For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెన్నైలో పాత నోకియా ఉద్యోగులు ఆంధ్ర ఫాక్స్‌కాన్‌కు

|

చెన్నైలో మూత‌ప‌డిన నోకియా ఉద్యోగుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఫాక్స్‌కాన్ ఉద్యోగాలు క‌ల్పిస్తోంది. మొబైల్ త‌యారీ కంపెనీ శ్రీ‌సిటీ సెజ్‌లో ఉన్న త‌మ అసెంబ్లింగ్ ప్లాంట్‌లో 2 వేల మంది ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటోంది. ఇది వ‌ర‌కే శ్రీ‌పెరంబుదూర్‌లోని నోకియా కంపెనీలోని 3000 మంది ఉద్యోగులను తీసుకుంది. ప‌న్ను వివాదం కార‌ణంగా నోకియా త‌మిళ‌నాడు ప్లాంటును మూసివేసిన సంగ‌తి విదిత‌మే.

 చెన్నైలో పాత నోకియా ఉద్యోగులు ఆంధ్ర ఫాక్స్‌కాన్‌కు

ఫాక్స్‌కాన్ అధికారిక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం త‌మ ఉద్యోగులంద‌రికీ శ్రీ‌సిటీ సెజ్‌లో ప‌ని క‌ల్పించిన‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో త‌మిళ‌నాడు శ్రీ‌పెరంబుదూరులోని నోకియా కంపెనీలో స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకున్న వారంద‌రూ ఉద్యోగాల్లో చేరిన‌ట్ల‌వుతోంది. ఈ వివ‌రాల‌న్నీ పీటీఐ ద్వారా వెల్ల‌డ‌య్యాయి. మూత‌ప‌డిన నోకియా ప్లాంట్లో ఉద్యోగాలు చేస్తున్న‌వారిలో ఎక్కువ మంది 20 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు వారున్నారు.

మొబైల్ త‌యారీ దిగ్గ‌జం నోకియా 2014లో ప‌న్ను వివాదం కార‌ణంగా త‌న ప్లాంట్‌ను 7.2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు మైక్రోసాఫ్ట్‌కు అమ్మేసింది. దీంతో అప్ప‌ట్లో చాలా మంది ఉద్యోగులు నిరాహార‌దీక్ష‌కు పూనుకోవాల్సి వ‌చ్చింది. దానికి దిగివ‌చ్చిన కంపెనీ వారంద‌రికీ స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది.

English summary

చెన్నైలో పాత నోకియా ఉద్యోగులు ఆంధ్ర ఫాక్స్‌కాన్‌కు | Foxconn hires ex-staff of Nokia Chennai plant

Electronics equipment maker Foxconn India has re-employed more than 2,000 workers of its two closed plants near here for its assembling unit at Sri City SEZ in Andhra Pradesh. SEZ refers to special economic zone.
Story first published: Wednesday, July 13, 2016, 15:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X