For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2016లో అత్యధిక వేతనం చెల్లించే 5 హాటెస్ట్ జాబ్స్

By Nageswara Rao
|

ముంబై: 2016 కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరం టెక్నాలజీ రంగానిదే కీలకపాత్ర అని రిక్రూటర్లు అంచనా. ముఖ్యంగా ఈ కామర్స్, ఆర్ధిక సేవలు అందించే సంస్ధలతో పాటు ప్రొడక్ట్ డెవలెప్మెంట్ తదితర సెక్టార్లలో అనుభవం ఉన్న సాప్ట్‌వేర్ ఉద్యోగులకు భారీ డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

డిజిటల్ మార్కెటింగ్ హెడ్స్:

డిజిటల్ మార్కెటింగ్ హెడ్స్:

ఈ ఏడాది డిజిటల్ మార్కెటింగ్ హెడ్స్‌కు మంచి గిరాకీ ఉంటుందని అంచనా. దేశంలోని ప్రధాన కంపెనీలు ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలకు మరింతగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలకు తమ డిజిటల్ మార్కెటింగ్ టీంను బలోపేతం చేసుకోవడమన్నది పెద్ద సవాలేనని మైఖేల్ పేజ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ నికోలస్ డుమోలిన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ మార్కెటింగ్‌లో అనుభవం ఉన్న వారికి సంవత్సరానికి రూ. 30 నుంచి రూ. 60 లక్షల వరకూ వేతనాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.

ప్రొడక్ట్ డెవలపర్స్:

ప్రొడక్ట్ డెవలపర్స్:

వివిధ రంగాల్లో ఐటీ కంపెనీలు తమ సేవలను విస్తరించే పనిలో ఉన్నాయి. అంతేకాదు డిమాండ్‌కు తగ్గట్టుగా సేవలు అందించాలన్న విషయంలో వినూత్న ఆలోచనలతో వచ్చే టెక్కీలకు కంపెనీలు పెద్దమొత్తంలో చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా కొత్త కంపెనీలు ప్రొడక్ట్ డెవలపర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని మాన్సర్ కన్సల్టింగ్ సంస్థ సీఈఓ సత్యా సిన్హా వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ డిగ్రీ ఉండి ప్రొడక్ట్ డెవలపర్‌గా ఉద్యోగం ‌వస్తే ఏడాదికి జూనియర్ స్థాయిలో రూ. 15 లక్షలకు పైగా, సీనియర్లకు రూ. 50 లక్షలకు పైగా వేతనాలు అందుతాయి.

సీనియర్ మేనేజర్స్: ఈ కామర్స్

సీనియర్ మేనేజర్స్: ఈ కామర్స్

2016 ఈ కామర్స్ రంగానిదేనని అత్యధిక మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈకామర్స్ రంగంలో సీనియర్ మేనేజర్లకు మంచి డిమాండ్ ఉంది. ఉత్పత్తులను వినియోగదారులకు నచ్చేలా వెబ్‌సైట్లో తీర్చిదిద్దడం, తమ కింద పనిచేసే వారిని సరైన దారిలో నడిపించడంలో నైపుణ్యం చూపగలిగే వారికి ఈ కామర్స్ కంపెనీలు రూ. 1 కోటి నుంచి రూ. 10 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.

డేటా అనలిటిక్స్:

డేటా అనలిటిక్స్:

స్టార్టప్ కంపెనీ నుంచి కార్పోరేట్ కంపెనీ వరకు ఈ డేటా అనలిటిక్స్ అవసరం. అంతేకాదు టెక్నాలజీ విభాగంలో సమాచార విశ్లేషణ అత్యంత కీలకం. గణితశాస్త్రంతో పాటు, విశ్లేషణా సామర్థ్యమున్న వారికి కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ విభాగంలో ఈ ఏడాది ప్రెషర్స్‌కు భారీ ఎత్తున ఉద్యోగాలు ఉంటాయని అంచనా. ప్రెషర్ స్థాయి నుంచే రూ. 10 లక్షల వరకూ, సీనియర్ పోస్టుల్లో రూ. 70 లక్షల నుంచి రూ. 1 కోటి వరకూ వేతనాలు అందుతాయి.

మొబైల్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్:

మొబైల్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్:

భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సెక్టార్లలో ఇదొకటి. గతేడాది చివరి నాటికి మొబైల్ వాడకందారుల సంఖ్య 50 కోట్లను దాటిందన్నది జీఎస్ఎంఏ నివేదిక అంచనా. ఇక మొబైల్ ద్వారా నెట్ సేవలు పొందుతున్న వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతుండటంతో, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా వినియోగదారుడి అభిరుచికి తగ్గట్టుగా మంచి ఉత్పత్తులను తయారుచేయ గలిగే టెక్కీలకు ఐటీ కంపెనీలు మంచి వేతనాలు ఇస్తున్నాయి. వినూత్న మొబైల్ యాప్‌లను తయారు చేసే వారికి ఎంట్రీ లెవల్ లో రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షలు, సీనియర్ పోస్టులకు రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షల వేతనాలు అందుతాయి.

English summary

2016లో అత్యధిక వేతనం చెల్లించే 5 హాటెస్ట్ జాబ్స్ | 5 hottest IT jobs of 2016 and how much they pay

As 2016 approaches, recruiters expect an increase in demand across sectors, be it e-commerce, financial services or mobile product development.
Story first published: Tuesday, January 5, 2016, 13:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X