For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైద‌రాబాద్‌లో ఐకియా స్టోర్‌కు శంకుస్థాప‌న‌

|

స్వీడ‌న్‌కు చెందిన ప్ర‌ముఖ హోం ఫ‌ర్నిచ‌ర్ కంపెనీ ఐకియా భార‌త్‌లో తొలి విక్ర‌య‌కేంద్రానికి హైద‌రాబాద్‌లో శంకుస్థాప‌న చేసింది. 700 కోట్ల రూపాయలతో భాగ్య‌న‌గ‌రంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలి స్టోర్‌కు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, జిహెచ్‌ఎంసి మేయర్‌ బి రామ్మోహన్‌, స్వీడన్ రాయ‌బార కార్యాల‌యానికి చెందిన సీనియర్‌ అధికారుల సమక్షంలో భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. 4 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యంతో నిర్మిస్తున్న హైద‌రాబాద్ స్టోర్ 2017 అక్టోబ‌ర్ మాసానికి సిద్ద‌మ‌వుతుంద‌ని ఐకియా ఇండియా సీఈవో జువెన్సియా మ‌జ్తు చెప్పారు. దీని త‌ర్వాత బెంగుళూరు, దిల్లీ న‌గ‌రాల్లో త‌మ త‌దుప‌రి స్టోర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.
భూమి పూజ కార్యక్రమం తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారతదేశంతో ఐకియా వ్యాపార అనుబంధం 30 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం ఇక్క‌డ‌ నుంచి 30 కోట్ల యూరోల విలువైన వస్తువులను సమీకరించి ఐకియా తన స్టోర్స్‌ ద్వారా విక్రయిస్తోందని ఆయన వెల్ల‌డించారు.

హైద‌రాబాద్‌లో ఐకియా

ఐకియా హైద‌రాబాద్ స్టోర్ కోసం రూ. 700 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. 4,00,000 చ‌ద‌ర‌పు అడుగులు క‌లిగిన ఈ కేంద్రం ప్ర‌త్య‌క్షంగా 500 మందికి, ప‌రోక్షంగా 1500 మందికి ఉపాధి క‌ల్పించ‌గ‌ల‌ద‌ని అంచ‌నా. భారత్‌లోనూ స్టోర్స్‌ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి సోర్స్‌ చేసే వస్తువుల విలువ వచ్చే మూడునాలుగేళ్ల కాలంలో 60 కోట్ల యూరోలకు చేరే అవకాశం ఉందని మ‌జ్తు చెప్పారు. ఐకియా అంతర్జాతీయంగా ఒక విలువల చట్రంలో పనిచేస్తుందని చెప్పారు. వినియోగదారుల జీవితాలను మరింత సౌకర్యవంతం చేయడమే తమ వ్యాపార లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌ తర్వాత నవీ ముంబైలోనూ ఐకియా స్టోర్‌ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే స్థల సమీకరణ పూర్తి చేశారు. వచ్చే పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 25 స్టోర్స్‌ ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు జువెన్సియో చెప్పారు. భారతలో 11 వేల కోట్ల రూపాయలపైగా పెట్టుబడి పెట్టేందు కు ఐకియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జిఎ్‌సటి బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడం, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు శుభసంకేతమని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. ఐకియా 28 దేశాల్లో 238 స్టోర్స్‌ నిర్వహిస్తోంది.

English summary

హైద‌రాబాద్‌లో ఐకియా స్టోర్‌కు శంకుస్థాప‌న‌ | Ikea want to expand pan India

IKEA Group, the leading Swedish home furnishings company, plans to open 25 stores over next 10 years in India. It also plans to double its sourcing from India to 600 million euros by 2020. Hyderabad store is in 13 acres which is nearer to Hitech city.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X