English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

త‌క్కువ‌ పెట్టుబ‌డితో 11 బిజినెస్ ఐడియాలు

Posted By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

  మీకు ఎక్కువ మందితో ప‌రిచ‌యాలు ఉండి, విజ‌యం పొందాల‌నే త‌ప‌న ఉంటే చాలు అంత ఎక్కువ మూల‌ధ‌నం లేదా పెట్టుబ‌డి అవ‌స‌ర‌మే లేదు. త‌క్కువ పెట్టుబ‌డితో చాలా వ్య‌పారాల‌ను ప్రారంభించ‌వ‌చ్చు. కొన్నింటికి రూ. 1 ల‌క్ష వ‌ర‌కూ అస‌ర‌మ‌వుతుండగా, మరికొన్నింటికి న‌గ‌దు అవ‌స‌ర‌మే లేదు. కావాల్సిందల్లా ఐడియా, దాని అమ‌లు, ప్ర‌ణాళిక బ‌ద్దంగా న‌డుపుకోవ‌డం. అలాంటి 11 ఐడియాల గురించి ఇక్క‌డ చూద్దాం.

 బేబీ సిట్టింగ్‌

బేబీ సిట్టింగ్‌

విప‌రీత‌మైన న‌గ‌రీక‌ర‌ణ మూలంగా పిల్ల‌ల‌ను చూసుకోవ‌డానికి త‌ల్లిదండ్రుల‌కు స‌మ‌యం ఉండ‌టం లేదు. దీంతో బేబీ సిట్టింగ్ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. మీరు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించుకోగ‌లిగితే బాగా డ‌బ్బు సంపాదించే అవ‌కాశం ఉంది.

దీనికి పెట్టుబ‌డి దాదాపుగా అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే ఎక్కువ మంది వారి పిల్ల‌ల‌ను వారే చూసుకుంటారు. అలా ఇంటి ద‌గ్గ‌ర స‌మ‌యం గ‌డ‌ప‌గ‌లిగే వారు ఉంటే, అదే ప్రాంతంలో పిల్ల‌ల‌ను బేబీ సిట్టింగ్ వ‌దిలే త‌ల్లిదండ్రుల‌ను విచారించి వ్యాపారం మొద‌లెట్ట‌చ్చు.

 బ్యూటీషియ‌న్‌

బ్యూటీషియ‌న్‌

ఈ రోజుల్లో ఇండి వ‌ద్ద‌కే వ‌చ్చే బ్యూటీకి సంబంధించిన సేవ‌ల‌ను అందించే బ్యూటీషియ‌న్ల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో బ్యూటీషియ‌న్లుగా బాగా స్థిర‌ప‌డిన వారికి బ్యూటీషియ‌న్‌ల‌ను త‌యారుచేసే సంస్థ పెట్ట‌డం మంచి ఐడియా. ఎంత బాగా పేరు సంపాదించి, అంత ఎక్కువ ప‌రిచ‌యాల‌ను క‌లిగి ఉంటే అంత ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

టిఫిన్ స‌ర్వీస్‌

టిఫిన్ స‌ర్వీస్‌

మీకు వంట చేయ‌డంలో ప్రావీణ్యం ఉంద‌ని భావిస్తే టిఫిన్ సెంట‌ర్‌ను న‌డుపుకోవ‌చ్చు. ఇంటి వంట‌లాగే ఉండే ఆహారాల‌ను తినే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ వ్యాపారానికి కాస్త పెట్టుబ‌డి కావాలి. ఇంటి నుంచే న‌డుపుకునే వీలుంటుంది.

 పెట్ కేర్‌

పెట్ కేర్‌

మీకు పెంపుడు జంతువులంటే ఇష్టం ఉంటే, పెంపుడు జంతువుల సంర‌క్ష‌ణ వ్యాపారం (పెట్ కేర్‌) చేప‌ట్ట‌వ‌చ్చు. మీకు స్వంత స్థ‌లం ఉన్న‌ట్ల‌యితే దీనిని సున్నా పెట్టుబ‌డితో ప్రారంభించ‌వ‌చ్చు.

 ట్యాక్సీ స‌ర్వీసెస్‌

ట్యాక్సీ స‌ర్వీసెస్‌

పెరుగుతున్న న‌గ‌రీక‌ర‌ణ‌, ప్ర‌యాణాల మూలంగా ఈ వ్యాపారం ఊపందుకుంటోంది. మామూలు వ్య‌క్తులు సైతం ఈ వ్యాపారాన్ని చూసుకునేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. మీకు సొంత వాహ‌నం ఉంటే ఈ వ్యాపారాన్ని పెట్టుబ‌డి లేకుండానే మొద‌లుపెట్ట‌వ‌చ్చు.

ట్యూష‌న్స్‌

ట్యూష‌న్స్‌

పిల్ల‌ల‌కు బాగా బోధించే తెలివి ఉండి, వారిని హ్యాండిల్ చేయ‌గ‌లిగే నైపుణ్యం ఉంటే ఇది మంచి ఐడియా. అయితే దానిలో ఉండే లోతుపాతుల గురించి ఆ రంగంలో ఉండే వారి సల‌హాలు తీసుకోవ‌డం మంచిది.

వంట పాఠాలు

వంట పాఠాలు

వంట చేయ‌డంలో నైపుణ్యం ఉండి, బాగా ఎదుటివారికి వివ‌రించ‌గ‌లం అనుకునేవారు ఈ విధంగాను డ‌బ్బు సంపాదించుకోవ‌చ్చు. దీనికి పెద్ద‌గా పెట్టుబ‌డి అవ‌స‌రం లేదు. హోమ్‌మేక‌ర్లు మీ నుంచి నేర్చుకునేందుకు ఆస‌క్తి చూపుతారు.

డ్యాన్స్‌, ఏరోబిక్‌, యోగా పాఠాలు

డ్యాన్స్‌, ఏరోబిక్‌, యోగా పాఠాలు

మీకు ఏదైనా క‌ళ‌లో నైపుణ్యం ఉంటే ఈ విధంగాను చేయ‌వ‌చ్చు. డ్యాన్స్ పాఠాలు నేర్పించ‌డం మంచి డిమాండ్ క‌లిగిన రంగం. అలాగే ఏరోబిక్‌, యోగా వంటి అంశాల‌ను సైతం నేర్చుకునేందుకు చాలా మంది ఎదురుచూస్తుంటారు.

 కొరియ‌ర్ కంపెనీ

కొరియ‌ర్ కంపెనీ

ఎన్నో కొరియ‌ర్ కంపెనీల‌కు త‌మ వ్య‌వ‌హారాల‌ను చిన్న చిన్న ఏరియాల్లో ఫ్రాంచైజీలుగా నిర్వ‌హించేందుకు కొత్త వ్యక్తుల అవ‌స‌రం ఉంటుంది. ప్ర‌స్తుతం డీటీడీసీ(డోర్ టు డోర్ కొరియ‌ర్‌) కంపెనీకి ఎన్నో ఫ్రాంచైజీలు ఉండ‌టాన్ని చూస్తుంటాం. ఏదైనా చిన్న స్థ‌లం కోసం అద్దె క‌ట్ట‌గ‌లిగి, మ‌నుషుల‌ను నిర్వ‌హించుకోగ‌లం అనుకునే వారికి ఈ వ్యాపారం అనువైన‌ది.

 ఫ్రీలాన్స‌ర్స్‌

ఫ్రీలాన్స‌ర్స్‌

ఫ్రీలాన్స్ రైటింగ్‌, వెబ్ డిజైనింగ్‌, వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ వంటి అవ‌కాశాల కోసం సైతం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అన్ని రంగాల నిపుణుల‌కు ఈ రంగాల్లో నూత‌న అవ‌కాశాలు బాగా ఉప‌యుక్తంగా ఉంటాయి.

ఫైనాన్సియ‌ల్ లేదా పోర్ట్‌ఫోలియో క‌న్స‌ల్టెంట్

ఫైనాన్సియ‌ల్ లేదా పోర్ట్‌ఫోలియో క‌న్స‌ల్టెంట్

ఆర్థిక వ్య‌వ‌హారాల్లో మీరు నైపుణ్యం క‌లిగి ఉన్న‌ట్ల‌యితే పోర్ట్‌ఫోలియో క‌న్స‌ల్టెంట్‌గా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. త‌క్కువ పెట్టుబ‌డితోనే దీన్ని ప్రారంభించ‌వ‌చ్చు.

Read more about: capital, contacts, small business
English summary

11 Business Ideas That Require Zero Investment

You do not need too much capital, if you have the contacts and a desire to succeed. Several businesses can be set-up with a small capital and mostly with sums under Rs 1 lakh. In some cases with no money at all. Take a look at 11 such business ideas.
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns