For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాల్‌డ్రాప్ సమస్యను ప్రధాని మోడీ సీరియస్

By Nageswara Rao
|

టెలికం రంగంలో వినియోగదారులు ప్రయోజనాలకు గండికొడుతున్న కాల్‌డ్రాప్స్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమస్య డేటాకు విస్తరించకుండా చూడాలని కూడా ఆయన సూచించారు.

ప్రధాని డిజిటల్‌ ఇన్‌ఫ్రా, రూరల్‌ ఇన్‌ఫ్రా, కనెక్టివిటీ విభాగాల పురోగతిని సమీక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు తాను ఎర్రకోట నుంచి చేసిన ప్రకటనకు అనుగుణంగా దేశంలోని అన్ని గ్రామాలకు వెయ్యి రోజుల్లోగా విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు గట్టిగా కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కాల్‌డ్రాప్ సమస్యను తక్షణమే పరిష్కరించండి: ప్రధాని మోడీ

కాల్‌డ్రాప్ సమస్యను తక్షణమే పరిష్కరించండి: ప్రధాని మోడీ

కాల్‌డ్రాప్ సమస్యను నివారించేందుకు, గ్రామాల్లో మొబైల్ కనెక్టివిటీ పెంచేందుకు టెలికం, రైల్వే, ఇతర సమాచార రంగాల్లో మౌలిక వసతుల సామర్థ్యం మరింత పెంచాలని అధికారులను ప్రధాని కోరారు. మారుమూల ప్రాంతాలకు మొబైల్‌ సేవలను విస్తరించే విషయంలో రైల్వే, ఇతర ఇన్‌ఫ్రా వసతులను ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలని ప్రధాని సూచించారు.

 కాల్‌డ్రాప్ సమస్యను తక్షణమే పరిష్కరించండి: ప్రధాని మోడీ

కాల్‌డ్రాప్ సమస్యను తక్షణమే పరిష్కరించండి: ప్రధాని మోడీ

డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఈ రంగంలో మౌలిక వసతుల ఏర్పాటు ఉండేలా చూడాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల పురోగతినీ ఆయన సమీక్షించినట్లు పీఎంవో తెలిపింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వద్ద సోలార్ యూనిట్ల ఏర్పాటుపై ఆరా తీసినట్లు వెల్లడించింది.

 కాల్‌డ్రాప్ సమస్యను తక్షణమే పరిష్కరించండి: ప్రధాని మోడీ

కాల్‌డ్రాప్ సమస్యను తక్షణమే పరిష్కరించండి: ప్రధాని మోడీ

మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించి తగినన్ని నిధులు కేటాయించిన నేపథ్యంలో ప్రణాళికలు పక్కాగా అమలయ్యేలా చూసే బాధ్యత సంబంధింత మంత్రిత్వ శాఖలదేనని మోడీ పేర్కొన్నారు. సమీక్ష సమావేశానికి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగరియాతోపాటు పీఎంవో, నీతి ఆయోగ్, పలు మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు.

 కాల్‌డ్రాప్ సమస్యను తక్షణమే పరిష్కరించండి: ప్రధాని మోడీ

కాల్‌డ్రాప్ సమస్యను తక్షణమే పరిష్కరించండి: ప్రధాని మోడీ

ఇక కాల్‌డ్రాప్ సమస్య విషయంలో మొబైల్ ఆపరేటర్ల తీరుపై టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. సమస్య పరిష్కారానికి నెట్‌వర్క్ సామర్థ్యం పెంచుకోవాలని, వారు తమ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని అన్నారు. కాల్‌డ్రాప్ సమస్య పరిష్కారాని ప్రభుత్వం ఏం చేయాలో ఇప్పటికే చేసిందని, కావాలంటే మరిన్ని చర్యలు తీసుకుంటుందని, కానీ టెలికం ఆపరేటర్లు మాత్రం వారు బాధ్యతలను నిర్వర్తించాలని మంత్రి తెలిపారు.

 కాల్‌డ్రాప్ సమస్యను తక్షణమే పరిష్కరించండి: ప్రధాని మోడీ

కాల్‌డ్రాప్ సమస్యను తక్షణమే పరిష్కరించండి: ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా ఉన్న సమస్యతో కాల్‌డ్రాప్ సమస్య కస్టమర్లు చార్జీల రూపంలో నష్టపోవాల్సి వస్తుందన్నారు. గత మూడు నాలుగు నెలల్లో కాల్‌డ్రాప్‌ సమస్య ఎందుకు తీవ్రతరం అయిందన్న విషయం ప్రభుత్వ రంగ ఆపరేటర్లతో పాటు అందరూ పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

English summary

కాల్‌డ్రాప్ సమస్యను ప్రధాని మోడీ సీరియస్ | PM Reviews Progress Of Infrastructure Sectors

The Prime Minister sought details from officials on preparations for providing electricity to all unconnected villages in the country within 1000 days, as mentioned in his Independence Day address. He directed concerned departments to monitor progress towards this goal on a real-time basis.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X