For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ లావాదేవీల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ క‌న్ను

|

ఏప్రిల్ 1 నుంచి పెద్ద మొత్తాల్లో జ‌రిగే లావాదేవీలు, న‌గ‌దు రూపంలో జ‌రిగే చెల్లింపుల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప‌రిశీలిస్తోంది. ఇందులో న‌గ‌దు ర‌సీదులు, క్యాష్ విత్‌డ్రాయ‌ల్స్‌, షేర్ల కొనుగోలు, స్థిరాస్తి లావాదేవీలు, ట‌ర్మ్ డిపాజిట్లు, మ్యూచువ‌ల్ ఫండ్లు, ఫారిన్ క‌రెన్సీ అమ్మ‌కం వంటివి ఉన్నాయి.
ఒక నిర్ణీత ఫార్మ‌ట్‌లో వీటిని ఆన్‌లైన్‌లో ఎప్పటిక‌ప్పుడు నివేదిస్తారు. ప్ర‌తి వ్య‌క్తీ రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేట‌ప్పుడు
అధిక మొత్తంలో జ‌రిపిన లావాదేవీల‌న్నింటినీ నివేదించాల్సి ఉంటుంది. ఒక‌వేళ అలా చేయ‌క‌పోతే మీకు నోటీసులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాంటి ఆస్కారం ఉన్న లావాదేవీల‌ను ఇక్క‌డ చూద్దాం.

 స్థిరాస్తి కొనుగోలు, అమ్మ‌కాలు

స్థిరాస్తి కొనుగోలు, అమ్మ‌కాలు

రూ. 30 ల‌క్ష‌ల‌కు మించి విలువ క‌లిగిన స్థిరాస్తి కొనుగోలు, అమ్మ‌కం సంబంధిత లావాదేవీల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారుల‌కు తెలియ‌జేస్తారు.

వృత్తి నిపుణులు

వృత్తి నిపుణులు

వృత్తి నిపుణులు సాధార‌ణంగా న‌గ‌దు రూపంలోనే లావాదేవీలు జ‌రుపుతూ ఉంటారు. రూ. 2 ల‌క్ష‌ల‌కు పైబ‌డి వ‌స్తు, సేవ‌ల‌కు సంబంధించి తీసుకునే రుసుముల‌ను, జ‌రిపే న‌గ‌దు లావాదేవీల‌ను వృత్తి నిపుణులు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు వెల్ల‌డించాలి.

బ్యాంకు న‌గ‌దు డిపాజిట్లు

బ్యాంకు న‌గ‌దు డిపాజిట్లు

ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ ఖాతాల్లో ఒక వ్య‌క్తి రూ. 10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఏడాది కాలంలో డిపాజిట్ చేసి ఉంటే ఆ వివ‌రాల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు తెలియ‌ప‌ర‌చాలి.

 ట‌ర్మ్ డిపాజిట్లు

ట‌ర్మ్ డిపాజిట్లు

ఒక వ్య‌క్తి బ్యాంకు ట‌ర్మ్ డిపాజిట్ల‌లో ఏడాది కాలంలో రూ. 10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ డ‌బ్బు పొదుపు చేసి ఉంటే బ్యాంకులు ఆ స‌మాచారాన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు అందించాలి. వీటిలో పోస్టాఫీసు ఖాతాల్లో చేసిన డిపాజిట్లు, విత్‌డ్రాయ‌ల్స్ సైతం ఉంటాయి.

క‌రెంట్ ఖాతా డిపాజిట్లు

క‌రెంట్ ఖాతా డిపాజిట్లు

ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 50 ల‌క్ష‌ల‌కు మించి చేసే న‌గ‌దు డిపాజిట్లు, విత్‌డ్రాయ‌ల్స్ వివ‌రాల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ సేక‌రిస్తుంది. ప్ర‌తి లావాదేవీని స్వ‌చ్చందంగా తెలియ‌జేస్తే నోటీసులు వ‌చ్చే ఇబ్బందులు త‌ప్పుతాయి.

 బ్యాంకు డ్రాఫ్ట్‌లు

బ్యాంకు డ్రాఫ్ట్‌లు

బ్యాంకు డ్రాఫ్ట్ లేదా ఏదైనా ఆర్‌బీఐ జారీ చేసే ప్రీపెయిడ్ న‌గదు సాధ‌నం కొనుగోలు కోసం రూ. 10 ల‌క్ష‌లు వెచ్చించి ఉంటే ఆ వివ‌రాలు ఆదాయ‌పు ప‌న్ను శాఖకు బ్యాంకు ద్వారా వెళతాయి.

ఫైనాన్సియ‌ల్ సెక్యూరిటీస్‌

ఫైనాన్సియ‌ల్ సెక్యూరిటీస్‌

ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక వ్య‌క్తి షేర్లు, బాండ్లు, మ్యూచువ‌ల్ ఫండ్లు వంటి వాటిలో రూ. 10 ల‌క్ష‌ల‌కు మించి పెట్టుబ‌డులు పెట్టి ఉంటే ఆయా కంపెనీలు ఆ లావాదేవీల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు నివేదించాల్సి ఉంది.

 క్రెడిట్ కార్డు చెల్లింపు

క్రెడిట్ కార్డు చెల్లింపు

రూ. 2 ల‌క్ష‌ల‌కు మించి చేసే క్రెడిట్ కార్డు చెల్లింపు వివ‌రాలు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు నివేదించ‌బ‌డ‌తాయి.

బంగారు ఈటీఎఫ్‌లు

బంగారు ఈటీఎఫ్‌లు

బంగారు ఈటీఎఫ్‌ల్లో ఒక వ్య‌క్తి రూ. 1 ల‌క్ష‌కు మించి చేసే పెట్టుబ‌డి వివ‌రాలు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు దృష్టికి వెళ‌తాయి.

మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్లు

మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్లు

రూ. 2 లక్ష‌ల‌కు మించి ఒక పెట్టుబ‌డిదారు మ్యూచువ‌ల్ ఫండ్లు యూనిట్ల‌ను కొనుగోలు చేస్తే ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేట‌ప్పుడు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు వెల్ల‌డించాలి. కంపెనీలే ఈక్విటీ షేర్ల‌లో రూ. ల‌క్ష‌కు మించి పెట్టుబ‌డుల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు వెల్ల‌డిస్తాయి.

ఆదాయ‌పు ప‌న్ను శాఖ నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఆన్‌లైన్ ఫైలింగ్‌లో 61ఏ ఫారం ద్వారా అధిక విలువ క‌లిగిన లావాదేవీల‌ను తెలియ‌జేసయాల్సి ఉంటుంది.

English summary

ఈ లావాదేవీల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ క‌న్ను | List of High Value Financial Transactions reported to Income Tax Dept

Tax Department regularly alerts people about high transactions. The below expenses / investments are reported to the IT department. If there is a mismatch between your declared income in ITR and your investment, you may get an Income Tax Notice. So, keep a track of the below high value financial transactions;
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X