For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: విధుల్లో నిర్లక్ష్యం వహించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త. పనితీరుకు సంబంధించి నిర్దేశిత ప్రమాణాలను చేరుకొని ఉద్యోగులకు వార్షిక వేతన పెంపుదలను (ఇంక్రిమెంట్లు) అమలు చేయకూడదని ఏడో వేతన సంఘం సిఫారసు చేసింది.

కేంద్ర ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగులందరికీ పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలని వేతన సంఘం సిఫారుసు చేసింది. తొలి 20 ఏళ్ల సర్వీసులో ఎంఏసీపీ, లేదా పదోన్నతిని పొందేందుకు అవసరమైన స్థాయిని కనబరచకపోతే వారి ఇంక్రిమెంట్లను నిలిపివేయాలని సూచించింది.

 పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

పని చేయకపోయినా ఇంక్రిమెంట్లు, పదోన్నతులు యథాలాపంగా వచ్చేస్తాయన్న అవగాహన పాతుకుపోయిందని, దీనిని మార్చాల్సి ఉందని పేర్కొంది. అలాగే అన్ని కేటగిరీలు, స్థాయిల్లో ప్రదర్శన ఆధారిత వేతనం (పీఆర్‌పీ) పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించింది.

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

పదోన్నతుల్లానే వేతనం కూడా క్రమానుగుణంగా పెరగాలని పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలను అందుకోని ఉద్యోగులు భవిష్యత్తులో ఇంక్రిమెంట్లు అందుకోకుండా నిరోధించాలని కమిషన్ అభిప్రాయపడుతున్నట్టు తెలిపింది. తొలి 20 ఏళ్ల సర్వీసులో సాధారణ పదోన్నతుల నుంచి కూడా వారిని మినహాయించాలని సూచించింది.

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

కేవలం ఇది ప్రదర్శనకు సంబంధించిన అంశమే కనుక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీసుకొనే నిర్ణయాలకు ఇది వర్తించదని తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా సదరు ఉద్యోగులు కావాలంటే స్వచ్ఛంద పదవీ విరమణ నియమనిబంధనల ప్రకారం ఉద్యోగం వదిలేయవచ్చని పేర్కొంది.
పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

ఈ నిబంధనలు ఉద్యోగుల్లో మార్పు కోసమేనని కమిషన్ అభిప్రాయపడింది. వీటన్నింటితోపాటు ఎంఏసీపీ ఇచ్చే ముందు డిపార్ట్‌మెంటల్ పరీక్షల వంటి వాటిల్లో కచ్చితమైన పద్ధతిని తీసుకురావాలని సూచించింది. ఏడో వేతన సంఘం చేసిన సిఫారసులను సానుకూల దృష్టితో అధ్యయనం చేస్తామని, ఆ తరువాతనే తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చెప్పారు.

 పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు

ఏడో వేతన సంఘం సిఫారసులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే నిధులకు కోత పెట్టాల్సి వస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ డేబ్రాయ్ అన్నారు. కమిషన్ సిఫారసులను కేంద్రం అమలు చేయగానే, రాష్ర్టాలు సైతం తమ ఉద్యోగుల వేతనాలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

English summary

పని చేస్తేనే ఇంక్రిమెంట్లు: ఏడో వేతన సంఘం సిఫారసు | Seventh Pay Commission suggests inflation-guard for Sebi, CCI salaries

As the government continues its search for new heads of two key regulators Sebi and CCI, the Seventh Pay Commission has recommended guarding their salaries against inflationary erosion.
Story first published: Monday, November 23, 2015, 12:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X