For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోల్పోయే వాటి కంటే కొత్త‌గా వ‌చ్చే ఉద్యోగాలే ఎక్కువ‌: నాస్కామ్‌

|

ఒక ప‌క్క ఆటోమేష‌న్ వ‌ల్ల వేల ఉద్యోగాలు కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని బెంబేలెత్తిపోతున్న త‌రుణంలో ఆటోమేష‌న్‌, ఐవోటీ(ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్‌), బిగ్ డేటా వాటి వ‌ల్ల కొత్త‌గా చాలా ఉద్యోగాలు వ‌స్తాయ‌ని నాస్కామ్ అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్.ఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఐటీ-బీపీఓ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన అత్యున్న‌త వ్యాపార సంస్థ నాస్కామ్. దేశంలో ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ‌ల‌న్నీ దాదాపుగా ఇందులో రిజిస్ట‌ర్ అయి ఉంటాయి. చేసిన ప‌నే మ‌ళ్లీ చేసే క్ర‌మంలో ముందుగా ఫ‌లితాల‌ను ఊహించ‌గ‌లిగిన వాటినన్నింటినీ ఆటోమేష‌న్ దిశ‌గా న‌డిపిస్తున్నారు. కొత్త టెక్నాల‌జీలైన బిగ్ డేటా, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ వంటివి కొత్త ఉద్యోగాల‌ను సృష్టిస్తాయ‌ని నాస్కామ్ అధ్య‌క్షుడు వెల్ల‌డించారు.

కోల్పోయే వాటి కంటే కొత్త‌గా వ‌చ్చే ఉద్యోగాలే ఎక్కువ‌

కొన్ని ఉద్యోగాలు పోయిన‌ప్ప‌టికీ కొత్త‌గా వ‌చ్చే ఉద్యోగాలు అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటాయ‌ని చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. టెక్నాల‌జీ ఎప్ప‌టికైనా ఉద్యోగాలు క‌ల్పించ‌డంలోనే దోహ‌ద‌ప‌డింద‌ని ఆయ‌న చెప్పారు. రాత్రికి రాత్రే కొత్త‌గా స‌త్వ‌ర మార్పులేమీ జ‌ర‌గ‌వు. ప‌రిశ్ర‌మ‌లో ఉన్న మొత్తం ట్రెండ్ వ్యాపార విలువ‌ను సృష్టించ‌గ‌ల‌దన్నారు. కాలంతో త‌గ్గ మార్పుల‌కు ప‌రిశ్ర‌మ అల‌వాటు ప‌డుతూ భ‌విష్య‌త్తుకు త‌గ్గ‌ట్టుగా సిద్ద‌మ‌వుతోందని ఆయ‌న తెలిపారు. నాస్కామ్ 2017 ఆర్థిక సంవ‌త్స‌రం వృద్దిని 10 నుంచి 12 శాతంగా అంచ‌నా వేస్తోంది. ఇది 2016 ఆర్థిక సంవ‌త్స‌రంలో అంచ‌నా వేసిన 12-14 శాతం కంటే త‌క్కువే.

English summary

కోల్పోయే వాటి కంటే కొత్త‌గా వ‌చ్చే ఉద్యోగాలే ఎక్కువ‌: నాస్కామ్‌ | Technology has always ended up creating new jobs

New technologies like automation, Internet of Things and artificial intelligence are driving a big change in the IT industry landscape. And add to that the turbulence in the global economy and some sectors like energy in particular.
Story first published: Saturday, August 20, 2016, 15:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X