For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను త‌గ్గించేందుకు 9 మార్గాలు

విప‌రీత‌మైన షాపింగ్ అల‌వాటుతో అవ‌స‌రం లేని వాటిని కొంటున్నారు. మీ ఖ‌ర్చుల‌ను కింది కొన్ని మార్గాల ద్వారా త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. మొద‌ట కొంచెం క‌ష్టంగానే ఉన్న‌ప్ప‌టికీ ఒక‌సారి పొదుపు చేయ‌డం

|

రోజువారీ ఉద్యోగంలో జీతం పెర‌గ‌డం ఒక్క‌టే ముఖ్యం కాదు. మ‌న ఖ‌ర్చులు స‌క్ర‌మంగా ఉంటే ఆదాయ సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది. ప్ర‌స్తుతం ఎంతో మంది యువ‌తీ యువ‌కులు చాలా ఎక్కువ‌గానే సంపాదిస్తున్న‌ప్ప‌టికీ పొదుపు ద‌గ్గ‌రికి వ‌చ్చే సరికి మాత్రం విఫ‌ల‌మ‌వుతున్నారు. విప‌రీత‌మైన షాపింగ్ అల‌వాటుతో అవ‌స‌రం లేని వాటిని కొంటున్నారు. మీ ఖ‌ర్చుల‌ను కింది కొన్ని మార్గాల ద్వారా త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. మొద‌ట కొంచెం క‌ష్టంగానే ఉన్న‌ప్ప‌టికీ ఒక‌సారి పొదుపు చేయ‌డం మొద‌లెడితే అది అలవాటుగా మారిన త‌ర్వాత బాగా ఉంటుంది.

1. ఖ‌ర్చుకు ముందే పొదుపు

1. ఖ‌ర్చుకు ముందే పొదుపు

వేత‌నం అందుకోవ‌డం మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి క్ర‌మంగా ఒక రిక‌రింగ్ డిపాజిట్ లేదా మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. లేదా కొంత సొమ్ము జ‌మ చేసి ఎఫ్‌డీ చేయ‌వ‌చ్చు. లేదా ఒక వ‌స్తువు కొనేందుకు కొంచెం డ‌బ్బును కూడ‌బెట్ట‌వ‌చ్చు. ఇందుకోసం ఆటో స్వీప్ ఇన్ అకౌంట్ వంటి స‌దుపాయాల‌ను సైతం ఉప‌యోగించుకోవ‌చ్చు.

 2. ప్లాస్టిక్ క‌రెన్సీ వాడ‌కం

2. ప్లాస్టిక్ క‌రెన్సీ వాడ‌కం

ఎక్కువ‌గా క్రెడిట్ కార్డుల వాడ‌కం వ‌ల్ల కొన్ని చోట్ల ఎంత ఖ‌ర్చుపెడుతున్నామో నియంత్ర‌ణ లేకుండా పోతోంది. అందుకే వీలైన చోట్ల న‌గ‌దు చెల్లించ‌డానికి ప్ర‌య‌త్నించండి. మామూలుగా కార్డుతో చెల్లింపులు చేసేట‌ప్పుడు షాపింగ్‌లో అన‌వ‌స‌ర‌మైన‌వి, ఖర్చు మీద స్ప‌ష్ట‌త లేకుండా కొంటూ ఉంటారు.

 3. బ‌డ్జెట్ త‌యారీ

3. బ‌డ్జెట్ త‌యారీ

ఒక నెల‌వారీ బ‌డ్జెట్ త‌యారు చేసుకుంటే మంచిది. రోజువారీ ఖ‌ర్చుల‌ను అందులో పొందుప‌రిస్తే అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చుల‌ను సులువుగా గుర్తించ‌వ‌చ్చు. ప్రస్తుతం మొబైల్ యాప్‌ల ద్వారా మ‌న ఖ‌ర్చుల‌న్నింటినీ నోట్ చేసుకోవ‌చ్చు. ఖ‌ర్చుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించుకోవ‌చ్చు.

4. విలాస‌మైన వ‌స్తువుల‌కు దూరంగా

4. విలాస‌మైన వ‌స్తువుల‌కు దూరంగా

మ‌న‌కు అవ‌స‌రాల ఆధారంగా వ‌స్తువులు కావాలి. విలాసాల కోసం కాదు. విలాస‌మైన వ‌స్తువులు తాత్కాలికంగా ఆనందాన్నిచ్చినా దీర్ఘ‌కాలంలో మ‌న‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువులు కొంటేనే మంచిది.

5. ఆన్‌లైన్ చెల్లింపుల‌పై దృష్టి

5. ఆన్‌లైన్ చెల్లింపుల‌పై దృష్టి

ఈ-కామ‌ర్స్ విప్ల‌వం త‌ర్వాత చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌ను సౌక‌ర్య‌వంతంగా ఫీల‌వుతున్నారు. ఇది స‌మ‌యం ఆదా ప‌రంగా, రేటు త‌క్కువ ఉంటే మంచిదే. అయితే మ‌న అవ‌స‌రాల‌ను బ‌ట్టి వ‌స్తువుల‌ను కొనాలి. ఆఫ‌ర్లు, రాయితీల‌ను బ‌ట్టి ఏవి ప‌డితే అవి కొన‌కుండా చూసుకోవాలి.

 6. అత్య‌వ‌స‌ర నిధి

6. అత్య‌వ‌స‌ర నిధి

కొంచెం డ‌బ్బును ప‌క్క‌న పెట్టి అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పరచుకోవాలి. దాన్ని అత్య‌వ‌స‌రాల్లోనే వినియోగించేలా ప్ర‌ణాళిక ఉండాలి. అత్య‌వ‌స‌ర నిధి కంటే ఎక్కువ ఉన్న డ‌బ్బును పెట్టుబ‌డుల‌కు ఉప‌యోగించాలి.

 7. స్టేట్‌మెంట్లు చూడాలి

7. స్టేట్‌మెంట్లు చూడాలి

ప్ర‌తి నెలా బ్యాంకు స్టేట్‌మెంట్లు, క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లు చూడాలి. అలా చూడ‌టం వల్ల మీ ఖ‌ర్చుల‌పై ఒక స‌మ‌గ్ర అవ‌గాహ‌న రావ‌డానికి అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గుతాయి.

8. యాప్‌ల వాడ‌కం

8. యాప్‌ల వాడ‌కం

బ్యాంకింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఫైనాన్స్ యాప్‌లు కొన్ని బ‌డ్జెట్ వేసుకునేందుకు, ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేసుకునేందుకు వీలు క‌ల్పిస్తున్నాయి. అయితే ఖ‌ర్చుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఇందులో న‌మోదు చేయాలి. కొన్ని యాప్‌లు బ్యాంకు ఖాతాల‌తో అనుసంధాన‌మై ఉండి, డెబిట్‌,క్రెడిట్‌లు ఎప్పుడు జ‌రిగినా అందులో చూపిస్తాయి.

9. ట్రెండ్ పిచ్చిలో ప‌డిపోకూడ‌దు.

9. ట్రెండ్ పిచ్చిలో ప‌డిపోకూడ‌దు.

ఫ్యాష‌న్ అనేది నిరంత‌రం మారుతూ ఉంటుంది. దాని ప్ర‌కారం లేటెస్ట్ ట్రెండ్ అనుస‌రించాలంటే బాగా ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది. సంద‌ర్భానికి త‌గ్గ‌ వ‌స్త్ర‌ధార‌ణ‌, అప్పియ‌రెన్స్ ఉంటే చాలు. మిమ్మల్ని మీరు ఎలా మ‌ల‌చుకుంటారో అదే మీ ఫ్యాష‌న్‌.

English summary

అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను త‌గ్గించేందుకు 9 మార్గాలు | These habits you have to change to control unnecessary sepnding

As a person's earning capacity increases so does his spending habits. Young individuals despite earning a hefty salary are hardly able to save enough amount after monthly expenses.Here are simple steps to be followed to control spendings
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X