For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో ఐటీ వేతనాలు చాలా తక్కువ (ఫోటోలు)

By Nageswara Rao
|

ప్రపంచ దేశాల్లో అతి తక్కువ జీతం చెల్లించే ఐటీ యాజమాన్యాల జాబితాలో భారతీయ ఐటీ కంపెనీలు ఉన్నాయని ఓ సర్వే వెల్లడించింది. అతి తక్కువ జీతం చెల్లిస్తున్న దేశాల జాబితాలో భారత్‌కు 7వ స్ధానం లభించింది. ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ సంస్థ మైహైరింగ్.కామ్ ప్రపంచ వ్యాప్తంగా ఓ సర్వేని నిర్వహించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ జీతాలు 2015 పేరుతో నివేదికను విడుదల చేసింది. 40 దేశాల్లోని 9,413 ఐటీ ఉద్యోగులు అందుకున్న వేతన వివరాల ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించారు. ఈ సర్వే ప్రకారం భారతీయ ఐటీ కంపెనీల్లో మధ్యస్థాయి మేనేజర్‌కు లభించే వేతనం 41,213 డాలర్లుగా ఉండగా స్విస్‌లో సాఫ్ట్‌వేర్ మేనేజర్లు ఇందుకు 4 రెట్ల అధిక జీతం అందుకుంటున్నారు.

భారత్‌లో ఐటీ వేతనాలు చాలా తక్కువ

భారత్‌లో ఐటీ వేతనాలు చాలా తక్కువ

ఐటీ సిబ్బందికి ఆకర్షణీయమైన జీతాలు చెల్లిస్తున్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడి ఐటీ ఉద్యోగి సగటు వార్షిక జీతం 1.71 లక్షల డాలర్లుగా ఉంది. ఇక 1.52 లక్షల డాలర్లకు పైగా చెల్లిస్తున్న బెల్జియం రెండో స్థానంలో ఉంది.

 భారత్‌లో ఐటీ వేతనాలు చాలా తక్కువ

భారత్‌లో ఐటీ వేతనాలు చాలా తక్కువ

ఈ విషయంలో డెన్మార్క్(1.39 లక్షల డాలర్లు) మూడో స్థానంలో, అమెరికా(1.33 లక్షల డాలర్లు), బ్రిటన్(1.29 లక్షల డాలర్లు) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఇక అతి తక్కువ జీతం చెల్లిస్తున్న దేశాల జాబితాలో బల్గేరియా ఐటీ కంపెనీలు మొదటి స్థానంలో ఉన్నాయి.

 భారత్‌లో ఐటీ వేతనాలు చాలా తక్కువ

భారత్‌లో ఐటీ వేతనాలు చాలా తక్కువ

అక్కడి సంస్థల్లో ఐటీ మేనేజర్ల సరాసరి జీతం 25,680 డాలర్లుగా ఉంది. వియత్నాంలోని సాఫ్ట్‌వేర్ సంస్థలు మధ్యస్థాయి మేనేజర్‌కు సరాసరిగా 30,938 డాలర్ల వేతనం చెల్లిస్తున్నాయి. ఇక థాయ్‌లాండ్‌లో ఈ మొత్తం 34, 423 డాలర్లుగా ఉంది.

 భారత్‌లో ఐటీ వేతనాలు చాలా తక్కువ

భారత్‌లో ఐటీ వేతనాలు చాలా తక్కువ

మన పక్క దేశమైన చైనా మనకంటే కాస్తంత మెరుగ్గా 8వ స్ధానంలో ఉంది. చైనాలో ఐటీ మేనేజర్‌కు లభిస్తున్న వార్షిక పారితోషికం 42,689 డాలర్లుగా నమోదైంది. ఐటీ ఉద్యోగుల జీతాలు తక్కువ స్థాయిలో ఉండటం వల్లే ఇండియా ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టులకు ఆకర్షణీయ దేశంగా మారిందని నివేదిక పేర్కొంది.

English summary

భారత్‌లో ఐటీ వేతనాలు చాలా తక్కువ (ఫోటోలు) | Indian IT companies pay worst salaries: study

Indian IT companies are among the 10 worst paymasters in the world, says a survey -- a mid-level IT manager draws an average salary of $41,213 while his Swiss counterpart gets over four times more.
Story first published: Tuesday, September 22, 2015, 11:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X