For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు పువ్వులు-ఆరుకాయ‌లుగా జ‌న్‌ధ‌న్ యోజ‌న‌

|

ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న ప‌థ‌కాన్ని ప్రారంభించి రెండేళ్ల‌యింది. దేశ ప్ర‌జ‌లంద‌రికీ బ్యాంకింగ్ సేవ‌లందించేందుకు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌తిపాదించిన జ‌న్‌ధ‌న్ యోజ‌న నెమ్మ‌దిగా ఫ‌లితాల‌ను రాబ‌డుతోంది. ఇప్ప‌టికి మొత్తం ఖాతాల్లోని నిల్వ‌లు రూ. 41723.30 కోట్ల‌కు చేరాయి. ఇందులో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల వాటా రూ. 33,060.53 కోట్లు ఉండ‌గా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వాటా రూ.7193.17 కోట్లుగాను, ప్ర‌యివేటు బ్యాంకుల్లో అతి త‌క్కువ‌గా రూ.1523.60 కోట్లుగాను ఉన్నాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల‌కు సంబంధించి ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో 24.47 శాతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 21.05 శాతం, ప్ర‌యివేటు బ్యాంకుల్లో 36.47 శాతంగా ఉన్నాయి. మొత్తం మీద బ్యాంకింగ్ రంగంలో చూస్తే ఈ ప‌థ‌కం కింద ఉన్న జీరో బ్యాలెన్స్ ఖాతాలు 24.31 శాతంగా ఉన్నాయి.
మొత్తానికి సున్నా నిల్వ ఉన్న ఖాతాల సంఖ్య త‌గ్గ‌డం శుభ‌సూచ‌కం. ఈ నేప‌థ్యంలో ఈ ప‌థ‌కం గురించి స‌మ‌గ్రంగా తెలుసుకుందాం.

ప‌థ‌కం ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాలు

ప‌థ‌కం ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాలు

1. డిపాజిట్ల‌పై వ‌డ్డీ వ‌స్తుంది.

2. రూ. 1 ల‌క్ష‌ ప్ర‌మాద బీమా

3. ఎటువంటి క‌నీస నిల్వ అవ‌స‌రం లేదు.

4. దేశంలో ఎక్క‌డైనా దీని ద్వారా ఆన్‌లైన్ న‌గ‌దు బ‌దిలీ చేసుకునే వీలు

5. ప్ర‌త్యక్ష న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం ద్వారా ఈ ఖాతాల్లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్దిని పొంద‌వ‌చ్చు

6. ఖాతాను 6 నెల‌లు నిర్వ‌హించుకున్న త‌ర్వాత అందుబాటులోకి ఓవ‌ర్‌డ్రాఫ్ట్ స‌దుపాయం

7. పింఛ‌ను, బీమా ప‌థ‌కాలు

8. రూ. 30 వేల జీవిత బీమా

ప‌థ‌కం విజ‌యాలు

ప‌థ‌కం విజ‌యాలు

ప‌థ‌కం ప్రారంభం రోజే 1 కోటి 50 ల‌క్ష‌ల మంది ఖాతాలు తెరిచారు. సెప్టెంబ‌రు 2014 నాటికి 3.02 కోట్ల ఖాతాల‌కు పెరిగాయి. జ‌న‌వ‌రి 26,2015 నాటికి ఖాతాల సంఖ్య 10 కోట్ల‌కు చేరింది. ఒక వారంలో అత్య‌ధిక బ్యాంకు ఖాతాలు తెరిచిన కార‌ణంగా జ‌న‌వ‌రి 20 న ఈ ప‌థ‌కం గిన్నిస్ రికార్డుల‌కెక్కింది. ఈ ప‌థ‌కంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్, వెస్ట్‌బెంగాల్ అత్య‌ధికంగా 29% ఖాతాల‌ను తెరిచాయి. కేర‌ళ, గోవా రాష్ట్రాలు ప్ర‌తి కుటుంబంలో ఒక‌రికి బ్యాంకు ఖాతా ఉండేలా చేయ‌డంలో స‌ఫ‌లీకృత‌మ‌య్యాయి.

 ఓవ‌ర్‌డ్రాఫ్ట్

ఓవ‌ర్‌డ్రాఫ్ట్

21 ల‌క్ష‌ల ఖాతాదార్లు 279 కోట్ల రూపాయ‌ల‌ను ఓవ‌ర్‌డ్రాఫ్ట్ రూపంలో పొందారు. మొత్తం 37ల‌క్ష‌ల మందికి ఈ స‌దుపాయం క‌ల్పించ‌గా 21 ల‌క్ష‌ల ఖాతాదార్లు దీన్ని వినియోగించుకున్నారు. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు, కెన‌రా బ్యాంకు, ఎస్‌బీఐ ఎక్కువ ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ల‌ను అందించిన వాటిలో ముందు వ‌రుస‌లో ఉన్నాయి.

 ఖాతాలు- ప‌లు సంఖ్య‌లు

ఖాతాలు- ప‌లు సంఖ్య‌లు

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 18.68 కోట్ల ఖాతాలుండ‌గా; వీటిలో 15.18 కోట్ల ఖాతాదార్ల‌కు రూపే కార్డుల‌ను జారీ చేశారు. 9.79 కోట్ల ఖాతాల‌ను ఆధార్‌తో అనుసంధానించారు. సున్నా నిల్వ ఖాతాలు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో 24.47 శాతం ఉండ‌గా మొత్తం నిల్వ‌లు 33060 కోట్ల‌కు పైగా ఉన్నాయి.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం 4.09 కోట్ల ఖాతాలుండ‌గా 2.85 కోట్ల ఖాతాల‌కు రూపే కార్డులు జారీ చేయగా కేవ‌లం 1.61 కోట్ల ఖాతాల‌ను మాత్ర‌మే ఆధార్‌తో అనుసంధానించారు. ప్రైవేటు బ్యాంకుల గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. మంచి వ్యాపార లబ్ది పొందే ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డానికి ముందుకొచ్చే కార్పొరేటు బ్యాంకులు, ప్ర‌యివేటు రంగ బ్యాంకుల‌న్నీ క‌లిసి కేవ‌లం 84 లక్ష‌ల ఖాతాల‌ను మాత్ర‌మే తెరిచాయంటే ఎంత ఆస‌క్తి క‌న‌బరుస్తున్నాయో తెలుస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 43,59,332 ఖాతాలు తెర‌వ‌గా; ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 33,01,767 ఖాతాలు తెరిచారు. మొత్తం 76.61 ల‌క్ష‌ల ఖాతాల్లో 856కోట్ల న‌గ‌దు నిల్వ‌లు ఉన్నాయి. ఇందులో 58.96 ల‌క్ష‌ల ఖాతాల‌ను ఆధార్‌తో అనుసంధానించ‌గా 65,3,948 మందికి రూపే కార్డుల‌నిచ్చారు.

17.69 ల‌క్ష‌ల ఖాతాల్లో సున్నా నిల్వ క‌లిగిన ఖాతాలు ఉన్నాయి.

తెలంగాణ‌

తెలంగాణ‌

కొత్త రాష్ట్రం తెలంగాణ‌లో మొత్తం ఖాతాలు 80 ల‌క్ష‌ల‌కు పైబ‌డి ఉన్నాయి. గ్రామీణ ఖాతాలు 46.51 ల‌క్ష‌లుండ‌గా, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 33.82 ల‌క్ష‌ల ఖాతాలున్నాయి. మొత్తం ఖాతాల్లో 987.34 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఆధార్ అనుసంధానం 59.17 ల‌క్ష‌ల ఖాతాల‌కు పూర్తవ్వ‌గా 69 ల‌క్ష‌ల ఖాతాదార్ల‌కు రూపే కార్డుల‌నిచ్చారు. సున్నా నిల్వ ఖాతాలు తెలంగాణలో 23.96 ల‌క్ష‌లున్నాయి.

English summary

మూడు పువ్వులు-ఆరుకాయ‌లుగా జ‌న్‌ధ‌న్ యోజ‌న‌ | Jan Dhan yojana completed 2 years

Run by Department of Financial Services, Ministry of Finance, on the inauguration day, 1.5 Crore (15 million) bank accounts were opened under this scheme.[2][3] Guinness World Records Recognises the Achievements made under PMJDY, Guinness World Records Certificate says "The most bank accounts opened in 1 week
Story first published: Monday, August 15, 2016, 12:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X