షిక స‌మావేశం(యాన్యువ‌ల్ జ‌న‌ర‌ల్ మీటింగ్‌) రోజైన సెప్టెంబ‌రు 1న ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని అనుకుంటున్నారు. వినియోగ‌దారుల్లాగే షేర్ హోల్డ‌ర్లు సైతం ఈ ప్ర‌క‌ట‌న కోసం ఆతుర‌త‌తో ఎదురుచూస్తున్నారు.

Read more about: reliance jio 4g
English summary

ట్ర‌య‌ల్స్‌లోనే దూసుకెళ్తున్న రిల‌య‌న్స్ జియో | All things you want to know about Reliance Jio

Reliance Jio’s 4G Preview offer, which gives access to free 4G internet, VoLTE voice-calling, video-calling and SMS for 90 days, is now opening up to more and more smartphones
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X