For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: సుమారు 60 ఏళ్ల పాటు చిత్తూరుకు పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టిన న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. కంపెనీ లాకౌట్ దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఫ్యాక్టరీని నడపలేమని యాజమాన్యం సిబ్బందికి నోటీసు జారీ చేసింది.

దీంతో బుధవారం ఉద్యోగులు, కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన కార్మికులు, ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం ఓ నోటీసు జారీ చేసింది.

అందులో కంపెనీ నెలసరి ఉత్పత్తి నాలుగు వేల టన్నుల నుంచి 400 టన్నులకు పడిపోయిందని, కంపెనీ తిరిగి లాభాల బాట పట్టేందుకు 15 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. దీనిపై ఎలాంటి స్పందనా లేకపోవడంతో సెప్టెంబర్ 18వ తేదీన మరో నోటీసు జారీ చేసింది.

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ

నష్టాలతో ఫ్యాక్టరీని నడపలేమని, అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఫ్యాక్టరీని నడిపే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న 295 మంది ఉద్యోగులు, కార్మికులను పిలిపించి సీనియారిటీ ఆధారంగా బెనిఫిట్స్‌ చెల్లిస్తామని యాజమాన్యం తెలిపింది.

 మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ

1952లో న్యూట్రిన్‌ ఫ్యాక్టరీని చిత్తూరు జిల్లాకు చెందిన బివి రెడ్డి ప్రారంభించారు. 1964లో బివి రెడ్డి మరణించారు. ఆయన మరణంతో కుమారుడు ద్వారక నాథరెడ్డి కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక రంగంవైపు ఆసక్తి చూపడంతో తన అన్న కుమారుడు విక్రమ్‌రెడ్డికి కంపెనీ అప్పగించారు.

 మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ

ఆయన నేతృత్వంలో కంపెనీ రూ.150 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. బిస్కట్లు, టాఫీలు, క్యాండీలు, గమ్స్‌, హనీఫాబ్‌, నాచురోఫుడ్‌ బార్‌ ఇలా 40 రకాల ఉత్పత్తులతో 3,000 మంది ఉద్యోగులు, కార్మికులతో చాక్‌లెట్ల తయారీలో అగ్రగామిగా ఆవిర్భవించింది.

 మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ

ఆ తర్వాత 2004లో న్యూట్రిన్‌ ఫ్యాక్టరీని బివి రెడ్డి కుటుంబం నుంచి గోద్రెజ్ కొనుగోలు చేసింది. 2007లో గోద్రెజ్‌ నుంచి హెర్షీస్‌ యాజమాన్యం చేతికి వెళ్లింది. ఇటీవల నష్టాలకు గురైన కంపెనీ క్రమంగా ఒక్కో ఉత్పత్తినీ ఆపేస్తూ వచ్చింది. ఐటిసి పోటీని తట్టుకోలేకే కంపెనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని యాజమాన్యం చెబుతోంది.

English summary

మూతపడనున్న 60 ఏళ్ల న్యూట్రిన్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ (ఫోటోలు) | Nutrine factory likely to announce lockout

Tension prevailed on the premises of the Nutrine Confectionery Company Limited in Chittoor town on Wednesday evening. The company management held talks with the employees’ union leaders on the grounds that the factory was running in losses.
Story first published: Thursday, October 1, 2015, 12:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X